Gundeninda GudiGantalu Today episode April 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. సుశీల మీనాకు సపోర్ట్ గా నిలుస్తుంది. నాలుగు తరాల నుంచి కోడళ్లను కూతురుగా చూస్తున్న ఇల్లు ఇది అని వివరిస్తుంది. ఇక మీనాను లేచి వచ్చి ప్రభావతి పక్కన కూర్చొమని, ముగ్గురికి ప్రేమగా తినిపించు అని తన కోడలను సుశీలమ్మ ఆదేశిస్తుంది. కానీ ప్రభావతి రోహిణి, శృతికి ప్రేమగా తినిపించి మీనాకు మాత్రం విసుక్కుంటూ నోట్లో కుక్కుతుంది. దాంతోనూ సుశీలమ్మ మండిపడుతుంది. భోజనాలను పూర్తి చేస్తారు. భోజనాల తర్వాత అందరూ సరదాగా స్వీట్లు తినాలని మీనా సుశీల అందరికీ స్వీట్లు ఇస్తారు. బాలు మీనాని సుశీల విడగొడుతుంది. బాలు మీనా కోసం సైగలు చేస్తాడు బామ్మ ఎక్కడో చోటు పడుకుంటుందిలే మనం వెళ్లి లోపలికి వెళ్లి పడుకున్నాను రా అనేసి అడుగుతాడు.. కానీ షీలా ఎంట్రీ ఇచ్చి ఇక్కడే పడుకుంటాను అంటుంది. ఆ తర్వాత బాలు రాసిన స్లిప్ కాస్త అందరిని గడ్డి వాము దగ్గరకు వచ్చేలా చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరూ జంటలుగా బయటకు వచ్చి తమ ప్రేమని బయట పెడుతూ భార్య భర్తలు అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే సుశీల వచ్చి గడ్డి బొమ్మ దగ్గర దొంగలా ఏంటి అని ఆ గట్టిగా అరుస్తుంది అప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరు ఒక్కొక్కరు బయటికి వచ్చేస్తారు. ఈ చీటీ గోల ఏంటి అని అడిగితే.. బాలు నిజం ఒప్పుకుంటాడు. ఆ లెటర్ తన భార్య మీనా కోసం రాశానని చెబుతాడు. కానీ వీళ్లందరికీ ఇలా చేరుతుందని అనుకోలేదంటూ చెప్పి ఆశ్యర్యపడుతాడు. బాలు చేసిన పనికి అంతా ఫూల్ అవుతారు. కానీ కొద్ది క్షణాలైనా సంతోషంగా ఒకరితోమరొకరు సమయం గడుపుతారు.
ఆ తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్లి పోతారు. ఇక మళ్లీ బాలు – మీనా ఏకాంతంగా కలుస్తారు.. బాలు సెటైర్లు వేస్తాడు. భార్యతో ఏకాంతంగా గడపాలంటే ఎన్ని పాటు పడాలని నాకు ఇంతవరకు అర్థం కాలేదు అని బాలు అంటాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఆరుబయట ఎవరైనా చూస్తే బాగోదు నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్లి పడుకుంటాను అనేసి అంటుంది మీనా. బామ్మ అక్కడ పడుకుంది కదా ఇక నువ్వు పడుకోవచ్చు అనేసి బాలు అనగానే ఈ మంచం మనకు సరిపోదు అండి అని నేను అంటుంది.
బయట మంచు కురుస్తుంది అలాంటప్పుడు ఎలా పడుకుంటాం ఇక్కడ అనేసి మీనా అనగానే.. బాలు మంచి సెట్ అప్ చేస్తాడు. గొడుగు వెన్నెలను క్రియేట్ చేస్తాడు. అంతేకాకుండా పాట కూడా పడి మీ నాన్న మెప్పిస్తాడు. ఉదయం లేవగానే మీనా బయటకు ముగ్గేయడానికి వస్తే ఊర్లో వాళ్ళందరూ గొడుగులు తీసుకున్న అక్కడికి వస్తారు. గొడుగులోపల లైటింగ్ ఎలా వచ్చింది చెప్పమని అడుగుతారు.
బాలు వాళ్ళందరిని మా బామ్మ వస్తే చంపేస్తుందని పంపించేస్తాడు. బయట ముగ్గు వేయడానికి మీనా వెళ్తే ప్రభావతి హడావిడి చేస్తుంది. మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నాడు సుస్వాగతం అని రాయాలని తెలియదా అని అంటుంది. నేను చెప్పినట్టుగా వంటలన్నీ చేసి పెట్టేసేయ్ అని మీ నాకు ఆర్డర్లు వేస్తుంది. ఈ బకెట్ తీసి ఇంకా పక్కన పెట్టలేదు ఏంటి అని బకెట్ ని తీయబోతుంటే ప్రభావతి కాలు సరి కింద పడిపోతుంది అప్పుడే సత్యం వచ్చి ప్రభావతిని పట్టుకుంటారు అందరూ ఆ సీన్ ను చూసి షాక్ అవుతారు.
ఇక లోపలికి వెళ్ళగానే దుమ్ము దులిపాలే అనేసి ప్రభావతి హడావిడి చేస్తుంది అది చూసిన షీలా మలేషియాలో కూడా దుమ్ము ఉంటుంది మల్లేష్ యాదవ్ కూడా మట్టి ఉంటుంది ఎందుకు ఈ డబ్బా ఒకటి అంత ఓవరాక్షన్ చేస్తుందని సెటైర్లు వేస్తాడు. ఇక మనోజ్ రోహిణి అక్కడికి రాగానే బాలు వాళ్ళిద్దర్నీ ఒక ఆట ఆడుకుంటాడు. ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం అవసరమా అని ప్రభావతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మలేషియా మావయ్య గురించి బాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. పరిస్థితులను చూస్తుంటే రోహిణి అడ్డంగా బుక్ అయ్యేలా కనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో..