Rithu Chowdary: రీతూ చౌదరి (Rithu Chowdary).. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ఎక్కువగా ఉపయోగించే వారికి ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో యువతకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. చిట్టి పొట్టి బట్టలతో చూపు తిప్పుకోని అందంతో… యువతకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఒకప్పుడు బుల్లితెర సీరియల్స్ లో నటించింది కానీ అక్కడ సరైన గుర్తింపు మాత్రం లభించలేదు. తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా రామ్ ప్రసాద్ (Ram Prasad), హైపర్ ఆది(Hyper Adi)తో పరిచయం ఏర్పడి ,అలా జబర్దస్త్(Jabardast ) లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక జబర్దస్త్ ద్వారా లేడీ కమెడియన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రీతూ చౌదరి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
చిన్న పిల్లని కూడా చూడలేదు..
రీతూ చౌదరి మాట్లాడుతూ..” నేను పదవ తరగతిలో ఉన్నప్పుడే అవకాశాల కోసం ప్రయత్నం చేశాను. అప్పట్లో ఖమ్మంలో ఉండేవాళ్ళం. ఒక సీరియల్ ఆడిషన్ కోసం ఖమ్మం నుంచి మా నాన్నతో కలిసి వచ్చాను. అయితే నేను, మా నాన్నతో వస్తానని ఊహించలేదు. ఆడిషన్ అయ్యాక ఒక మేనేజర్ వచ్చి ఒక ఫేమస్ సీరియల్ యాక్టర్ పేరు చెప్పి అతనితో అలా ఉండాలి.. అలా ఉంటేనే అవకాశం వస్తుంది. ఇకపై నువ్వు ఒక్కదానివే రావాలి అని చెప్పారు. నాకు అప్పుడు అర్థమయి.. వర్కౌట్ కాదని వెళ్ళిపోయాను.. అప్పుడు ఇంకా చిన్న పిల్లనే అలా అడిగారంటే, ఆ సీరియల్ యాక్టర్ అలాంటివాడా అని ఆశ్చర్యపోయాను. ఇక మళ్ళీ నా కెరియర్ మొదలయ్యాక అదే ఫేమస్ సీరియల్ యాక్టర్ తోనే ఒక సీరియల్ లో నటించాను.. అయితే అలా అవకాశం వచ్చినప్పుడు ఆ యాక్టర్ ని ఆ సంఘటన గురించి అడగాలనుకున్నాను. కానీ అడగలేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా అలాంటిది ఫేస్ చేయలేదు అంటూ చెప్పింది రీతూ చౌదరి .మొత్తానికి అయితే ఇండస్ట్రీలో కూడా వయసుతో సంబంధం లేకుండా మరీ దారుణంగా ప్రవర్తిస్తారు అంటే కొంతమందిని మాత్రమే ఉద్దేశించి కామెంట్ చేసింది రీతూ చౌదరి. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై స్పందించిన రీతూ చౌదరి..
అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం పై కూడా రీతూ చౌదరీ మాట్లాడుతూ.. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి తెలియకుండానే ప్రమోట్ చేశాను. అయితే మీరు అనుకుంటున్నట్లు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నేనేమీ కోట్ల రూపాయలను సంపాదించలేదు. ఈ బెట్టింగ్ యాప్స్ కి మెయిన్ వాళ్ళు కొంతమంది ఉంటే.. మధ్యలో చాలా మంది ఉంటారు. వారందరికీ కమిషన్ పోగా నాకు వచ్చింది కేవలం ఒక్కో యాడ్ ప్రమోషన్ కి రూ.50 వేల నుంచి రూ.60వేలు మాత్రమే అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే రీతూ చౌదరి అటు క్యాస్టింగ్ కౌచ్ పై ఇటు బెట్టింగ్ ప్రమోషన్స్ పై స్పందిస్తూ ఊహించని కామెంట్ చేసింది.
ALSO READ:Naga Chaitanya: తండ్రి కాబోతున్న స్టార్ హీరో… పాపం వాళ్లని దీంట్లోకి లాగొద్దు బ్రో..!