Mahesh Babu: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సినిమా SSMB29. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారు. రాజమౌళి RRR సినిమా తరువాత మహేష్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఇప్పటివరకు టైటిల్ ను ప్రకటించలేదు. అయినా ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి.ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది చూసేద్దాం..
జక్కన్న బోనులోకి మహేష్ ..
మహేష్ బాబు, రాజమౌళి సినిమా కథ ఏమిటి అన్న దానికన్నా, పాస్ పోర్ట్ గురించే, ఎక్కువ మాట్లాడుకుంటారు. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు రాజమౌళి పాస్ పోర్ట్ ని చూపించి సింహాన్ని బంధించాను అని చేసిన పోస్ట్ అప్పట్లో చాలా హాట్ టాపిక్ అయ్యింది. ఆ తరువాత హైదరాబాదులో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఒడిస్సా లో రెండవ షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఆ తర్వాత మూవీ టీం కొంత విరామం తీసుకున్నారు. వెకేషన్ కి వెళ్లే ముందు మహేష్, తన పాస్ పోర్ట్ ని మీడియా కి చూపిస్తూ రాజమౌళి నుంచి నేను లాగేసుకున్నాను అని సిమ్బాలిక్ గా నవ్వుతూ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ఇప్పటికే రెండు షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రియాంక చోప్రా అమెరికాకు వెళ్లారు. రాజమౌళి తన డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లినట్లు సమాచారం. ఇక మన హీరో మహేష్ ఫ్యామిలీతో కలిసి ఫారెన్ వెళ్లినట్లు సమాచారం. అయితే ఇప్పుడు మహేష్ తన వెకేషన్ ను పూర్తిచేసుకుని, హైదరాబాద్ చేరుకున్నారు. మహేష్ బాబు తన అభిమానులకు పాస్ పోర్ట్ ని చూపించడంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అయింది. ఫారిన్ టూర్ అయిపోయింది మళ్ళీ సినిమా మొదలు అంటూ, పాస్ పోర్ట్ ని చూపించడం వైరల్ అయింది. అది చూసిన అభిమానులంతా, పాస్ పోర్ట్ అలా చూపిస్తే రాజమౌళి తీసుకునే ఛాన్స్ ఉంది అని, మళ్లీ జక్కన్న బోనులోకి మహేష్ వెళ్ళనున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
ఫాన్స్ తో సెల్ఫీ ..
ఇక మహేష్ బాబు ని ఎప్పుడు చూసినా అభిమానులు కేరింతలతో, సందడి చేస్తారు. ఇప్పుడు మహేష్ హైదరాబాద్ చేరుకోగానే ఎయిర్ పోర్ట్ లో అభిమానులు సందడి చేశారు. అభిమానులకి అభివాదం చేస్తున్న మహేష్ ని ఒకరు సెల్ఫీ అడగగానే.. మహేష్ అభిమాని కోరిక తీర్చడానికి ఆయనతో సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల బ్యాక్ గ్రౌండ్ లో, ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా గ్రాఫిక్ విజువల్స్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. సినిమాలో ఒక కీలక పాత్రలో పృధ్విరాజ్ సుకుమర్ ను తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు. రాజమౌళి, కీరవాణి కాంబోలో వచ్చిన RRR సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ పై కూడా అంచనాలు పెంచేస్తున్నారు.
Pawan Kalyan : ఇదిగో ఫ్యాన్సూ… ఓజీ రెడీ అయిపోయింది… సూపర్ అప్డేట్ ఇచ్చిన థమన్