OTT Movie : సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో ఉండే మంత్రాలు చేతబడులు వంటివి సినిమాకు హైప్ తెస్తాయి. ఇప్పుడు మనం చెప్పబోయే మూవీ, ఒక సైకాలజిస్ట్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఇందులో దయ్యాలు, భూతాలు లేవని ఆ డాక్టర్ నమ్ముతుంటాడు. ఆతరువాత వీటి ద్వారానే ఆ డాక్టర్ సమస్యల్లో పడతాడు. అలా ఈ స్టోరీ ముందుకు వెళుతూ ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ తమిళ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అష్టకర్మ’ (Astakarmma). 2022 లో విడుదలైన ఈ మూవీకి విజయ్ తమిళ్సెల్వన్ రచన చేసి, దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సి.ఎస్. కిషన్, నందిని రాయ్, శ్రీత సివదాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒక తాంత్రికుడు తన దగ్గరకు వచ్చిన వాళ్లకు ఆత్మలు ఆవహిస్తాయని చెప్పి, వాళ్లకు ఉన్న ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ గా చెప్తాడు. వచ్చిన వాళ్ళు కూడా అతను చెప్పేది నిజమని నమ్మి డబ్బులు కూడా బాగా ఇస్తుంటారు. అయితే ఇవన్నీ కట్టు కథలు అని చెప్పి అర్జున్ అనే సైకాలజిస్ట్ అతని కుట్రలను బయటపెడతాడు. అతని దగ్గర వచ్చే వాళ్ళ రహస్యాలను ముందే తెలుసుకొని, వాళ్ల ముందు ఆత్మ వచ్చినట్టు నటిస్తూ అందరిని బోల్తా కొట్టిస్తుంటాడు. ఈ డాక్టర్ రావడంతో అతని వ్యాపారం తగ్గిపోతుంది. ఆ డాక్టర్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు తాంత్రికుడు. అర్జున్ కి పారానార్మల్ శక్తుల గురించి అంతగా నమ్మకం ఉండదు. అతనికి తన రోగులు చెప్పే అలాంటి విషయాలను చూసి, వాళ్ళకు వచ్చింది ఒక మానసిక రుగ్మతలుగా భావిస్తాడు. ఇదంతా బాగాఅనే ఉన్నా, ఒక మహిళా రోగికి చికిత్స చేస్తున్నప్పుడు అతని జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలో అర్జున్ అతీంద్రియ శక్తులు, తాంత్రిక ఆచారాలతో కూడిన సంఘటనలను ఎదుర్కొంటాడు. చివరికి ఆ డాక్టర్ మంత్రాలతో ఎదుర్కున్న సమస్యలు ఏమిటి ? అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ మూవీ తమిళ సినిమాల్లో అరుదైన హారర్-మిస్టరీ శైలిని ఎంచుకోవడం వల్ల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. విజువల్స్, థ్రిల్లర్ మూమెంట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ను చాలా మంది ప్రశంసించారు.
Read Also : స్వప్న కలలతో కొత్త జీవితం … చనిపోయిన వాళ్ళను మళ్ళీ చూడగలిగితే … బి. యఫ్. జి లాంటి క్రేజీ మూవీ