Weekly Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (ఆగస్ట్ 17 నుంచి 23 వరకు) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: గ్రహాల సంచారం శుభయోగాన్ని సూచిస్తున్నాయి. కేంద్రంలో బుధాదిత్యయోగంవల్ల నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విదేశీ ప్రయాణాలపై ఆసక్తి చూపిస్తారు. శుభగ్రహాలతో కలిసి సంచరించే బోయే చంద్రుడు శుభ ఫలితాలను అందిస్తాడు. ఎంతో కాలంగా వేధిస్తున్న విషయాన్ని మీ సన్నిహితులతో కలిసి చర్చిస్తారు. సంతానంపైన మమకారంతో ఎదురుచూడటం జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 3, కలిసివచ్చేరంగు ఆకుపచ్చ, విష్ణు సహస్రనామాలు పఠించడం శుభాన్ని కలిగిస్తుంది.
వృషభ రాశి: ఏ విషయాన్ని తేల్చిచెప్పరు. విహార యాత్రలు చేస్తారు. 5వస్థానంలో కుజగ్రహ సంచారం వల్ల ఇతరులకు ఆందోళన కలిగుస్తారు. వ్యాపార చర్చలు ఫలిస్తాయి. ఏకాదశంలో శనైశ్చరుడు ఆర్థికంగా మీకు బలాన్ని తెచ్చి పెడుతున్నారు. నమ్మకంతో ముందుకు సాగండి. మీ అదృష్ట సంఖ్య 8, కలిసివచ్చేరంగు లేత నీలం రంగు, గణపతి అష్టోత్తరం చదవండి, వినాయకుడిని గరికతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించండి.
మిథున రాశి: గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నిటినీ మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏంచేసినా స్పష్టతతో ఉండాలని ప్రయత్నిస్తారు. జన్మరాశి లో గురు, శుక్రుల సంయోగం వలన అందురూ ఆకస్మికంగా మర్యాదలు చూపిస్తారు. కొన్ని సంఘటనలు మీకు కనువిప్పుని కలిగిస్తాయి. ఆత్మీయులను మించిన ఆస్తులు లేవని తెలుసుకుంటారు. మీ అదృష్ట సంఖ్య7, కలిసి వచ్చేరంగు ఎరుపురంగు, సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి .
కర్కాటక రాశి: ఆర్థిక ప్రయోజనాలకై యోచిస్తారు. ద్వితీయంలో రవిగ్రహ సంచారం శుభయోగాన్ని కలిగిస్తుంది. అష్టమంలో రాహువు వ్యయ ప్రయాసలకు గురిచేస్తాడు. సోదరవర్గంతో విరోధాలు ఏర్పడుతాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. పనిచేసే చోట ఒక సంఘటన మిమ్మల్ని వేదనకు గురిచేస్తుంది. చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తారు. మీ అదృష్టసంఖ్య 5, కలిసి వచ్చేరంగు: తెలుపు, అర్థనారీశ్వర స్తోత్రము పఠించండి. శివాలయంలో దీపారాధన నూనె దానం చేయండి.
సింహారాశి: జన్మరాశిలోకి రాశ్యాధిపతి అయినటువంటి సూర్యగ్రహ సంక్రమణం అద్భుతమైన రాజయోగాన్ని అందిస్తున్నాడు. రవికేతువుల కలయిక విశేషమైన ఫలితాలను అందిస్తుంది. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని అందుకుంటారు. అష్టమంలో వక్రశని సంచారం ఉన్నప్పటికీ మీ సాధనాబలం శుభ ఫలితాలనే అందిస్తుంది. పరాయి స్త్రీలతో వ్యవహారం కొంత ప్రమాదకరమే. అధికార యోగం సంపూర్ణంగా ఉంటుంది. మీఅదృష్ట సంఖ్య 4, కలిసి వచ్చేరంగు: చందనం రంగు, సూర్యనమస్కారాలు చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతారు.
కన్యా రాశి: భూ సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త ఉండండి. మీ జీవిత భాగస్వామితో గడపటానికి సమయం కేటాయించండి. గురు+శుక్రుల కలయిక మీపై మీ జీవితభాగస్వామిపై ప్రభావాన్ని చూపుతాయి. శివాలయంలో శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయించండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులా రాశి: పోగొట్టుకున్న వస్తువొకటి తిరిగి లభిస్తుంది. సమయస్పూర్తితో నడుచుకోండి. ఎదుటి వారిని ఆకర్షించేందుకు సమయం దొరుకుతుంది. అదృష్టమే మిమ్మల్ని అందలమెక్కిస్తుంది. దైవచింతనలో కాలం గడిపేస్తుంటారు. మీ అదృష్టసంఖ్య 6, కలిసివచ్చేరంగు: ఆకుపచ్చ రంగు, ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
వృశ్చిక రాశి: ఉద్యోగ పరంగా మార్పులుంటాయి ప్రేమలు ఫలిస్తాయి అష్టమంలో గ్రహ సంగమం వల్ల పదోన్నతులు కలుగుతాయి. మాతృదేవత ఆశీర్వచనలు సంపూర్ణంగా అందుకుంటారు. ఖర్చులు చూసుకుని చేయండి. పొదుపు చాలా అవసరం. ఒక మిత్రుడి సలహా మీ లైఫ్ స్టైల్ ని సంపూర్ణంగా మార్చివేస్తుంది. నిత్యం పెద్దల ఆశీర్వాదం తీసుకోండి.
ధనస్సు రాశి: రుణ ఒత్తిడితో కూడిన బాధలు తప్పవు. సోదరులతో సత్సంబంధాలు కొనసాగించండి. పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి. వ్యాపారంలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పితృవర్గం వారితో చర్చలు ఫలిస్తాయి. ప్రేమ వివాహం చేసుకుంటారు. మీ అదృష్ట సంఖ్య 1, కలిసి వచ్చేరంగు: గోధుమ రంగు, మహాలక్ష్మీదేవికి ఖండశర్కర నైవేద్యంగా సమర్పించండి.
మకర రాశి: అడుగడుగునా ప్రమాదాలే ఎదురవుతాయి. చేతికందిన అవకాశాలని కోల్పోతారు. తలకు దెబ్బతగిలి గాయాలయ్యే అవకాశం కలదు. దూర ప్రయాణాలు చేయడం ప్రాణాణికే ప్రమాదకరం. సంతానాభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో ఇతరుల సలహాలను వదిలివేయండి. మీ జీవిత భాగస్వామి చెప్పినట్లుగా ముందుకు సాగండి. మీ అదృష్ట సంఖ్య 3, కలిసివచ్చేరంగు తెలుపు, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి ఓంశాంతి ఓం శాంతిః అనేమంత్రం 108సార్లు ఉదయాన్నే చదువుకోండి.
కుంభ రాశి: రాహు కేతుల ప్రభావంవల్ల మనశ్శాంతిని కోల్పోతారు. తెలిసిన ఒకవ్యక్తి పరిచయం మీ జీవితాలకి కొత్త మెరుగులు దిద్ది దిశా నిర్దేశం చేస్తారు. ఉద్యానవనాలు సందర్శిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పని పూర్తవుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. ఒత్తిడికి గురికావొద్దు. మీ అదృష్ట సంఖ్య 5, కలిసి వచ్చేరంగు నలుపు రంగు, దుర్గాదేవిని దర్శించుకుని పసుపు కొమ్ములు సమర్పించండి.
మీన రాశి: గొప్పవాళ్ళతో కలిసి వ్యాపారాలు, రాజకీయాలు చేస్తారు. జీవిత భాగస్వామితో గొడవలు తగ్గుతాయి. పెద్దలు దీవించగా అఖండ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని కోరుకుటూ ఉండండి. సోదరులతో కలిసి చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. మీ అదృష్ట సంఖ్య 8, కలిసివచ్చేరంగు లేత గులాబి రంగు, నల్లనువ్వులు పారేటి నీళ్ళల్లో వదలండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే