BigTV English

Hit 3 Trailer Response : 24 గంటల్లో సర్కార్ ఊచకోత… ఎన్ని లక్షల వ్యూస్ అంటే..?

Hit 3 Trailer Response : 24 గంటల్లో సర్కార్ ఊచకోత… ఎన్ని లక్షల వ్యూస్ అంటే..?

Hit 3 Trailer Response : ‘హిట్: ది సెకండ్ కేస్’ సీక్వెల్ గా ‘హిట్: ది థర్డ్ కేస్’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా నానిని అత్యంత క్రూరంగా చూపించబోతున్నారు డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu). పూర్తి యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇప్పటికే నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హిట్ 3 ట్రైలర్ నిన్న విడుదల చేశారు. 3 నిమిషాల 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ అభిమానులను ఊహించని స్థాయిలో ఆకట్టుకుంది. ముఖ్యంగా క్షణక్షణం ఉత్కంఠను కలిగించే విధంగా ప్రతి షాట్ చాలా అద్భుతంగా సాగింది. దీనికి తోడు నాని క్రూరమైన యాక్షన్ విజువల్స్, మాస్ ఆడియన్స్ కే గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పవచ్చు.


ఊచకోత కోసిన నాని హిట్ 3 ట్రైలర్..

అటు సాఫ్ట్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని.. ఒక్కసారిగా ఇంత క్రూరమైన విలన్ గా కనిపించేసరికి అభిమానులు సైతం కాస్త భయపడ్డారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ ట్రైలర్లో రక్తంతో తడిసిన దృశ్యాలు, చిధ్రమైన శరీరాలు, క్రూరమైన ఘర్షణలను చాలా బాగా ఎలివేట్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా.. రావు రమేష్ , కోమలి ప్రసాద్, సూర్య శ్రీనివాస్ తో పాటు పలువురు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి (SriNidhi shetty)హీరోయిన్ గా నటిస్తోంది . మే ఒకటవ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ ట్రైలర్ ఊహించని సక్సెస్ ను అందుకోవడమే కాకుండా ఊచకోతకోసింది. ఈ సినిమా 24 గంటల్లోనే 21.3M+ కి పైగా వ్యూస్ రాబట్టింది. అంతే కాదు 24 గంటల్లోనే 418K లైక్స్ వచ్చాయి. మొత్తానికైతే ట్రైలర్ తోనే ఊచ కోత కోసేసింది ఈ సినిమా. మరి మే 1వ తేదీన రిలీజ్ కాబోయే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


ఆ రోజు కోసం ఎదురుచూడాలి – నాని

ఇకపోతే ఈ ట్రైలర్ విడుదల చేయడానికి ఈవెంట్ నిర్వహించారు. వైజాగ్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో నానిని ఆ ప్రాంతవాసులు అల్లుడుగా చూస్తారని తెలిపారు. నాని మాట్లాడుతూ.. “మీ ఎనర్జీని చూస్తూ ఉంటే సాయంత్రం వరకు నాకు ఇక్కడే ఉండాలని ఉంది. 15 ఏళ్ల క్రితం నా పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని కలవడానికి వైజాగ్ వచ్చేవాడిని. ఆ తర్వాత నేను ఆమెను వివాహం చేసుకున్నాను. గత 15 ఏళ్ల నుంచి మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. అప్పుడు వచ్చింది ఈ ప్రేమ కోసమే.. ఇప్పుడు వస్తోంది ఈ ప్రేమ కోసమే.. ఇక్కడి వారితో అంతటి అనుబంధం ఏర్పడింది. వేరే ఊరికి వెళ్తే నన్ను అక్కడివారు అన్నా లేదా తమ్ముడులా భావిస్తారు. కానీ వైజాగ్ వాళ్లు మాత్రం నన్ను అల్లుడుగానే చూసుకుంటున్నారు. అది నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంది .నేను చేస్తున్న హిట్ 3 ఒక కొత్త జానర్ మూవీ.. మే 1న మీ ముందుకు వచ్చి మనమంతా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నాని లవ్ స్టోరీలు, ఫ్యామిలీ చిత్రాలు చేయాలనుకునేవారు మే 1న కాస్త జాగ్రత్తగా ఉండండి. కానీ నానిఅన్ని పాత్రల్లో చేయాలనుకునే వారు మాత్రం ఆ రోజు కోసం ఎదురుచూడండి అంటూ తెలిపారు.

Tollywood: మమ్ముట్టి దెబ్బకు సారీ చెప్పిన అల్లు అరవింద్.. ఏం జరిగిందంటే..?

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×