BigTV English

Health Tips: ఈ ఒక్క పని చేయండి చాలు.. గ్యాస్ ట్రబుల్ సమస్య అస్సలు రాదు

Health Tips: ఈ ఒక్క పని చేయండి చాలు.. గ్యాస్ ట్రబుల్ సమస్య అస్సలు రాదు

Health Tips: ఈ రోజుల్లో క్రమరహిత ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా చాలా మంది గ్యాస్, అసిడిటీ సమస్యలను ఎదుర్కుంటున్నారు.
అలాంటి వారు కొన్ని రకాల హోం రెమెడీస్ సహాయంతో గ్యాస్, అసిడిటీ సమస్యను నియంత్రించవచ్చు. ఇవి చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి.


అంతే కాకుండా ఇవి చాలా సురక్షితమైనవి కూడా. రసాయన మందులను వాడకుండా హోం రెమెడీస్‌తోనే గ్యాస్, అసిడిటీ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలి ? వాటి ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ , అసిడిటీని తగ్గించే హోం రెమెడీస్ :


అజ్వైన్, నల్ల ఉప్పు:
అజ్వైన్ కొన్ని శతాబ్దాలుగా జీర్ణ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. గ్యాస్ వల్ల వచ్చే ఉబ్బరాన్ని ఇది తగ్గిస్తుంది. దీని కోసం, ఒక చెంచా అజ్వైన్ తీసుకుని, దానికి చిటికెడు నల్ల ఉప్పు కలపండి. గోరువెచ్చని నీటిలో ఇవి వేసి త్రాగండి . ఇలా తరుచుగా చేయడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.

సోపు నీరు:
సోంపు జీర్ణక్రియకు అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. ఇది పొట్టలోని ఆమ్లతను తగ్గించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక చెంచా సోంపును గ్లాస్ నీటిలో వేసి మరిగించండి. తర్వాత ఈ నీటిని త్రాగేయండి . ఇది కడుపులో చికాకు, అసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మజ్జిగ, జీలకర్ర:
మజ్జిగ జీర్ణవ్యవస్థకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా అసిడిటీ నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. మజ్జిగలో జీలకర్ర పొడిని కలిపి తాగడం వల్ల పొట్టకు చల్లదనాన్ని అందించి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, అసిడిటీ రెండింటి నుంచి ఉపశమనాన్ని అందించే అద్భుతమైన హోం రెమెడీ.

కొబ్బరి నీరు:
పొట్టలోని అసిడిటీని తగ్గించడానికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. ఇది శరీరంలోని ఆమ్లాన్ని సమతుల్యం చేస్తుంది.అంతే కాకుండా జీర్ణవ్యవస్థకు శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తుంది. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో మంట , గ్యాస్ నుండి ఉపశమనం లభిస్తుంది.   అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా  ఉంటాయి. అసిడిటీతో పాటు గ్యాస్ సమస్యలు తగ్గించడానికి కొబ్బరి నీరు చాలా బాగా పని చేస్తాయి.

Also Read: రన్నింగ్ సమయంలో ఈ పొరపాట్లు చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా ?

గ్యాస్, అసిడిటీలకు ఈ హోం రెమెడీస్ అన్నీ సింపుల్ గా మాత్రమే కాకుండా చాలా ఎఫెక్టివ్ గా కూడా ఉంటాయి. వీటిని తరుచుగా తీసుకోవడం ద్వారా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అంతే కాకుండా ఇవి తరుచుగా త్రాగడం ద్వారా సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Poha Recipe:10 నిమిషాల్లోనే రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. వెంటనే ట్రై చేయండి

Copper Bottle: కాపర్ బాటిల్ వాటర్ తాగారో అంతే సంగతులు, వీళ్లకు మరీ డేంజర్!

Navratri Celebration: ఆఫీసులో దేవీ నవరాత్రులు.. ఇలా జరుపుకుంటే ఎప్పటికీ మరచిపోలేరు

High Protein Food: ఎగ్స్‌కు బదులుగా ఇవి తింటే.. ఫుల్ ప్రోటీన్

Eyesight: ఇలా చేస్తే.. కంటి అద్దాల అవసరమే ఉండదు తెలుసా ?

Fatty Liver Food: ఫ్యాటీ లివర్ సమస్యా ? ఇవి తింటే ప్రాబ్లమ్ సాల్వ్

Masala Tea: ఒక కప్పు మసాలా టీతో.. ఇన్ని ప్రయోజనాలా ?

Cardamom Benefits:రాత్రి భోజనం తర్వాత ఈ ఒక్కటి తింటే చాలు.. వ్యాధులు రమ్మన్నా రావు !

Big Stories

×