Gundeninda GudiGantalu Today episode August 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనికను కలిసిన మీనా ఇంటికి రావడంతో బాలు ఏమైంది అంత డల్ గా ఉన్నావ్ అని టెన్షన్ పడతాడు. అయితే మీనా బాలుని మోసం చేసేస్తుంది. ఏం జరిగిందో చెప్పమంటే అసలు మీనా చెప్పదు. మౌనిక బాధల గురించి నాకు తెలిస్తే ఖచ్చితంగా సంజయ్ ని చంపేస్తాడు అని ఆలోచిస్తుంది. ఇంటికి వెళ్ళిన మౌనికను చూసి సంజయ్ వచ్చావా నీ పుట్టింటికి వెళ్లి ఏడుస్తూ ఉంటావు అనుకున్నా మళ్ళీ ఇక్కడికే వచ్చావా అని బాధపడేలా మాట్లాడుతాడు.
పార్టీలో అంతా అవమానం జరిగితే మళ్లీ ఇంటికి ఎలా వచ్చావు నీకు కొంచమైన సిగ్గు శరం లేదా అంటూ మౌనికను దారుణంగా తిడతాడు సంజయ్. నాకు పెళ్లయింది ఇదే నా ఇల్లు ఇక్కడికి తప్ప ఎక్కడికి వెళ్లాలి అని మౌనిక అడుగుతుంది. పార్టీలో ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు నన్నే మాటలు అంటున్నారు అని మౌనిక అంటుంది. ఇదంతా నాకు తెలియదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అవమానిస్తాడు.. మీనా గుణకి వార్నింగ్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. గుణ శివ ఇద్దరూ రావడం చూసిన మీనా రెచ్చిపోతుంది.. అసలు నీ వయసెంత వాడి వయసెంత వాడితో నువ్వు తిరుగుతావ్ ఏంట్రా అని క్లాస్ పీకుతుంది. శివ వద్దని చెప్తున్న కూడా మీనా మాత్రం ఆగకుండా గుణ ని తిడుతుంది. గుణ మాత్రం మీనాకు బుద్ధ చల చేయాలని అనుకుంటాడు. ఇలాంటి వాడితో దూరంగా ఉండకపోతే నీ భవిష్యత్తు బాగోదు అమ్మ నీ మీద ఆశలు పెట్టుకుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని శివ కి చెప్తుంది..
మీనా అన్న మాటలకి సీరియస్ అవుతాడు గుణ. బాలు కి కోయదొర ఈరోజు ఎటువంటి వాటిలో వేలు పెట్టొద్దని చెప్పిన సరే మనకి రోజు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా.. మళ్లీ భయపడడం ఎందుకు అని వెళ్ళిపోతాడు. వీడు చెప్పిన ఆగడు అని రాజేష్ అనుకుంటూ ఉంటాడు. గతంలో పూలనందించిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు. ఆ ఎమ్మెల్యే ఇతను నా స్నేహితుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. కొత్త కారు కొంటానంటే నేనే వద్దు సెకండ్ హ్యాండ్ లో కారు కొంటే బాగుంటుంది అని పిలిచాను. కార్ల గురించి నీకు బాగా తెలుసు కదా అందుకే నువ్వైతే సెలెక్ట్ చేస్తావని నీకే చెప్పాను అని అంటాడు.
దానికి బాలు మరి నన్ను గుర్తు పెట్టుకొని పిలిచారు కచ్చితంగా మీకు ఈ పని చేసి పెడతాను అన్నా.. రండి సార్ మీకు ఎలాంటి కారు కావాలో నేను చూపిస్తాను అని అంటాడు. అయితే బాలు అతనికి కారు కొనిపిచ్చిన తర్వాత అందరూ కలిసి బార్ కి వెళ్తారు. బాలు నేను తాగని అని ఎంత చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే తాగు అని బలవంతం చేస్తాడు. ఆ పక్కనే ఉన్న గుణ వీడు తాగడు మంచోడు అని వీడి భార్య తెగ మురిసిపోతుంది అని అనుకుంటాడు.
వీడు బండారం బయటపడేలా చేస్తాను అని ఫోన్ లో వీడియో తీస్తాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది చూసిన ప్యాసింజర్లు బాలు కార్ ఎక్కడం మానేస్తారు. కొందరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. పూలు ఇవ్వడానికని ఇంటికి వచ్చిన మీనా శివ చూపించిన వీడియోని చూసి షాక్ అవుతుంది. తాగి బార్లు గొడవ పడడం చూసిన మీన కన్నీళ్లు పెట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది.. మీ ఆయన చాలా మంచోడిని గొప్పలు చెప్పావు కదా ఇదే మీ ఆయన బ్రతుకు అని శివ అంటాడు.
Also Read : రామరాజు ఇంట్లో వ్రతం.. వేదవతికి టెన్షన్.. అడ్డంగా బుక్కవ్వబోతున్న వల్లి..
ఆ వీడియోని చూసి మాట రాకుండా ఏడుస్తూ ఉంటుంది మీనా.. ఆ తర్వాత బాలు దగ్గరికి మీనా వెళ్లి ఈ విషయం గురించి అడుగుతుందా? దీని గురించి ప్రభావతి పెద్ద రచ్చ చేస్తుందా? సత్యం ఏమంటాడు అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..