Gundeninda GudiGantalu Today episode April 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి దగ్గరకు వెళ్లి మీనా పై తన అక్కసును కక్కేస్తుంది ప్రభావతి. కారు డ్రైవరే దానికి బంగారం కొనిస్తే మరి నా ఇద్దరు కోడలు కూడా బంగారం వేసుకొని తిరగాలి కదా దాని ముందు దర్జాగా ఉండాలి కదా అనేసి ప్రభావతి ఆలోచిస్తుంది. ఇక అనుకున్నట్లుగానే ముందుగా రోహిణి దగ్గరికి వెళ్లిన ప్రభావతి ఆఫ్ట్రాల్ కారు డ్రైవింగ్ చేసుకునే వాడే బంగారం కొంటున్నాడు మరి నీ దగ్గర అన్ని బంగారు నగలు ఉన్నాయి కదా నువ్వు వేసుకోకుండా బయటికి వెళ్ళవద్దు అనేసి అడుగుతుంది. దానికి రోహిణి షాక్ అవుతుంది. బంగారు నగలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి ఈవిడ ఆశలకైనా ఒక హద్దు ఉండాలి రోజుకు ఏదొక విధంగా నన్ను చంపేస్తుంది అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా, బాలు ఇద్దరు కూడా సంతోషంగా పెళ్లి పీటల మీద కూర్చొని మరోసారి పెళ్లి చేసుకుంటారు.. ఇప్పుడు మనం నిజమైన భార్య భర్తలం ఒకరిపై ఒకరికి ఇష్టంతో పెళ్లి చేసుకుందామని మీనా అనగానే బాలు సంతోష్ పడతాడు.. ఇద్దరూ గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తారు. మనిద్దరిని ఇలా చూడగానే మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది అని బాలు అంటాడు. లోపలికి వెళ్లేటప్పుడు సత్యం ఆపుతాడు. మేమిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకున్నామని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది. పుస్తెల కొన్నాను కదా ఇద్దరం ఒకరికొకరు అర్థం చేసుకొని ఇన్నాళ్లకు పెళ్లి చేసుకుందామని బాలు చెప్తాడు.
నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఇలాగే ఉండాలని అనుకుంటున్నా అని సత్యం అంటాడు. ఇక ప్రభాస్ మాత్రం పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు కళ్ళు తిరుగుతున్నాయి బాబోయ్ అంటూ షాక్ అవుతుంది. ఇక రోహిణి హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది. ప్రభావతి సత్యం ఇద్దరూ ఆశీర్వదించాలని బాలు అంటాడు. మీరిద్దరూ మల్లి పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది.. ఇద్దరు సంతోషంగా ఉండండి అంటూ వెటకారంగా దీవిస్తుంది ప్రభావతి.
మేమిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకున్నాం కదా రంగ మామయ్య, కామాక్షి అత్తను పిలవాలి. మన ఇంట్లో ఏ శుభకరం జరిగిన వాళ్ళు ముందుండి అంతా చూసేవారు కదా ఇప్పుడు మా శోభనానికి కూడా ముహూర్తం పెట్టి గదిని రెడీ చేస్తారేమో అని బాలు అంటాడు. దానికి మీనా షాక్ అవుతూ బాలుని పైకి తీసుకెళ్తుంది. గుణ డ్రైవర్ల అందరి దగ్గర వడ్డీ వసూలు చేస్తాడు. రాజేష్ పై సీరియస్ అవుతాడు. మీనా వంట చేస్తుంటే ప్రభావతి ఇంకా వంట అవ్వలేదా గంటలు గంటలు చేస్తే మాకు ఆకలేస్తుంది అని అరుస్తుంది.
మీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకున్నారు కదా అదే కొంచెం వెటకారంగా ఉంది అని ప్రభావతి మీనా దగ్గరికి వెళ్లి అరుస్తుంది. బాలు మీనా ఇద్దరిని తిట్టడంతో మీనాకి వస్తుంది. పొమ్మను లేక పొగ పెడుతుందని ప్రభావతి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడే బాలు అక్కడికి వచ్చి మా ఫోటో ఎలా ఉందని చూపిస్తాడు. అందరూ ఫోటో బాగుందని చెప్తే ప్రభావతి మాత్రం ఎక్కడ పెడతారో ఫోటో తెచ్చి అని ఎటకారంగా మాట్లాడుతుంది. ఇక మీనా పూలదండలు కడుతూ ఉంటుంది. బాలు అక్కడికి వచ్చి మంచం ఇలాగే ఉంది పూలు వేయలేదా? మన శోభనానికి ఏర్పాట్లు చేయలేదా? అని అడుగుతాడు..
మీనా బాలుకి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇస్తుంది. మంచాన్ని పూలతో శోభనం కోసం ఏర్పాటు చేస్తుంది. అది చూసిన బాలు సంతోషంతో మీనాపై ప్రేమను కురిపిస్తాడు. ఇద్దరు కలిసి డ్యూయెట్ సాంగ్ వేసుకుంటారు. మొత్తానికి బాలు మీనా శోభనం జరిగిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ కూడా పూర్తయిపోతుంది. తర్వాత రోజు శృతి చేసిన పనికి సత్యం ప్రాణాల మీదకొస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు చూడాలి..