Gundeninda GudiGantalu Today episode April 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా, బాలు ఇద్దరు కూడా సంతోషంగా పెళ్లి పీటల మీద కూర్చొని మరోసారి పెళ్లి చేసుకుంటారు.. ఇప్పుడు మనం నిజమైన భార్య భర్తలం ఒకరిపై ఒకరికి ఇష్టంతో పెళ్లి చేసుకుందామని మీనా అనగానే బాలు సంతోష్ పడతాడు.. ఇద్దరూ గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తారు. మనిద్దరిని ఇలా చూడగానే మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది అని బాలు అంటాడు. లోపలికి వెళ్లేటప్పుడు సత్యం ఆపుతాడు. మేమిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకున్నామని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది. పుస్తెల కొన్నాను కదా ఇద్దరం ఒకరికొకరు అర్థం చేసుకొని ఇన్నాళ్లకు పెళ్లి చేసుకుందామని బాలు చెప్తాడు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఇలాగే ఉండాలని అనుకుంటున్నా అని సత్యం అంటాడు. ఇక ప్రభాస్ మాత్రం పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు కళ్ళు తిరుగుతున్నాయి బాబోయ్ అంటూ షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా బాలుకి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇస్తుంది. మంచాన్ని పూలతో శోభనం కోసం ఏర్పాటు చేస్తుంది. అది చూసిన బాలు సంతోషంతో మీనాపై ప్రేమను కురిపిస్తాడు. ఇద్దరు కలిసి డ్యూయెట్ సాంగ్ వేసుకుంటారు. మొత్తానికి బాలు మీనా శోభనం జరిగిపోతుంది. రోహిణి పడుకోడానికి బెడ్ రూమ్ కి వస్తుంది. రోజు సర్వర్ లాగా ఫుడ్ ఐటమ్స్ పేర్లు చెప్పి కలవరిస్తూ ఉంటాడు. రెండుసార్లు కలవరించడంతో రోహిణి మనోజ్ నీ నిద్ర లేపుతుంది. ఏంటి మనోజ్ ఫుట్ ఐటమ్స్ పేరు చెప్పి ఏదో సర్వర్ లాగా కలవరిస్తున్నవ్ ఏంటి అని అడుగుతుంది.
పొద్దున టిఫిన్ చేద్దామని ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను రోహిణి. అక్కడ కపుల్ దోస అని మసాలా దోశలు పెట్టారు అది మనిద్దరం కలిసి తినాలని అనుకున్నాను. ఇక నువ్వు లేవు కదా అని సింగిల్ ఇడ్లీతో సరిపెట్టుకుని వచ్చేసానని మనోజ్ అబద్ధం చెప్తాడు. ఇక ఇద్దరూ కలిసి సరదాగా నవ్వుకుంటారు. అటు శృతి, రవిలు కూడా గేమ్ విషయంలో కీచులు ఆడుకొని సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. మీనా బాలు కూడా తమ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకుంటూ సరదాగా మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంట్లో అందరూ నవ్వుకోవడం చూసి ప్రభావతి ఏంటి అర్ధరాత్రి గోల అని లేస్తుంది.
పక్కనే ఉన్న సత్యమును ప్రభావతి నిద్రలేపుతుంది. చూశారా అండీ ఒకటే ఈకైకలు పక్కపక్కలు అనగానే వాళ్ళు నీ కొడుకులు శత్రువులు కాదు భార్యలతో సరదాగా ఉంటున్నారు. దాంట్లో తప్పేంటి నువ్వు కూడా నా ఎదురుగా కూర్చో నీకు గిలిగింతలు పెడతా నువ్వు కూడా నవ్వుకోవచ్చు అని సత్యం అంటాడు. మనకంటే ఒక రూమునుంటే మన రూమ్ లో ఉండే వాళ్ళం ఇలాంటివి మనకు వినిపించేది కాదు ఇప్పుడు చూడండి అన్ని వినాల్సి వస్తుంది అర్ధరాత్రి గోల ఏంటో అర్థం కావట్లేదు అని ప్రభావతి విసుక్కుంటుంది.
మొదటినుంచి చెప్తున్నాను ఆ బాలు మీనా ను ఇంట్లో నుంచి బయటికి పంపిద్దామని మీరే వినట్లేదు ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఉంటే మనకు రూమ్ వచ్చేది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు ఎప్పుడూ మీనా బాలు మీదే పడతావు నిద్ర వస్తే పడుకో నాకు నిద్ర వస్తుందని పడుకుంటాడు. ఉదయం లేవగానే రోహిణి మీనా దగ్గరికి వచ్చి ఏం టిఫిన్ చేస్తున్నావ్ మీనా అని అడుగుతుంది. చట్నీ సాంబార్ చేశాను రోహిణి ఇడ్లీ దోస వేస్తున్నాను అని అనగానే నాకు మనోజ్ కి వెయ్యోద్దు నేను బయట నుంచి టిఫిన్ తీసుకుని వచ్చాను అని అంటుంది.
మీనా బిజీగా ఉండడం చూసి బాలు నాకోసం పూలగంప బిజీగా ఉండి బయటి నుంచి టిఫిన్ తీసుకొని వచ్చినట్లు ఉందని టేబుల్ మీద కనిపించిన టిఫిన్ ని తినేస్తూ ఉంటాడు. అది చూసిన రోహిణి మనోజ్ ఇది మనోజ్ కోసం తెచ్చిన టిఫిన్ నువ్వు అలా తింటున్నవే కనీసం మేనేజ్ కూడా నీకు లేదా అని అంటుంది. నాకు ఆకలేసింది ఎవరు తెచ్చారో తెలియక తినేసాను ఇప్పుడు తప్పేముంది అని రోహిణిని అడుగుతాడు బాలు. ఇక మీనా కూడా ఈ ఇంటి కోసం అంత కష్టపడుతున్నాడు కదా ఆఫ్ట్రాల్ ఒకరోజు టిఫిన్ తింటేనే ఇంత బాధ పడుతున్నావా అని రోహిణి అంటుంది.
మనోజ్ ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతాడు. దానికి బాలు నువ్వు మీ ఆవిడ సక్రమంగా ఇంట్లో అన్ని చెబుతున్నారా చేస్తున్నారా అని అంటాడు సత్యం బాలుని ఆపేందుకు ప్రయత్నం చేస్తాడు. వామ్మో ఈ బాలుకి నా గురించి ఏదో నిజం తెలుస్తుంది ఇప్పుడు నేను తగ్గకపోతే దాన్ని బయటపెట్టిన పరువు తీస్తాడు అని రోహిణి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న నువ్వు ఇలానే అన్నను ఆపద్దు నేను కచ్చితంగా ఈరోజు అసలు నిజం బయటపెట్టాలి అని బాలు అంటాడు. ఎహే ఆపండి ఏంటి మీ గోల అని ప్రభావతి చిరాకు పడుతుంది.
బాలు గొడవపడతాడు అందుకే నాకు కూడా ఇష్టం లేదు కానీ ఒక్కరోజు టిఫిన్ చేసినందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారా ఆ టిఫిన్ లేవు నేను ఆర్డర్ పెడతాను అందరికీ అని శృతి అంటుంది. కానీ మీనా మాత్రం నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను శృతి ఏం అవసరం లేదులే అని అంటుంది. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. కామాక్షి ప్రభావతి రోడ్డు తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి వదిన ఏదో చెప్పాలని టిఫిన్ కూడా చేయనీకుండా రోడ్ నెంబర్ తిప్పుతున్నావని కామాక్షి అంటుంది. ఆ బాలు మేనని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పు కామాక్షి అని ప్రభావతి అడుగుతుంది.
ఐడియాలు ఏవైనా రావాలంటే ముందు కడుపులో ఏదైనా పడాలి అని కామాక్షి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్దామని అంటుంది. అక్కడ రెస్టారెంట్లోకి ప్రభావతి కామాక్షి రావడం చూసి మనోజ్ షాక్ అవుతాడు వాళ్లకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఆర్డర్ తీసుకోవడానికి అక్కడికి ఎవరిని పిలిచినా రారు. ఓనర్ వచ్చి ఆ మిడిగుడ్లోడు మనోజ్ ఎక్కడికి పోయాడు కస్టమర్లు వచ్చినప్పుడు ఆర్డర్ తీసుకోవాలని తెలియదా అని సీరియస్ అవుతాడు. మనసు తన కోపాన్ని మేనేజ్ చేసి ఆర్డర్ తీసుకోమని పంపిస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…