Gundeninda GudiGantalu Today episode April 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు వాళ్ళందరిని బామ్మ వస్తే చంపేస్తుందని పంపించేస్తాడు. బయట ముగ్గు వేయడానికి మీనా వెళ్తే ప్రభావతి హడావిడి చేస్తుంది. మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నాడు సుస్వాగతం అని రాయాలని తెలియదా అని అంటుంది. నేను చెప్పినట్టుగా వంటలన్నీ చేసి పెట్టేసేయ్ అని మీ నాకు ఆర్డర్లు వేస్తుంది. ఈ బకెట్ తీసి ఇంకా పక్కన పెట్టలేదు ఏంటి అని బకెట్ ని తీయబోతుంటే ప్రభావతి కాలు జారి కింద పడిపోతుంది. అప్పుడే సత్యం వచ్చి ప్రభావతిని పట్టుకుంటారు అందరూ ఆ సీన్ ను చూసి షాక్ అవుతారు. లోపలికి వెళ్ళగానే ప్రభావతి హడావిడి చేస్తుంది. మలేషియా మావయ్య వస్తున్నాడు కదా ఎలా చూసుకోవాలో ఏంటో అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రోహిణి వాళ్ళ మామయ్య మలేషియా నుంచి వస్తున్నాడంటూ ప్రభావతి ఇంట్లో ఒకటే హడావుడిచేస్తుంది. హాల్లో అటు ఇటు తిరుగుతూ కంగారుపడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి ఏం చెయ్యాలి అంటూ టెన్షన్ పడుతుంది. ఆమె చేస్తున్న హంగామా చూసి అందరు షాక్ అవుతారు. రోహిణి వాళ్ళ మేనమామ గురించి మాట్లాడినప్పుడల్లా కొడుకు బాలు తన మాటల తూటాలతో ప్రభావతి నోట మాట రాకుండా చేస్తాడు. మలేషియా నుంచి వస్తున్న రోహిణి వాళ్ళ మేనమామ అసలు వస్తాడో రాడో తెలియదు కానీ ప్రభావం మాత్రం ఓవర్ బిల్డప్ ఇస్తుంది అంటూ అత్త సుశీల మందలిస్తుంది.. మీ మామయ్య వస్తున్నాడా లేదా అని అడుగుతుంది సుశీలమ్మ. దగ్గర వరకు వచ్చాడని, కార్ లోనే వస్తున్నాడని బదిలిస్తుంది. దగ్గరికి వచ్చాడని చెప్పడంతో ప్రభావతి ఇంకా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లో కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతోంది..
ఇక రవి, శృతీలు తమ రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. ఇక సుశీలమ్మ రూమును అడుగుతారేమోనని బాలు ముందుగానే తన పంచులతో అడగకుండా చేస్తాడు. చేసేదేం లేక రోహిణి మా రూమ్ ఇస్తాం లే అని, మేమే హాల్లో పడుకుంటామని బదులిస్తుంది. తోటకి వెళ్లి కొబ్బరి బోండాలు తీసుకురా అని ఆదేశిస్తారు. ఇక ఈ లోగా బయట కార్స్ సౌండ్ వినిపిస్తుంది. వచ్చింది మలేషియా మామ అనుకొని ప్రభావతి మనోజ్ హడావుడిగా వచ్చేస్తారు. రోహిణి కూడా ముందుగానే వస్తుంది. మొదట ఒక కారు వచ్చి అడ్రస్ అడిగి వెళ్లిపోతుంది..
ప్రభావతి మాత్రం హడావిడి చేస్తూ ఉంటుంది అంతలోకే ఓ వ్యక్తి కాపాడండి అంటూ వచ్చి ఇంట్లోనే కుడితి తోట్టలో పడిపోతాడు. అతనే మలేషియా మావయ్యని రోహిణి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అయ్యాయో ఇలా పడిపోయారేంటి? మీరు ఇలా కారులో కాకుండా కాలినడకని ఎందుకు వచ్చారు అని ప్రభావతి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. నాకు ఊరన్న సీనరీ అన్న చాలా ఇష్టం కారిని అక్కడే పంపించేసి అక్కడినుంచి నడుచుకుంటూ వచ్చేసానని మాణిక్యం అంటాడు.
అయితే కుడితినిధుల్లో కూరగాయలు వేస్తే మేకలు బాగా తింటాయి బాగా బలంగా తయారవుతాయని మటన్ షాపు ఓనర్ లాగా మాట్లాడుతాడు. బాలు కి డౌట్ వస్తుంది. నువ్వు మలేషియా నుంచి వచ్చావా మటన్ కొట్టు నుంచి వచ్చావా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఉన్న నాలుగు రోజులు అతని గుర్తు బయట పెట్టాలని అనుకుంటాడు. ఇక ప్రభావతి అతని స్నానం చేయించాలి మళ్లీ హడావిడి చేస్తుంది. ఆమె హడావిడి చూసిన బాలు షీలా డార్లింగ్ ఇద్దరూ సెటైర్లు వేస్తారు. రోహిణి మాత్రం చూడండి బాలుని కాసేపు కామ్ గా ఉండమని చెప్పండి అని అంటుంది. బాలుని ప్రభావతి పోయి కొబ్బరి బోండాలు తీసుకురమ్మని అన్నాను కదా నువ్వు వెళ్లి కొబ్బరి బోండాలు తీసుకురా పో అనేసి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో మలేషియా నుంచి ఏం తెచ్చారని ప్రభావతి తెగ ఆరాట పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాలి..