BigTV English

GundeNinda GudiGantalu Today Episode : బాలుకు దూరమైనా మీనా.. రవిని రెస్టారెంట్ లో కొట్టిన బాలు..

GundeNinda GudiGantalu Today Episode : బాలుకు దూరమైనా మీనా.. రవిని రెస్టారెంట్ లో కొట్టిన బాలు..

Gundeninda GudiGantalu Today Episode 24th :  నిన్నటి ఎపిసోడ్ లో..  మీనాను వాళ్ళ ఇంట్లోంచి వెళ్లమని బయటకు పంపిస్తుంది. ఇక మీనా ఎక్కడికి వెళ్లాలని గుడికి వెళ్తుంది. ఇక రవి కుటుంబం విడిపోవడానికి కారణం శృతి అంటాడు.. దానికి ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఇక ఇద్దరు గొడవ పడతారు. విడిపోయేవరకు గొడవ పడతారు. ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని వెళ్ళిపోతారు. రవిని చూసి సంజయ్ షాక్ అవుతాడు. ఇక బాలు ఒకతనితో గొడవ పడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతి తండ్రి వల్లే తాను తన కుటుంబానికి దూరమైనట్లు రవి ఆరోపిస్తాడు. పెళ్లి విషయంలో తొందరపడ్డామని అంటాడు. ఇక శృతి కూడా తగ్గేదేలే అని తన పేరెంట్స్ ను వెనకేసుకొని వస్తుంది. ఇక ఇద్దరు గొడవ పడతారు. శృతికి డబ్బింగ్ చెప్పడానికి అని బయటకు వెళ్తుంది. రవిని శృతితో పాటు చూసి సంజు షాకవుతాడు. ఇద్దరు కలిసే తనను జోకర్‌ను చేశారని అర్థం చేసుకుంటాడు. బకరాను చేసారు అని కోపంతో రగిలిపోతాడు. ఇక మీ ఇద్దరు ఎలా సంతోషంగా ఉంటారో చూస్తాను అని వారిద్దరినీ విడగొట్టే ప్రయత్నం చేస్తాడు.. ఇక రవి, మీనాలపై బాలు కోపం రోజురోజుకు పెరుగుతుంది. రవి దొరికితే అతడికి చంపేయాలన్నంత కోపంగా కనిపిస్తాడు. మీనా…వీపు చూపిస్తే వెన్నుపోటు పొడుస్తుందని, ఎదురునిలిస్తే గుండెల్లో పొడుస్తుందని.. పోటు మాత్రం గ్యారెంటీ అని భార్య గురించి స్నేహితులతో చెబుతాడు బాలు. భర్త మాటలను చాటు నుంచి విని మీనా బాధపడుతుంది..

అప్పుడు రాజేష్ ఆపరా మీనా వింటుంది అని రాజేష్ అంటాడు.. మీనాను చూడగానే బాలు ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లబోతాడు. ఒక్కసారిగా బాలు కారుకు మీనా అడ్డు వస్తుంది. ఆమెను చూసి సడెన్ బ్రేక్ వేస్తాడు బాలు.రవి చేసిన తప్పు వల్ల తన బ్రతుకు రోడ్డుపాలైందని, నా బాధను చెప్పుకోవడానికి వచ్చానని భర్తతో అంటుంది మీనా. ఇక్కడ నాతో మాట్లాడే అర్హత లేదు అని బాలు అంటాడు. ఇక రాజేష్ కూడా భార్యను ఎక్కడికి వెళ్లమని వెళ్తుంది. ఇక మీనా కారును కొడుతుంది.. నిన్ను చచ్చేదాకా నమ్మనని అంటాడు. నేను చనిపోయిన తర్వాత అయినా మీరు నన్ను అర్థం చేసుకుంటారని నమ్ముతున్నానని బాలుతో అంటుంది మీనా. ఇక మీకే కాదు..ఎవరికి కనిపించనని బాలుతో చెబుతుంది. నేను చచ్చేదాకా నన్ను నమ్మరా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


ఇక రవి రెస్టారెంట్‌కు రాగానే అతడిని చూసి ఫ్రెండ్ కంగారుపడతాడు. నీ గురించి మీ అన్నయ్య బాలు వెతుకుతున్నాడని, నిన్ను కొట్టాలన్నంత కోపంగా తిరుగుతున్నాడని చెబుతాడు. బాలు తనను అర్థం చేసుకుంటాడనే నమ్మకం ఉందని రవి అంటాడు.. కానీ నేను పని చేసుకోకపోతే డబ్బులు ఎలా వస్తాయని అంటాడు. దానికి వేళ్ళు అని చెప్పినా వినకుండా లోపలికి వెళ్తాడు. అక్కడ ఉండే వాచ్ మెన్ ఫోన్ చేసి చెప్తాడు. రవి వచ్చిన విషయాన్ని చెబుతాడు. బాలు వెళ్తాడు. ఇక రాజేష్ ఎక్కడికి అడుగుతాడు. దానికి రా నువ్వు పొట్టేలు బలికి రెడీగా ఉంది అని రెస్టారెంట్ కు తీసుకెళ్తాడు.. నన్ను నమ్ముకొని ఓ అమ్మాయి వచ్చిందని, నువ్వు నన్ను చంపేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటని బాలును అడుగుతాడు రవి. నాన్నకు గౌరవం ఇవ్వని వ్యక్తి కూతురిని పెళ్లిచేసుకోవద్దని నీకు నేను, నాన్న ఎన్నిసార్లు చెప్పాం. ఒక్కరి మాట వినకుండా మేము ఏమైపోయినా పర్వాలేదని చెప్పి ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయావని రవిపై ఫైర్ అవుతాడు. మేము ఎంత నరకం చూశామో తెలుసా…నాన్నను సురేంద్ర ఎంత అవమానించాడో తెలుసా అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రవి కూడా ఫీల్ అవుతూ బయటకు వెళ్ళిపోతాడు.

మీనాను కన్వీన్స్ చేసేందుకు తల్లి ప్రయత్నిస్తుంది. బాలు కోపం తగ్గిన తర్వాత వెళ్లి అతడికి సర్థిచెప్పమని అంటుంది. నేను ఎక్కడికి వెళ్లనని, నా ఓపిక నశించిందని, నేను కావాలనుకుంటే బాలు వస్తాడు. రమ్మని పిలుస్తాడు. ఆ రోజు వరకు ఇక్కడే ఉంటానని తల్లితో చెబుతుంది మీనా. ఒకవేళ పిలవకపోతే ఎప్పటికీ పుట్టింట్లోనే ఉండిపోతానని అంటుంది. నీకు నచ్చకపోతే ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని మీనా బయలుదేరబోతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో రవి మీనా పై కోపంతో బాలు రాజేష్ తో కలిసి మందు తాగుతాడు. నేను నీకు కనపడను అని చెప్పిన మీనా ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని బాటు బయటపడతాడు. మీనాకు తన ఫ్రెండ్ చేత ఫోన్ చేయిస్తాడు. కానీ మీనా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో మీనా బాలు కలుస్తారేమో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం పై నర్మదకు అనుమానం.. శ్రీవల్లి దొరికినట్లేనా? చందు పై రామరాజు సీరియస్..

Intinti Ramayanam Today Episode: పల్లవి చెంప పగలగొట్టిన అవని.. తమ్ముడి కోసం అవని షాకింగ్ నిర్ణయం..

Brahmamudi Serial Today August 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను ఫాలో చేసిన రాజ్‌ – క్యాన్సర్‌ డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన కావ్య

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. కల్పన దెబ్బకు ఫ్యూజులు అవుట్… రోహిణికి మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today August 11th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Big Stories

×