సాధారణంగా ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణీకులు కొద్ది గంటల పాటు అక్కడ ఉంటారు. కొన్ని సందర్భాల్లో విమానం ఆలస్యం అయితే, ఒకటి రెండు రోజుల పాటు ఆలస్యం అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఓ వ్యక్తి ఏకంగా 18 ఏండ్లు ఎయిర్ పోర్టులోనే ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎందుకు అక్కడ ఉండాల్సి వచ్చింది? అన్ని సంవత్సరాలు ఆయనకు కావాల్సిన వస్తువులను ఎలా సమకూర్చుకున్నాడు? చివరకు ఏమయ్యాడు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
18 ఏండ్లు విమానాశ్రయంలోనే..
మెహ్రాన్ కరీమీ నస్సేరీ ఏకంగా 18 ఏండ్లు ఎయిర్ పోర్టులో ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పారిస్ లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం ఆయనకు నివాస స్థలంగా మారింది. చివరకు ఆయన అక్కడే చనిపోయాడు కూడా. కరిమి నస్సేరీ ఇరాన్ కు చెందిన వ్యక్తి. 1945లో మెహ్రాన్ కరీమి ఇరాన్ లో పుట్టారు. ఇతడి తండ్రి ఇరాన్ కు చెందిన వాడు కాగా, తల్లి స్కాట్లాండ్ మహిళ. మెహ్రాన్ కు 23 ఏళ్ల వయసు ఉన్న సమయంలోనే ఆయన తండ్రి అనారోగ్య సమస్యలతో చనిపోయారు. ఆ తర్వాత ఆయన ఇరాన్ లోనే చదువుకున్నాడు. ఆ తర్వాత రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆయనను ఇరాన్ సర్కారు జైల్లో వేసింది. కొంత కాలం తర్వాత అతడికి దేశ బహిష్కరణ విధించింది. ఆ సమయంలో బెల్జియం అతడిని శరణార్ధిగా గుర్తించింది.
సరైన పత్రాలు లేకపోవడంతో..
ఈ నేపథ్యంలో మెహ్రాన్ తన తల్లి దగ్గరికి వెళ్లేందుకు బ్రిటన్ బయల్దేరాడు. బ్రిటన్ లో దిగిన తర్వాత ఆయన దగ్గర సరైన పత్రాలు లేకపోవడంతో, తిరిగి ఆయనను ఫ్రాన్స్ కు పంపించారు. అక్కడ కూడా ఆయన దగ్గర సరైన పత్రాలు లేవనే కారణంతో పారిస్ ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకున్నారు. ఛార్లెస్ డి గల్లే ఎయిర్ పోర్టులో ఆయన ఉండిపోయారు. 1988 నుంచి 2006 వరకు ఎయిర్ పోర్టులోనే ఉన్నారు.టెర్మనల్ 1 లోని మూలకు తన సామన్లు ఉంచుకున్నాడు. ఎయిర్ పోర్టు సిబ్బందితో పాటు ప్రయాణీకులు ఇచ్చే డబ్బుతో ఆయన అక్కడే జీవితాన్ని కొనసాగించారు. ఎయిర్ పోర్టులో ఆయన పుస్తకాలు చదవడం, డైరీ రాయడం చేసేవారు. అంతర్జాతీయ న్యాయ అంశాలను గురించి తెలుసుకునే వారు.
స్పీల్ బర్గ్ సినిమా కథకు ప్రేరణ
ఓ సందర్భంలో ఎయిర్ పోర్టుకు వెళ్లిన ఓ జర్నలిస్టు ఆయన గురించి తెలుసుకుని న్యూస్ రాయడంతో బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని దిగ్గజ హాలీవుడ్ దర్శకుడు స్పీల్ బర్గ్ ‘ది టెర్మిన్ మ్యాన్’ అనే సినిమా తీశారు. అంతేకాదు, అతడి జీవిత కథ ఆధారంగా ‘ది టెర్మినల్ మ్యాన్’ అనే పుస్తకం కూడా అందుబాటులోకి వచ్చింది. 2006లో ఆయన అనారోగ్య సమస్యలతో చనిపోయారు. ఎయిర్ పోర్టు అధికారులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. మొత్తంగా ఎక్కువ కాలం ఎయిర్ పోర్టులో ఉన్న వ్యక్తిగా మెహ్రాన్ కరీమీ నస్సేరీ గుర్తింపు తెచ్చుకున్నారు.
Read Also: పీఓకే, ఎల్వోసీ, ఎల్ఏసీ.. ఉద్రిక్తతల నేపథ్యంలో వినిపించే ఈ పేర్ల వెనుక కథ ఏంటి?