Gundeninda GudiGantalu Today episode ఆగష్టు 10th : ట్రాఫిక్ కానిస్టేబుల్ రోహిణి అని పిలవగానే మనోజ్ నువ్వు ఎక్కడున్నావో రోహిణి ఎక్కడికి వెళ్లావు రోహిణి ఏం చేస్తున్నావ్ రోహిణి అంటూ అక్కడున్న వాళ్ళందరికీ షాకిచ్చేలా మాట్లాడుతాడు. నన్ను నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు రోహిణి అని మనోజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ రోహిణి మనోజ్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇలా చేస్తున్నావు. అసలు ఎంత చెప్తున్నా సరే మనోజ్ మాత్రం వినకుండా నన్ను మోహిని మోసం చేసింది అని అనడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడికి ఏమైనా పిచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు మణికంఠ ఏదో బాధలో ఉన్నాడు మనోజ్ ప్రవర్తన చూసి అరుణ్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లండి అని అంటాడు. మనోజ్ నీ పోలీసులు అరెస్ట్ చేస్తారు.. మనోజ్ నీలానే వదిలేస్తే న్యూషన్స్ క్రియేట్ చేస్తారని అరుణ్ పోలీసులు ఎక్కువ అప్పగించాలని అనుకుంటాడు. ఇక పోలీస్ స్టేషన్ కి మనోజ్ ని తీసుకొని వెళ్ళిపోతారు..
మనోజ్ నీ పోలీసులు అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని బాలుకి ఎలాగైనా చెప్పాలి అని పరిగెత్తుకుంటూ బాలు దగ్గరికి వెళ్తాడు మణికంఠ. అయితే ముక్కలు ముక్కలుగా విషయం చెప్పాలని అనుకుంటాడు. కానీ మధ్యలో బాలు అడ్డుపడడంతో చెప్పాలనుకున్న ముక్క తప్ప మిగిలిన ముక్కలన్నీ చెప్పేస్తాడు.. బాలు ఆ మొక్కేటో చెప్పు అని మధ్యలో అడ్డుపడడంతో మీనా మీరు ఆగండి అతను ఏం చెప్పాలనుకున్నాడో ఆ మొక్కనే మర్చిపోతున్నాడు అని అంటుంది.. మేము పార్కుకి వెళ్లి పడుకోవాలి అని అనుకునే లోపులే మనోజ్ పార్క్ వెళ్లి తాగుదామని తీసుకొని వెళ్ళాడు.. తను పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో వాళ్ళు తనని పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లారు అని చెప్పగానే బాలు నాకు అర్థం అయిపోయింది. నేను వెళ్లేసి వస్తాను అని చెప్తాడు. కానీ సత్యం మాత్రం నేను కూడా వస్తాను అని అంటాడు..
మనోజ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఏంటో కొన్ని పోలీసులు ఏం చేస్తున్నాడు అని సత్యం కంగారు పడిపోతూ ఉంటాడు. అయితే అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.. అక్కడ పోలీసులు మనోజ్ని కొడుతూ ఉండగా చూసి వాడిని ఎందుకు కొడుతున్నారు సార్? వాడు ఒక అమాయకుడు సార్ అని అడుగుతాడు.. నా కొడుకు నీలాంటి పరిస్థితులు చూసి తట్టుకోలేకపోతున్నాను అని సత్యం కన్నీళ్లు పెట్టుకుంటాడు.. అయితే సత్యం నీ చూసిన అరుణ్ మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారు లాగా ఉన్నారు ఇలాంటి కొడుకులను కన్నారేంటి సార్ అని అంటాడు.. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసి కనలేదు సార్ పరిస్థితులు వాళ్ళని అలా తయారు చేశాయి అని చెప్పడంతో అరుణ్ ఆలోచనలో పడతాడు.. నా కొడుకు నీలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నాను సార్ అని ప్రాధేయపడడంతో అరుణ్ మనోజ్ని వదలడానికి ఒప్పుకుంటాడు.. మనోజ్ ని పంపించేయండి అని చెప్పగానే సత్యం తన కొడుకుని తీసుకొని వెళ్తాడు.
రోహిణి నన్ను మోసం చేసింది. నా పక్కనే ఉంటూ నన్ను ఇంతగా వాడుకొని ద్రోహం చేసింది అని మనోజ్ బాధపడడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడతారు.. అసలు మనోజ్ ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం అమ్మే అని బాలు అంటాడు.. నీకు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా.. మనోజ్ పరిస్థితి బాగోలేదు తనని తీసుకొని వెళ్లి పడుకోబెట్టు అని బాలు తో సత్యం చెప్తాడు.. ఇక మనోజ్ నన్ను రోహిణి మోసం చేసింది నాన్న నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చింది నాన్న అని బాధ పడిపోతూ ఉంటాడు.. పైకి బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి పడుకోబెట్టగానే బాలు నన్ను రోహిణి మోసం చేసింది రా అని మళ్ళీ మళ్ళీ చెప్తాడు.. సత్య మాత్రం నా కొడుకులు ఇలా మారిపోతారు అని నేను అనుకోలేదు అని బాధ పడిపోతూ ఉంటాడు.. బతికుండంగా ఇలా చూస్తూ ఉండాలని నేను అసలు ఊహించలేదు శాశ్వతంగా కళ్ళు మూసుకుంటే తప్ప నాకు ఈ బాధ దూరం కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.. మా అమ్మ వస్తే ఈ పరిస్థితిని చక్క దిద్దుతుంది అని చెప్పగానే అవును నాన్న ఇలాంటి తీసుకొని వస్తే బాగుంటుంది అని బాలు అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..