Actress:సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు ఎవరితో ఎలా ప్రేమలో పడతారో చెప్పడం అసాధ్యం. అయితే అలా ప్రేమలో పడినవారు పెళ్లి చేసుకుని వైవాహిక బంధాన్ని మొదలు పెడుతున్నారు. ఇంకొంతమంది పెళ్లి చూపులు చూసి నచ్చక పెళ్లికి దూరమైతే.. మరికొంతమంది మనసుకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి తారసపడక పెళ్లికి దూరమవుతున్నారు. అయితే ఇక్కడ ఒక నటి పూర్తిగా వ్యతిరేకం.. ఏకంగా 300 పెళ్లిచూపులు జరిగాయని ఇప్పుడు ఫైనల్ గా నిశ్చితార్థం చేసుకున్నాను అంటూ ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. మరి ఆమె ఎవరు? ఆమె వివాహం చేసుకోబోతున్న వరుడు ఎవరు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ బుల్లితెర నటి..
ఆమె ఎవరో కాదు ప్రముఖ కన్నడ నటి వైష్ణవి గౌడ (Vaishnavi Gowda).. ‘సీతారామ’ సీరియల్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరైన ఈ ముద్దుగుమ్మ. ఏప్రిల్ 14న తన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అయితే ఆ ఫోటోలను కాస్త ఆలస్యంగా పంచుకుంది. ఇక ఈమె ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ముద్దుగుమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైష్ణవి గౌడ తాజాగా వ్యాపారవేత్త ఆకే తో నిశ్చితార్థం చేసుకుంది. ముఖ్యంగా వారు గురువు, పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు , కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక వీరి నిశ్చితార్థ వేడుకకు ప్రముఖ కన్నడ నటి అమూల్య గౌడ, ప్రెసెంటర్ చైత్ర వాసుదేవన్, పూజా లోకేష్, రీతూ సింగ్, జ్యోతి కిరణ్ తదితరులు హాజరయ్యారు. ఇకపోతే వైష్ణవి గౌడ తనకు 300కు పైగా వివాహ ప్రతిపాదనలు వచ్చాయని, ఒక కార్యక్రమంలో చెప్పిన విషయం తెలిసిందే.
వైష్ణవి గౌడ కెరియర్..
వైష్ణవి గౌడ విషయానికి వస్తే.. కలర్స్ కన్నడ ఛానల్ లో ప్రసారమైన ‘అగ్నిసాక్షి’ సీరియల్ ద్వారా తన కెరియర్ను ఆరంభించి, మొదటి సీరియల్ తోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్ ద్వారా వచ్చిన గుర్తింపుతో కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ -4 లో నిలిచింది. ఇక ప్రస్తుతం జీ కన్నడలో ప్రసారమవుతున్న ‘సీతారామ’ సీరియల్లో నటిస్తోంది. బాల్యం విషయానికి వస్తే.. 1995 ఫిబ్రవరి 20వ తేదీన కర్ణాటక బెంగళూరులో జన్మించింది. ఈమె తండ్రి రవికుమార్ గౌడ కాగా తల్లి భాను రవి గౌడ. ఈమెకు సునీల్ కుమార్ అనే సోదరుడు కూడా ఉన్నారు. ఇక ప్రముఖ సీరియల్ నటి అమూల్య ఈమె ప్రాణ స్నేహితురాలు అని సమాచారం. ఈమె బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఓపెన్ డిగ్రీ పూర్తి చేసింది. భరతనాట్యం, కూచిపూడి, లెవెల్ 3 బెల్లీ డాన్స్ లలో శిక్షణ పొందింది . ఇక నటిగానే కాదు హోస్టుగా కూడా వ్యవహరించింది. 2017లో కామెడీ షో భర్జారీ లో హోస్ట్ గా వ్యవహరించింది. కన్నడ సినిమాలలో కూడా నటించిన ఈమె పలు అవార్డులు కూడా అందుకున్నట్లు సమాచారం.
Hit 3 Trailer Response : 24 గంటల్లో సర్కార్ ఊచకోత… ఎన్ని లక్షల వ్యూస్ అంటే..?