E-Paper
Advertisement

ధరల అస్త్రంతో జగన్ అటాక్.. పాత లెక్కలతో టీడీపీ కౌంటర్.. నెట్టింట రచ్చ రచ్చ!

ధరల అస్త్రంతో జగన్ అటాక్.. పాత లెక్కలతో టీడీపీ కౌంటర్.. నెట్టింట రచ్చ రచ్చ!
Advertisement

AP Price Politics: ఏపీలో స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలైన అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా నిత్యావసర ధరలపై ‘ట్వీట్ల యుద్ధం’ నడుస్తోంది. ప్రజలపై ఎవరి హయాంలో ఎక్కువ భారం పడింది? ఎవరు ధరలు పెంచారనే అంశంపై ఇరు పక్షాలు ముమ్మరంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.

చంద్రబాబుపై జగన్ విమర్శనాస్త్రాలు!

ముందుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిత్యావసర ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ మాట తప్పారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ప్రస్తుత ధరలు చూస్తే సామాన్యులు షాక్‌కు గురవుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రోజువారీ వినియోగంలో ఉండే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి, పేద ప్రజల బతుకులు భారంగా మారాయని విమర్శించారు. వీటితో పాటు విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు వైపు అడుగులు వేస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement

జగన్ ఆరోపణలకు టీడీపీ గట్టి కౌంటర్

జగన్ చేసిన ఆరోపణలను అధికార టీడీపీ అంతే వేగంగా తిప్పికొట్టింది. గత వైసీపీ హయాంలో జరిగిన ధరల పెంపును గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో ఎదురుదాడికి దిగింది. గత వైసీపీ ఐదేళ్ల పాలనలోనే నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయని ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు జగన్ ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో పెట్రోల్‌పై ఏకంగా మూడుసార్లు పన్నులు పెంచి 2021 నాటికే లీటర్ ధరను రూ.116కు తీసుకెళ్లిన చరిత్ర వైసీపీదేనని గుర్తుచేశారు. ‘ట్రూ అప్ ఛార్జీలు’ పేరుతో కరెంట్ బిల్లులను ఇష్టారాజ్యంగా పెంచి ప్రజల జేబులు ఖాళీ చేశారని, ఆస్తి పన్నును దాదాపు 45 శాతం పెంచారన్నారు. ఆఖరికి ‘చెత్త పన్ను’ పేరుతో ఇంటింటికీ బాదుడు కార్యక్రమం చేపట్టింది జగన్ కాదా అని ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీలో డీజిల్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపిన విషయాన్ని ప్రస్తావిస్తూ కౌంటర్ ట్వీట్లు చేశారు.

Advertisement

Also Read: ఇస్రో మరో సంచలనం.. విజయవంతంగా నింగిలోకి GSLV ఎఫ్18.. ఎన్‌వీఎస్ 03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్!

ధరల రాజకీయం.. పార్టీల వ్యూహం!

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ‘ధరల రాజకీయం’ రెండు పార్టీలకూ అత్యంత కీలకంగా మారింది. సాధారణంగా స్థానిక పోరులో స్థానిక సమస్యలతో పాటు నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఖర్చులు వంటి అంశాలు ఓటర్ల తీర్పును ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ఉన్న ధరల పెరుగుదలను చూపించి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని పెంచాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. దీనికి కౌంటర్ గా గత ప్రభుత్వంలో జరిగిన ఇష్టారాజ్యమైన పన్నుల విధింపు, కరెంట్ బాదుడు, చెత్త పన్నులను ప్రజలకు గుర్తుచేస్తూ వైసీపీకి విమర్శించే హక్కు లేదని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. మొత్తానికి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ట్వీట్ల యుద్ధం నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత ఐదేళ్ల వైసీపీ పాలన.. ప్రస్తుత కూటమి రూలింగ్ తో సరిపోల్చి చూసుకుంటున్న ప్రజలు.. స్థానిక ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.

Also Read: ‘గెలిచే దమ్ములేక.. ఈసీపై నిందలా?’.. రాహుల్, అఖిలేష్‌లకు అమిత్ షా ఓపెన్ ఛాలెంజ్!

Tags

Related News

శ్రీహరికోటలో కౌంట్‌డౌన్ స్టార్ట్.. నింగిలోకి GSLV-F18!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం షాపులు మూసివేత.. 3 రోజులు చుక్క లేనట్లే!

వామ్మో దొంగలంటే వీళ్లే రా బాబోయ్.. ఒకే రాత్రి 4 ఇళ్లు ఊడ్చేసి ఎలా పారిపోయారంటే?

ఎమ్మెల్యే రేంజ్ ఆస్తులు.. జెడ్పీటీసీగా పోటీ! ఎవరీ మమతశ్రీ?

చంద్రబాబుకి పబ్లిక్ స్టంట్లు తప్ప వరద బాధితులపై పట్టింపు లేదు: బొత్స సత్యనారాయణ

గుంటూరు మేయర్‌ అభ్యర్థి, నా చెల్లిని గెలిపించాలని ఓటర్లకు నటుడు జగపతిబాబు విజ్ఞప్తి

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఆటోను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. ఇద్దరు దుర్మరణం!

Big Stories

Advertisement
×