Gundeninda GudiGantalu Today episode April 15 th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి మాత్రం ఆయన ఇప్పుడు వెళ్ళకుండా అంటే చాలా ప్రమాదం మా ఇంటికి చాలా సీరియస్ గా ఉందంట వెళ్ళి తీరాల్సిందే.. అని పట్టు పట్టి మరి అతని పంపించే ప్రయత్నం చేస్తుంది. మరి మరిది గారు మీరు వెళ్లినప్పుడు మనోజ్ బిజినెస్ గురించి మాట్లాడండి అని ప్రభావతి అంటుంది. ప్రభావతిని రోహిణి సోది అనేసి అంటుంది. ప్రభావం ఒక్క మాట అనగానే అందరూ షాక్ అవుతారు నువ్వేంటి మమ్మల్ని అంటున్నావేంటి అని బాలు కూడా అంటాడు. సారీ ఆంటీ నేను కావాలని లేదు ఏదో కోపంలో అనేసాను మా ఇంటికి ఎలా జరిగిందని టెన్షన్ లో ఉన్నాను అనేసి అంటుంది. మొత్తానికి మాణిక్యంను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది. ఇక సుశీల అందరికి సరదాగా ఉండాలని సరికొత్త గేమ్స్ కు ఆడించాలని అనుకుంటుంది. అక్కడి తో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మాణిక్యం వెళ్లగానే అందరు వెళ్లిపోవాలని అనుకుంటారు. పల్లెటూళ్లో బోర్ కొడుతుందని వెళ్లిపోదామని రవితో అంటుంది శృతి. మరోవైపు రోహిణి కూడా పళ్లెటూళ్లో ఉండటం నచ్చలేదంటూ యాక్టింగ్ చేస్తుంది. ఉన్న రెండు రోజులు ఆనందంగా గడిపేందుకు వారి కోసం కొన్ని ఆటల పోటీలు పెడుతుంది సుశీల. ఈ పోటీలో ఎలాగైనా బాలు, మీనాలను ఓడించాలని ప్రభావతి స్కెచ్ వేస్తుంది. బాలు తమను మాటల తో టార్చర్ పెడుతున్న సంగతి గుర్తు చేసుకుంటారు రవి – శృతితో పాటు మనోజ్ – రోహిణి. బాలుపై రివేంజ్ తీర్చుకోవడానికైనా అతడిని ఓడించాలని ఫిక్సవుతారు.. అందరిని పోనివ్వకుండా సుశీల ప్లాన్ చేస్తుంది.
కుటుంబ సభ్యులను రెండ్ టీమ్‌లుగా విడగొడుతుంది సుశీల. ఓ టీమ్‌కు కెప్టెన్‌గా ప్రభావతి.. మరో టీమ్‌కు కెప్టెన్‌గా సత్యం ఉంటారు. సత్యం టీమ్‌లో మీనా, శృతి, రోహిణి ఉండగా. ప్రభావతి టీమ్‌లో రవి, బాలు, మనోజ్‌లు ఉంటారు. ప్రభావతి నాకు మనోజ్ను గాని రవీను గాని ఇవ్వండి నాకు టీంలో బాలు వద్దు అనేసి ప్రభావతి ఉంటుంది.. వాడు కూడా నీ కొడుకే కదా ఇప్పుడు ఎందుకు నువ్వు అలా అంటున్నావ్ అనేసి సుశీల అరుస్తుంది దాంతో ప్రభావతి మాట్లాడుకుండా ఉండిపోతుంది. ముందుగా తాడు లాగా ఆటను ఆడిపిస్తుంది.
మగవాళ్ళందరూ ప్రభావతి టీము ఆడవాళ్ళందరూ సత్యం టీమ్లో ఉంటారు. మొత్తానికి ఎలాగోలాగా బురిడీ కొట్టించి ప్రభావతి టీం విన్నర్గా నిలుస్తుంది. ఇక సుశీల ప్రభావతి టీం విన్నర్ అయినట్టు అనౌన్స్ చేస్తుంది. ఆ తర్వాత టైరు తో ఆటను చెప్తుంది. అందరూ జంటలుగా ఆటలు మొదలు పెడతారు. చివరికి బాలు మీనా మాత్రమే గెలుస్తారు. అయితే మొత్తానికి ఆటల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ఇక ప్రభావతి టీం గెలిచింది నిజ జీవితంలో కొడుకు తల్లి ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కానీ గేమ్ అనగానే మన టీం గెలవాలంటూ పోటాపోటీగా ఆడికి గెలిపించాలని సుశీల అంటుంది. ప్రభావతి బాలుకి దూరం పెరగడానికి చిన్న చిన్న కారణాలే కారణమని కొడుకు కోసం ఆమె తల్లి కోసం వాడు ఆరాటపడుతూనే ఉన్నారంటూ అంటుంది. మొత్తానికి బాలు ప్రభావతి అయితే ఈ గేమ్ వల్ల దగ్గర అయినట్లు కనిపిస్తుంది.
ఇక లోపలికి వెళ్ళిన తర్వాత శృతి ఇంకో గేమ్ ఆడదామా అని అంటుంది.. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని అంటారు. ఇక ముందుగా రవి తన మనసులో ఉన్న మాటల్ని డేర్ గా చెప్పాలని అంటుంది. ఎవరినైనా ప్రేమించే వాని అడుగుతుంది. టెన్త్ క్లాస్ లో ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ అమ్మాయి వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను నిన్నే ప్రేమించాను అని చెప్తుంది.. ఇక శృతి కూడా డేర్ అంటుంది. దానికి బాలు మీ అమ్మకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు ఇంత పనికిమాలిన దానివి అనేసి అని ఫోన్ పెట్టేయాలి అని అంటుంది. నువ్వు చేయాల్సిన డేర్ ఇదే. అప్పుడు అది నీ ధైర్యం అని మెచ్చుకుంటాను అని బాలు అంటాడు.. అందరూ షాక్ అవుతారు.. ఇక తర్వాత బాలు గురించి డేరా ట్రూత్ అని అడుగుతాడు. ఆ తర్వాత తల్లి పై ప్రేమతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మీనా తో ప్రభావితకి బాలు మధ్య దూరం పెరగడానికి కారణాల గురించి వివరిస్తాడు. మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి..