CSIR- IMMT Recruitment: టెన్త్ క్లాస్, ఇంటర్ పాస్, టైపింగ్ వచ్చిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సీఎస్ఐఆర్ – ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(సీఎస్ఐఆర్- ఐంఎంఎంటీ)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నఅభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఇది శుభవార్త. ఒడిశాలోని సీఎస్ఐఆర్- ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(సీఎస్ఐఆర్- ఐంఎంఎంటీ)లో ఖాళీగా ఉన్న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి కలిగన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8తో దరఖాస్తు గడువు ముగియనుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జెన్, ఎఫ్ అండ్ ఏ, ఎస్ అండ్ పీ) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఇంటర్ పాస్‌తో పాటు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.)
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జెన్/ఎఫ్&ఏ)కు రూ.19,900 – రూ. 63,200, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్&పీ) పోస్టుకు రూ.35,804 వేతనం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ.500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 8
పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్‌ను సంప్రదించండి. అఫీషియల్ వెబ్ సైట్‌లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. ఎలాంటి డౌట్ ఉన్న వెంటనే అఫీషియల్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://recruitment.immt.res.in/permanent/
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ముఖ్యంగా టెన్త్ క్లాస్, ఐటీఐ ఉత్తీర్ణత అయినవారు, టైపింగ్ వచ్చినవారిక ఇదే మంచి అవకాశం. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పిస్తారు. నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జెన్/ఎఫ్&ఏ)కు రూ.19,900 – రూ. 63,200, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్&పీ) పోస్టుకు రూ.35,804 వేతనం ఉంటుంది. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు పెట్టండి ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: AIIMS Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో 4597 ఉద్యోగాలు.. దరఖాస్తు చేస్తే ఉద్యోగం.. జీతం రూ.75,000
ముఖ్యమైనవి:
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 8
అప్లికేషన్ ఫీజు: రూ.500(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు)
అప్లికేషన్ ప్రాసెస్: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి రూ.19,000- రూ.63,200 వేతనం ఉంటుంది.