E-Paper
Advertisement

OTT Movie : రోబో అని కూడా చూడకుండా ప్రెగ్నెంట్ చేసే అబ్బాయి… ట్విస్ట్ లతో మెంటలెక్కించే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : రోబో అని కూడా చూడకుండా ప్రెగ్నెంట్ చేసే అబ్బాయి… ట్విస్ట్ లతో మెంటలెక్కించే సై-ఫై థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఒక్కోసారి ఊహించని స్టోరీలను తెరకెక్కిస్తుంటారు దర్శకులు. ఇప్పుడు ఒక రోబో తో స్టోరీ ని మన ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు. ఈ కంప్యూటర్ యుగంలో ఏదైనా జరిగిపోతుంది అన్నట్టుగానే, ఈ సినిమాను కూడా వీక్షించారు ప్రేక్షకులు. రోబో కి మనిషికి ఉన్న ఫీలింగ్స్ వస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఇంతవరకూ రోబోలతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ రోబో ఇక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది.  అయితే ఈ సినిమాను కామెడీ వర్షన్ లో చూపించారు. చివరివరకూ సరదాగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…

కీనోదరన్ (Kinodaran)లో

Advertisement

ఈ ఆర్మేనియన్ కామెడీ మూవీ పేరు ‘రోసాలీ’ (Rosali). ఈ సినిమా కు డేవిడ్ బబఖాన్యన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఒక ప్రత్యేకమైన రోసాలీ అనే ఆడ రోబోట్ చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో ఆర్మేనియన్ రహస్య పరిశోధనా కేంద్రంలో, శాస్త్రవేత్తలు రోసాలీ అనే రోబోట్‌ను సృష్టిస్తారు, ఇది కేవలం కృత్రిమ మేధస్సును మాత్రమే కాకుండా, సింథటిక్ హార్మోన్ల ద్వారా మానవ భావోద్వేగాలను అనుభవించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కినోదరన్ (Kinodaran) ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

కొంతమంది శాస్త్రవేత్తలు ఒక రహస్య పరిశోధన కేంద్రంలో ఆడ రోబో ను సృష్టిస్తారు. ఇది చూడటానికి రోబోలానే ఉంటుంది.  అయితే ఫీలింగ్స్ మాత్రం మనుషులకు ఉన్నట్టే ఉంటాయి. దీనిలో ఉండే సింథటిక్ హార్మోన్స్ ప్రభావం వల్ల, మనుషులకు వచ్చే ఫీలింగ్స్ దీనికి కూడా వస్తాయి. ఈ రోబో కి ఉన్న ఫీలింగ్స్ పై పరిశోధన చేయడానికి ఒక మనిషి అవసరం అవుతుంది. ఇప్పుడే ఈ సినిమాలో హీరో ఎంట్రీ అవుతాడు.  అప్పులు ఎక్కువ అవ్వడంతో, అందరికీ అబద్ధాలు చెప్పి తొందరలో ఇస్తానని తప్పించుకు తిరుగుతుంటాడు. ఈ క్రమంలోనే డబ్బు కోసం రోబోతో ఉండటానికి ఒప్పుకుంటాడు. అక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. రోజురోజుకీ వీళ్లిద్దరి మధ్య బాండింగ్ బాగా పెరుగుతుంది. ఒకరితో ఒకరు సరదాగా ఉండటంతో, ఒకసారి ఆ ఫీలింగ్స్ తో ఇంటిమేట్ కూడా అవుతారు. రోబో కూడా హీరోని బాగా ఇష్టపడుతుంది.

ఇలా వీరి రొమాన్స్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది.  కొద్దిరోజుల్లోనే ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. మన హీరో చేసిన ఘనకార్యం వల్ల రోబో కి ఒక కాయ కాస్తుంది. అంటే ఈ రోబో ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విడ్డూరం అక్కడ ఉన్న అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. హీరో కూడా ఎలా జరిగిందని షాక్ అవుతాడు.  చివరికి రోబో కి పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? దీనివల్ల హీరో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ కామిడీ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : సముద్రం ఎడారిగా మారి, భూమిని సునామీ ముంచేస్తే… ట్విస్ట్ లతో అదరగొట్టే సర్వైవల్ థ్రిల్లర్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×