Yashmi Gowda: బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యష్మీ గౌడ.. బుల్లితెరపై ప్రసారమైన పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఒక్కో సీరియల్ తో మంచి క్రేజీని సంపాదించుకొని అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది.. కృష్ణ ముకుందా మురారి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె ఆ తర్వాత త్రినయని సీరియల్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది.. ఆ రెండు సీరియల్స్ ఈమెకు మంచి క్రేజీని అందించడంతో ఈమెకు బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశాన్ని అందుకుంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ తన ఆట తీరుతో మాట తీరుతో జనాలని బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు సీరియల్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. మరి ఈమె నెలకు ఎంత సంపాదిస్తుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె నెలకు ఎంత సంపాదిస్తుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమకు లేని పేరు యష్మి గౌడ.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఒక్కో సీరియల్ తో తన నటనతో మెప్పించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఇప్పటివరకు ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆమె క్రేజీ అమాంతం పెరిగింది. తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లో చోటు సంపాదించుకుంది.. అంతే కదూ.. ఆ షో ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. అయితే బిగ్ బాస్ వల్ల మీకు క్రేజీ వచ్చింది కానీ ఉన్న అవకాశాలు పోయాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న యష్మి లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తూ వస్తుంది. సోషల్ మీడియా ద్వారా దాదాపు 10 లక్షల వరకు సంపాదిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి నిజంగానే అంత సంపాదిస్తుందా లేదా అన్నది తెలియాలి అంటే ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
తెలుగులోకి ఈ బ్యూటీ స్వాతి చినుకులు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీరియల్లో అమాయకమైన హీరోయిన్ పాత్రలో కనిపించిన యష్మీ. కృష్ణ ముకుంద మురారీ సీరియల్ లో నటించి మెప్పించింది. హౌస్ లో ఈమె ఫైర్ చూసి విన్నర్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ జనాలకు బోర్ కొట్టిసిందేమో.. ఓట్లు పడకపోవడంతో ఎలిమినేట్ అయ్యింది..తర్వాత మరో సీరియల్ చేయలేదు యష్మీ. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.. ఈమధ్య సీరియల్స్ లలో కనిపించలేదు కానీ బయట మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది.. ఫ్యాషన్ షోలు అలాగే స్పెషల్ ఈవెంట్లలో ఆమె కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.. ఇక సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న యష్మీ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది.. ఇకముందు కూడా ఈమె సీరియల్స్ చేయదా? అవకాశాలు వస్తే మళ్లీ సీరియల్స్ తో బిజీ అవుతుందా? అన్నది చూడాలి..