Kolkata hotel Tragedy: కోల్‌కతా సిటీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఊపిరాడక అందులో ఉన్న సిబ్బంది చనిపోయారని అంటున్నారు. ప్రస్తుతం ఘటనపై లోతుగా దర్యాప్తు సాగుతోంది. ఘటన లోతుల్లోకి వెళ్తే..
కోల్‌కతాలో ఘోరం
బెంగాల్ రాజధాని కోల్‌కతా సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫల్పట్టి మచ్చుయా సమీపంలో ఓ హోటల్‌లో మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం 14 మంది మృతి చెందారని పోలీసు అధికారులు చెబుతున్నారు. సెంట్రల్ కోల్‌కతా బుర్రా బజారులోని ప్రాంతంలోని రీతురాజ్ హోటల్ ఇందుకు వేదికైంది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అంటున్నారు.
రాత్రి వేళ చీకటిగా ఉండడంతో ఎంతమంది మృతి చెంది ఉంటారనేది చెప్పడం సాధ్యంకాలేదని అంటున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్ నుంచి బయటకు వెళ్లలేక అందులో చిక్కుకున్నట్లు పోలీసులు చెబుతున్నమాట. అయతే మృతి చెందినది ప్రయాణికులా? లేక హోటల్ సిబ్బందా? అందులో స్టే చేస్తున్నవారా? అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది. రాత్రి 8.30 గంటల సమయంలో భోజనానికి వచ్చినవారు ఉంటారని అంటున్నారు.
హోటల్‌లో అగ్నిప్రమాదం
ఏం జరిగిందో తెలీదుగానీ ఒక్కసారిగా హోటల్‌లో మంటలు అంటుకున్నాయి. ఆపై ఉవ్వెత్తుల ఎగిసిపడ్డారు. ఆ సమయంలో గాలి బలంగా వీయడంతో అక్కడికి ఎవరూ వెళ్లే సహాసం చేయలేకపోయారని అంటున్నారు. చాలామంది తమను తాము కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో హోటల్ సిబ్బంది ఒకరు పైకప్పుపై నుండి దూకి మరణించాడు.
ALSO READ: భారత సైన్యానికి ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. రాజీనామా చేసిన పాక్ సైనికులు
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌లు అక్కడికి చేరుకుని పలువుర్ని రక్షించాయి. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారని కమిషనర్ చెబుతున్నమాట.
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదం ఘటనపై విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు గుర్తించ లేదన్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని కాసేపట్లో సీఎం మమతా బెనర్జీ సందర్శించనున్నారు.
ఈ ఘటనపై స్పందించిన కేంద్రమంత్రి, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ తక్షణమే బాధితులకు అవసరమైన వైద్య సాయం అందించాలని కోరారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా మరింత పర్యవేక్షణ ఉండాలన్నారు.
అగ్నిప్రమాదం ఘటనపై బెంగాల్ కాంగ్రెస్ రియాక్ట్ అయ్యింది. కోల్‌కతా కార్పొరేషన్‌పై అధ్యక్షుడు శుభాంకర్ తీవ్రంగా విమర్శించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని, భవనంలో ఇంకా చాలా మంది చిక్కుకున్నారు అనేది ఎలాంటి వివరాలు లేవన్నారు. ఎలాంటి భద్రతా చర్యలు లేవని, కార్పొరేషన్ ఏం చేస్తోందో అర్థం కావడం లేదన్నారు.
BREAKING: 14 killed in massive fire at a hotel in Kolkata's Mechuapatti area.
The blaze was first spotted around 8.30 pm on Tuesday.
The cause of the fire is yet to be ascertained, however, an electrical short circuit is suspected to have triggered it.#Kolkata #Fire pic.twitter.com/7mRDGeLYAv
— Vani Mehrotra (@vani_mehrotra) April 30, 2025