BigTV English

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా.. రెండు ఒకేసారి ఎంట్రీ..!

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా.. రెండు ఒకేసారి ఎంట్రీ..!

Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది కల్కి మూవీతో ప్రేక్షకుల అలరించాడు. తాజాగా మరో రెండు మూవీలతో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం లో రాజా సాబ్ చేస్తున్నాడు. హను రాఘవపూడి కాంబినేషన్ లో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒకేసారి రెండు సినిమాలతో థియేటర్లలో వస్తున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


రాజా సాబ్ మళ్లీ వాయిదా..?

రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో రాజా సాబ్ సినిమా రాబోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీలో డార్లింగ్ కనిపిస్తున్నాడు. డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాడు. సమ్మర్ స్పెషల్ గా మూవీ రాబోతుందని ముందుగా అనౌన్స్ చేశారు.. కానీ ఇప్పుడు వాయిదా పడిందని ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇప్పటికే మూడుసార్లు పోస్ట్ పోన్ అయింది. ఇక మీదట కూడా ఇలానే సినిమా డేట్ అనౌన్స్ చేసి ఇంకోసారి పోస్ట్ పోన్ చేస్తే మాత్రం అభిమానులు తీవ్రస్థాయిలో వ్యతిరేకతను చూపించే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం. లేదంటే మాత్రం సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తుంది..


రెండు సినిమాలు ఒకేసారి..

రాజా సాబ్ మూవీ, ఫౌజీ సినిమాల ను ఒకేసారి రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. నెలరోజుల గ్యాప్ లోనే రెండు సినిమాలు రాబోతున్నాయి అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. రెండు సినిమాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రభాస్ వీలైనంత తొందరగా రాజాసాబ్ సినిమా రిలీజ్ చేసుకుంటే మంచిది. లేదంటే మాత్రం ఓపెనింగ్స్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ పూర్తి అయ్యింది.. రెండు సినిమాలను ఫినిష్ చేసి స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడని టాక్.. ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఇప్పుడు రాబోయే సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తేనే మరోసారి పాన్ ఇండియా మార్కెట్ ను భారీగా పెంచుకున్న హీరోగా నిలుస్తాడు. లేదంటే మాత్రం మళ్లీ కెరీర్ టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎమౌతుందో చూడాలి..

ఈ మూవీల తర్వాత స్పిరిట్ ను త్వరగా పూర్తి చేసి, సలార్ 2, కల్కి 2 సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడని సన్నిహిత వర్గాల్లో టాక్.. కల్కి 2 షూటింగ్ ఎప్పుడో మొదలైందని టాక్. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.. మొత్తానికి ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×