Jannat Zubair Rahmani:ఈ మధ్యకాలంలో చాలామంది నటీమణులు చాలా తెలివిగా ఆలోచిస్తూ.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న తీరులో.. అవకాశాలు ఉన్నప్పుడే ఇటు సినిమాలు, అటు సీరియల్స్, మరోవైపు బిజినెస్ లు అంటూ పలు రంగాలలో రాణిస్తున్నారు. అలా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ నటి కూడా ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ ఏమీ కాదు. కానీ పలు సినిమాల్లో, సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ కోట్లకు కోట్ల డబ్బులు వెనకేసుకుందట. అంతేకాదు ఆస్తిపాస్తుల విషయంలో ఈమె తర్వాతే కొంతమంది హీరోల ఆస్తులు ఉండడం విచిత్రం. అయితే అంత పెద్ద హీరోలు కూడా కూడబెట్టని డబ్బులు ఈ నటి ఎక్కడినుండి సంపాదిస్తుంది.? ఇంతకీ ఆమె ఆస్తిపాస్తులు ఎన్ని కోట్లు..? ఆమె ఎవరు అనేది ? ఇప్పుడు చూద్దాం. జన్నత్ జుబేర్ రహ్మానీ(Jannat Zubair Rahmani).. బాలీవుడ్ లో కి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కి కేవలం 23 ఏళ్లు మాత్రమే. అయితే 23 ఏళ్ల జన్నత్ ఆస్తిపాస్తులు మాత్రం స్టార్ హీరోలను మించేలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ తన సంపాదనతో దాదాపు రూ.250 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది.జన్నత్ జుబేర్ రహ్మానీ పలు సినిమాలు, సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఇంత డబ్బు ఎలా కూడబెట్టింది అని చాలామంది ఆశ్చర్యపోతారు.
షారుఖ్ ఖాన్ ని మించిన ఫాలోవర్స్..
అయితే జన్నత్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.ముఖ్యంగా ఈమె సోషల్ మీడియా ఫాలోవర్స్ షారుఖ్ ఖాన్ ని మించేలా ఉన్నారు.ఇక సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్(Sharukh Khan) ని ఫాలో అయ్యే వాళ్ళు దాదాపు 46 మిలియన్ల మంది. అయితే జన్నత్ జుబేర్ రహ్మానీ కి మాత్రం 49 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉంది. అలాగే పలు టీవీ సీరియల్స్, సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఈమె చేసే ఒక్కొక్క పోస్టుకి దాదాపు రూ.1.5 నుండి రూ.2 లక్షల వరకు అందుకుంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం సోషల్ మీడియాలోనే కాదు సినిమాలు,సీరియల్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తుంది. ఈమె బుల్లితెర మీద చేసే సీరియల్స్ కి ఒక్క ఎపిసోడ్ కి రూ.2లక్షలకు పైగా తీసుకుంటుందట. అలాగే సీరియల్స్, సినిమాలు మాత్రమే కాదు పలు షోస్ లో కూడా జన్నత్ పాల్గొంటుంది. అలా జన్నత్ పాల్గొనే ఖత్రోన్ కే ఖిలాడి అనే షోలో ఆమె ఒక్కరోజు పాల్గొనేందుకు ఏకంగా రూ.18 లక్షల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుందట.
ఒక్కరోజు సంపాదన రూ.18 లక్షలు..
ఒక్క రోజుకే రూ.18 లక్షలు అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజమని తెలుస్తోంది. అలా జన్నత్ జుబేర్ రహ్మని కేవలం సినీ రంగాన్ని మాత్రమే కాదు వ్యాపార రంగాన్ని కూడా నమ్ముకుంది.అలా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్ లు చేస్తూ కూడా కోట్లు సంపాదిస్తుంది.ఇక 23 ఏళ్ల వయసులోనే జన్నత్ జుబేర్ రహ్మాని(Jannat Zubair Rahmani) ఆస్తులు రూ.250 కోట్లు అని తెలియడంతో చాలా మంది స్టార్ హీరోలు సైతం నోరెళ్ళబెడుతున్నారు. ఇక జన్నత్ జుబేర్ రహ్మానీకి వాట్ విల్ పీపుల్ సే, హెచ్కీ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలా చిన్న వయసులోనే ఈ నటి కోట్ల ఆస్తులు సంపాదిస్తూ స్టార్ సెలబ్రిటీలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.