E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: పెళ్లి సంబంధం కోసం వెళ్లిన మనోహర్.. అమ్మోరులా మారిన మీనా.. అడ్డంగా బుక్కయిన బాలు..

Gundeninda GudiGantalu Today episode: పెళ్లి సంబంధం కోసం వెళ్లిన మనోహర్.. అమ్మోరులా మారిన మీనా.. అడ్డంగా బుక్కయిన బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 25th: ఇతను లవ్ చేయడానికి మీరే సలహాలు ఇచ్చారా..? అతను ఎవరో లవ్ చేస్తున్నాడు అని అనుకున్నాను నిన్నే లవ్ చేస్తున్నాడు అని తెలిస్తే నేనెందుకు సలహాలు ఇస్తాను అని బాలు అంటాడు. తనకి పెళ్లి అయిపోయింది రా అని చెప్తుంటే తన మెడలో తాళి లేదు కదా అని అతను అంటాడు. ఇక బాలు పై అందరూ సీరియస్ గా ఉంటారు. ఏది ఏమైనా కూడా మీనా బాలుని పై చాలా కోపంగా ఉండడంతో బాలు చాలా ఫీల్ అవుతాడు. అటు మనోజ్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలి అని సంతోషంగా ఉంటాడు.. మనోజ్ కొత్త ఇల్లు కాదు విల్లా అని రోహిణి చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు..

గాజులతో బుట్టలో పడ్డ ప్రభా..

ముంబై ముఖేష్ 10 లక్షలు లాభం వచ్చాయి అని చెప్పగానే అందులో అమ్మకి నేను సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను అని మనోజ్ అనగానే.. ప్రభావతి 1000 లైట్లు ఎలిగినట్లుగా వెలిగిపోతుంది. మనోజ్ అత్తయ్య గారి కోసం బంగారు గాజులు చేయించాడు అని అనగానే నాకు బంగారు గాజులు చేయించాడా అని ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూశారా నా కొడుకు ఏరోజైనా నాకు ఇలాంటివి చేస్తాడని నాకు ముందే తెలుసు. అమ్మని సంతోషంగా చూసుకునేది ఒక్క మనోజ్ ఒక్కడే అని ప్రభావతి చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటుంది. ఆ గాజులు వేసుకున్న ప్రభావతి నా పెద్ద కొడుకు నాకోసం ఏదైనా చేస్తాడు అని తెగ మురిసిపోతూ అందరికి చూపిస్తూ ఉంటుంది. అమ్మ కోసం తెచ్చావు సరే మరి నాన్న కోసం ఏం తెచ్చావు రా అని బాలు అడుగుతాడు.

సత్యంకు చిన్న గిఫ్ట్..

Advertisement

అమ్మ కోసం గాజులు తెచ్చావు మరి నాన్న కోసం ఏం తెచ్చావు అని బాలు అడుగుతాడు. నాన్నకు కూడా నేను గిఫ్ట్ తీసుకుని వచ్చాను అని మనోజ్ ఒక షర్ట్ తనకిస్తాడు. అమ్మకేమో గాజులు తెచ్చావు మరి నాన్నకి ఏంట్రా చైన్ లేకపోతే ఇంకా ఏదైనా తీసుకురాకుండా షర్ట్ తీసుకొచ్చావు అని అడుగుతాడు.. నాన్నకు కూడా ఏదో ఒకటి తీసుకొస్తే ఆ 10 లక్షలు అక్కడ అయిపోతాయి అందుకే షర్ట్ తీసుకొని వచ్చాను అని చెప్పగానే సత్యం ఫీల్ అవుతాడు. ప్రభావతి మాత్రం తన కొడుకు గాజులు చేయించాడని గాల్లో తేలిపోతూ ఉంటుంది. అంతేకాదు రవి బాలుని ఏమి చేయించలేదన్నట్లుగా ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉంటుంది.. దానికి రవి ఎవరు చులకన చేసి మాట్లాడొద్దమ్మా మా పని మాకు గ్రేట్ అని అంటాడు.

బాధపడ్డ మీనా..

బాలు దగ్గరికి వెళ్లిన మీనా బాధపడుతుంది. అందరూ మంచిగానే సంపాదించుకుంటున్నారు మనమే ఎటువంటి సంపాదన లేదు అన్నట్లుగా ఉన్నాము అని మీనా అంటుంది. దానికి బాలు మనం నిజాయితీగా సంపాదిస్తున్నాం కదా బాధపడడం ఎందుకు అని అంటాడు. కానీ మీనా మాత్రం రోహిణి వాళ్ళు వేరే ఇండ్లు కొనాలని అనుకున్నారు కదా మరి ఆ ఇంటికి వెళ్ళిపోతారేమో.. అత్తయ్య కూడా ఆ ఇంటికి వెళ్లి పోతుందేమో అని ఎంతో దూరం ఆలోచించి బాధపడుతుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే వాళ్ళ రూం మనకే నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు కదా అని బాలు ఎంత చెప్పినా సరే మీనా మాత్రం కుటుంబం చీలిపోతుంది అని ఆలోచిస్తుంది.

బాలు మాస్టర్ ప్లాన్..

Advertisement

బాలు ఇంట్లోంచి వెళ్ళనివ్వకుండా చేసే బాధ్యత నాది నువ్వేమీ దూరం ఆలోచించొద్దు అని మీనా తో బాలు అంటాడు. కానీ మీనా మాత్రం ఎక్కడో అసంతృప్తి ఉన్నట్లు బాధపడుతుంది. వాళ్ళని ఇంట్లో ఉండేలా చేస్తానని చెప్పాను కదా మరి నాకు చెక్కర ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు.. చక్కర ఏంటి ఇందాకడి నుంచి అదే మాట అంటున్నారు వంటగదిలో ఉంది కదా అని మీనా అంటుంది. వంట గదిలో కాదు నీ పెదవులతో నాకు ఒక చక్కర ఇవ్వచ్చు కదా తీయగానే బాలు అడుగుతాడు. ఇక మీనా బాలుకి ముద్దు పెట్టి అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది.

ఉద్యోగంకు వెళ్తున్న సత్యం..

ఉదయం లేవగానే సత్యం దగ్గరకు వచ్చిన బాలు ఏంటి నాన్న ఇస్త్రీ చేసిన చొక్కా వేసుకున్నావు. జేబులో పెన్ పెట్టుకున్నావు ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతాడు. నేను ఇవాళ మొదటి రోజు రా ఉద్యోగానికి వెళ్తున్నాను అని సత్యం చెప్పగానే.. బాలు ఎందుకు నాన్న నువ్వు ఇలాంటి కష్టమైన పనులు చేస్తున్నావు మేమున్నాం కదా.. మేము చూసుకుంటాం కదా అని ఎంత చెప్తున్నా సరే సత్యం మాత్రం కాళ్లు చేతులు ఆడినంతవరకు పని చేసుకోవాలి అదే మానవ ధర్మం అని అంటాడు. ఇవాళ కొడుకులు కోడలు పెడుతున్నారు కదా అనేసి కూర్చొని తింటే రేపు విలువ అనేది ఉండదు అందుకే నాకు చేతనైన పని నేను చేసుకుంటాను అని సత్యం అంటాడు. ఈ వయసులో నేను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నా భార్య వల్లే వచ్చింది కాబట్టి నేను ఉద్యోగానికి వెళ్లాల్సిందే అని సత్యం అంటాడు. ఇక బాలు కూడా ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో రోహిణి బండారం బయట పడుతుందేమో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episode: చందుకు షాకిచ్చిన వేదవతి.. అత్త కాళ్ళు పట్టుకున్న శ్రీవల్లి..చందు, శ్రీవల్లి కలిసిపోతారా..?

Related News

నందన అరెస్ట్.. ఏం పీ*క*లే*రు అంటూ అన్వేష్ వీడియో రిలీజ్!

Illu Illaalu Pillalu Srivalli : హమ్మయ్య.. సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

అనసూయ ఓపెన్ ఛాలెంజ్.. మరో వీడియోతో హల్చల్!

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Big Stories

Advertisement
×