Illu Illalu Pillalu ToIlluday Episode August 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో వ్రతం కదా అని తమ భార్యలు కొత్త చీరలు కట్టుకోవాలని, ముగ్గురు అన్నదమ్ములు కలిసి షాప్ కి వెళ్లి భార్యల కోసం ప్రేమగా చీరలని కొనుక్కొని వస్తారు. నర్మలకు ముందుగా సాగర్ చీరలు తీసుకుని వెళ్లి ఇస్తాడు. నర్మద మాత్రం సాగర్ ని అసలు పట్టించుకోకుండా ఉంటుంది. నువ్వంటే నాకెంత ఇష్టం చూసావా? నీకోసం ఎంత మంచి చీర తీసుకొచ్చాను అని సాగర్ అంటాడు. దానికి నర్మదా అందుకేనా నడిరోడ్డు మీద నేను పిలుస్తున్న కూడా పట్టించుకోకుండా వెళ్లి నన్ను ఏడ్చేలా చేసావని నర్మదా అంటుంది. అప్పుడు పరిస్థితులు వేరు.. నువ్వు ఆ పరిస్థితులను అర్థం చేసుకోవాలి అని సాగర్ అంటాడు. మొత్తానికి నర్మద, ప్రేమలు తమ భర్తలను క్షమిస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. నర్మద, ప్రేమలు ఇద్దరు తమ భర్తలు తెచ్చిన చీరలు కట్టుకుంటారు. కానీ శ్రీవల్లి ఎందుకు తను తెచ్చిన చీరను కట్టుకోలేదని చందు బాధపడుతూ ఉంటాడు. ఇక వ్రతంలో కూర్చునేందుకు అంత సిద్ధం చేస్తారు ముగ్గురు కోడళ్లు.. వరలక్ష్మి వ్రతం చేసే దంపతులు పీటల మీద కూర్చోవాలని పంతులు చెప్తాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి ఇంటికి పెద్ద కోడలు కదండీ మావయ్య గారు నేను ఈ వ్రతంలో కూర్చుంటానండి అని అంటుంది.
ఈ ఇంటి మంచి కోరేది నేనే కాబట్టి.. నేను మా ఆయన కూర్చుని ఈ పూజ చేస్తామండి అని అంటుంది శ్రీవల్లి. వేదవతి మాత్రం ముగ్గురు కొత్తగా పెళ్లయిన కోడళ్లే.. ఈ ముగ్గురి చేత వ్రతం చేద్దామని అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ముగ్గురు కోడలు వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చు అని ఎవరు అన్నారు వీళ్ళు ముగ్గురు కొట్టుకు చచ్చేలా ఉన్నారే అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రామరాజుని శ్రీవల్లి మాట్లాడినవకుండా చేస్తుంది..
భాగ్యం ఆనందరావు శ్రీవల్లి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఒప్పించే ప్రయత్నం చేస్తారు. శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ముగ్గురు కూడా పక్కా పథకం ప్రకారం అంతా చేస్తారు. నువ్వు వ్రతం చేయను ఏంటి పెద్ద కోడలుగా నేనే చేయాలి అని అను అని భాగ్యం శ్రీవల్లితో అంటుంది. లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని బెదిరించు. అప్పుడు నీ దగ్గరికి అందరూ వస్తారు అని భాగ్యం అంటుంది.
నేను కూడా తోడికోడళ్ళు ఇద్దరు మధ్యలో నా కూతురు ఉండలేదు అని మా ఇంటికి పంపించండి రామరాజు ని అడుగుతానని భాగ్యం అంటుంది. నువ్వు ఇంటికి పెద్ద కోడలువి.. నువ్వే ఈ పూజని చేయలేని భాగ్యం అడగమని చెబుతుంది.. చూడు అమ్మడూ.. ఈ వ్రతం నీ తోడుకోడళ్లకి ఆనందాన్ని కాదు.. కన్నీళ్లను మిగల్చాలి. ఈ దెబ్బతో వాళ్లిద్దరూ ఏడుస్తూ నీ జోలికి రారు. దానికి నువ్వేం చేస్తావంటే… నేను ఇంటి పెద్దకోడల్ని, వ్రతం నా చేతులపైనే జరిపిస్తానను..అని అడగమని చెప్తుంది. ముందుగా వేసిన పక్కా ప్లాన్ ప్రకారం శ్రీవల్లి రామరాజుని అడుగుతుంది. రామరాజు మాత్రం ఏం మాట్లాడలేక బుజ్జమ్మను చూస్తాడు. బుజ్జమ్మ అప్పటికే టెన్షన్ పడుతూ ఉంటుంది.
Also Read: ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..అస్సలు మిస్ అవ్వకండి..
అటు బుజ్జమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఈ కోడళ్లు ఏంటి పోట్ల గిత్త లాగా ముందుకు వస్తున్నారు శ్రీవల్లిని కొడతారా ఏంటి? కచ్చితంగా ఈ వ్రతం పెద్ద గొడవ లాగా సాగేలా ఉంది. ఏం జరుగుతుందో శ్రీరామచంద్ర అని వేదవతి భయపడుతూ ఉంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. నర్మదా ప్లాన్ ప్రకారం చేయాలంటే కచ్చితంగా ఈ పూజను శ్రీవల్లినే చేయాలని అనుకుంటుంది. అయితే శ్రీవల్లి అక్కని పూజ చేయమని చెప్పడానికి గోడలు ఇద్దరు ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి శ్రీవల్లి నగలు గిల్ట్ వీ అని తెలిసిపోతాయా లేదా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి..