OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలను కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటారు. ఈ సినిమాలలో అలాంటి సీన్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు కొంతమంది మహానుభావులు. అలాంటి వాళ్ళ కోసమే ఈ సినిమా. ఈ సినిమాలో ఒక అమ్మాయి తన గతాన్ని వదిలేసి కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటుంది. కానీ ఒక బ్యాడ్ బాయ్‌తో లవ్‌లో పడిపోతుంది. ఆతరువాత స్టోరీ హీట్ పుట్టించే సీన్స్ తో రచ్చ చేస్తుంది. ఈ సినిమా కొంచెం రొమాన్స్, కొంచెం కామెడీతో నడుస్తుంది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
అబ్బీ అనే అమ్మాయి లాస్ వేగాస్‌లో పోకర్ గేమ్ లో ఫేమస్. కానీ ఆ గతాన్ని వదిలేసి కాలేజ్‌లో కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటుంది. కాలేజ్‌లో మొదటి రోజు ఆమె ఫ్రెండ్ అమెరికా, ఆమె బాయ్‌ఫ్రెండ్ షెప్లీతో ఒక సీక్రెట్ ఫైట్ క్లబ్‌కి వెళ్తుంది. అక్కడ ట్రావిస్ మాడాక్స్ అనే బ్యాడ్ బాయ్ అబ్బీని చూసి ఇష్టపడతాడు. అయితే అబ్బీ అతన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆమెకు సీరియస్ లైఫ్ కావాలి. ఆమె అతన్ని సీరియస్ గా తీసుకోదు. ఇక చేసేదేంలేక ట్రావిస్, అబ్బీతో ఒక బెట్ వేస్తాడు. ఒక ఫైట్‌లో అతను ఒక్క పంచ్ కూడా తినకుండా గెలిస్తే, అబ్బీ ఒక నెల అతని అపార్ట్‌మెంట్‌లో స్టే చేయాలి. ఈ బెట్ కి తను ఒప్పుకుంటుంది. తరువాత ట్రావిస్ ఈ ఫైట్ లో గెలుస్తాడు.
Read Also : అక్క పెళ్లి చేసుకోవాల్సిన వాడితో ఆ పని చేసే చెల్లి… ట్విస్టులతో పిచ్చెక్కించే తమిళ క్రైమ్ డ్రామా
అబ్బీ అతని ఇంట్లో ఉంటూ, అతనికి దగ్గరవుతుంది. ట్రావిస్ అబ్బీని తన ఫ్యామిలీకి తీసుకెళ్తాడు. వాళ్లు లవ్‌లో పడతారు. కానీ ఇంతలో అబ్బీ తండ్రి మిక్ వచ్చి, తన అప్పు తీర్చడం కోసం అబ్బీని వేగాస్‌కి తీసుకెళ్తాడు. అబ్బీ పోకర్ ఆడి ఆ డబ్బును గెలుస్తుంది. ఆమె తండ్రి మోసం చేసినట్టు తెలిసి, అబ్బీ అతన్ని బెదిరించి డబ్బు తిరిగి తీసుకుంటుంది. ఇంతలో ట్రావిస్ అప్పు తీర్చడానికి ఒక డేంజరస్ ఫైట్‌లో పాల్గొంటాడు. కానీ అబ్బీ ఫైర్ అలారంతో అతన్ని సేవ్ చేస్తుంది. లాస్ట్‌లో అబ్బీ తన తండ్రితో సంబంధం కట్ చేస్తుంది. తాను గెలిచిన డబ్బుతో కాలేజ్ ఫీజు కట్టి, ట్రావిస్‌తో కొత్త జీవితం స్టార్ట్ చేస్తుంది.
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘బ్యూటిఫుల్ డిజాస్టర్’ (Beautiful disaster) అనేది ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. రోజర్ కంబుల్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో డిలాన్ స్ప్రౌస్, వర్జీనియా గార్డనర్, ఆస్టిన్ నార్త్, లిబే బేరర్ ప్రధానపాత్రల్లో నటించారు. 2023 ఏప్రిల్ 12 న థియేటర్లలో రిలీజ్ అయింది. హులు, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో ఈ సినిమా అందుబాటులో ఉంది. 96 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 5.3/10 రేటింగ్ ను కలిగిఉంది.