Sweating On Face: ముఖంపై చెమట పట్టడం చాలా ఇబ్బందికరమైన సమస్య. వేసవి కాలంల అధిక ఉష్ణోగ్రతల వల్ల లేదా ఆందోళన, ఒత్తిడి, లేదా శారీరక శ్రమ వల్ల ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. ఇలాంటి సమయాల్లో ముఖంపై చెమటను వెంటనే తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు మీకు త్వరగా ఉపశమనం అందించడంతో పాటు.. మీ రోజువారీ పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చల్లటి నీటితో ముఖం కడగడం:
ఇది వేగవంతమైన, సులభమైన పరిష్కారం ఇది. చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మం యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివల్ల చెమట గ్రంథులు నెమ్మదిగా పనిచేస్తాయి. అప్పటికప్పుడు ఉపశమనం కోసం, చల్లటి నీటిలో ముంచిన ఒక మెత్తని టవల్‌ను ముఖంపై కొన్ని నిమిషాలు ఉంచుకోవడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
2. ఐస్ క్యూబ్‌లను ఉపయోగించడం:
ఒక ఐస్ క్యూబ్‌ను సన్నని క్లాత్‌లో చుట్టి.. దాన్ని మీ ముఖంపై చెమట ఎక్కువగా పట్టే భాగాలపై (ముఖ్యంగా నుదురు, ముక్కు) నెమ్మదిగా రుద్దండి. ఇది చర్మాన్ని చల్లబరచడమే కాకుండా.. చెమట గ్రంథుల పనితీరును తాత్కాలికంగా తగ్గిస్తుంది.
3. ఆస్ట్రింజెంట్ టోనర్ వాడకం:
రోజ్ వాటర్ లేదా హేజిల్ వంటి ఆస్ట్రింజెంట్ టోనర్లను వాడడం వల్ల చర్మ రంధ్రాలు బిగుసుకుంటాయి. తద్వారా చెమట ఉత్పత్తి తగ్గుతుంది. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత ఒక కాటన్ బాల్‌తో టోనర్‌ను ముఖంపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
4. చర్మంపై అదనపు నూనె లేకుండా చూసుకోవడం:
జిడ్డు చర్మం ఉన్నవారికి చెమట ఎక్కువగా పడుతుంది. దీనిని తగ్గించడానికి, మీరు ఆయిల్-ఫ్రీ ఫేస్ వాష్‌లను కూడా ఉపయోగించవచ్చు. మేకప్ వేసుకునేవారు ఆయిల్-ఫ్రీ ప్రైమర్లను వాడటం వల్ల చెమటతో మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది.
5. ఆందోళనను నియంత్రించడం:
ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా చెమటకు ప్రధాన కారణాలు. ఇలాంటి సందర్భాలలో డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు, ధ్యానం లేదా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించడం వల్ల శరీరం చల్లబడి చెమట తగ్గుతుంది.
Also Read: బ్లూబెర్రీతో షుగర్ కంట్రోల్, హార్ట్ ఎటాక్స్ దూరం.. మరెన్నో ప్రయోజనాలు !
6. అల్యూమినియం క్లోరైడ్ ఉండే ప్రొడక్ట్స్ :
మీరు హైపర్‌హిడ్రోసిస్ (అధిక చెమట) సమస్యతో బాధపడుతున్నట్లయితే.. అల్యూమినియం క్లోరైడ్ ఉండే యాంటీ-పెర్స్పిరెంట్స్‌ను వాడటం గురించి డాక్టర్‌ని సంప్రదించవచ్చు. ఇవి చెమట గ్రంథుల పనితీరును తగ్గించి చెమటను నియంత్రిస్తాయి.
అధిక చెమట సమస్య ఎక్కువ కాలం కొనసాగితే.. డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. వారు మీకు సరైన ట్రీట్ మెంట్ సూచిస్తారు. పైన పేర్కొన్న పద్ధతులు తక్షణ ఉపశమనం కోసం మాత్రమే ఉపయోగపడతాయి.