Gundeninda GudiGantalu Today episode August 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. కామాక్షి అన్నది కచ్చితంగా నిజమే.. తెలుసంటుందో తెలియక అంటున్నావు కానీ మిగతాలైతే మాట్లాడుతుంది అని ప్రభావతీ కామాక్షి మాటలు పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. రోహిణి మీరు సంతోషంగా ఉండాలని కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి ఇదంతా చేశాను అత్తయ్య. ఆ సంతోషం కాసేపు కూడా ఉండలేదు. బాలు ఇలాగా స్మార్ట్ గా ఆలోచిస్తారని అస్సలు ఊహించలేదు అని రోహిణి బాలు పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. ఇంత మంచి ఆలోచన బాలుకొస్తుందని అసలు అనుకోలేదు క్షమించండి అని అంటుంది. ప్రభావతి నువ్వేం చేస్తావ్ లేమ్మా.. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది పోనీలే ఇంటి ముందర పూల కొట్టు లేకుండా పోయింది అని సంతోషపడుతుంది. ఇక అక్కడే ఉంటే వాళ్ళ నాన్న గురించి ఎక్కడ అడుగుతారు అని రోహిణి మెల్లగా జారుకుని పైకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనోజ్ దిగులుగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఏంటి మనోజ్ అలా ఉన్నావ్ అని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ దగ్గరకు రోహిణి వస్తుంది. నువ్వు మీ నాన్న ఇచ్చిన 40 లక్షలు ఎవరో అమ్మాయి మోసం చేసి తీసుకెళ్లింది అని అన్నావు కదా.. ఆ అమ్మాయిని పట్టుకుంటే ఆ 40 లక్షలు మళ్ళీ మనకు వస్తాయి కదా అని రోహిణి అంటుంది. ఎప్పుడో ఆమె కెనడాకు వెళ్లిపోయింది ఇప్పుడు ఎలా దొరుకుతాయి అని మనోజ్ అంటాడు. ఏదోక ఏజెన్సీ ద్వారానే ఆమె కెనడాకు వెళ్లి ఉంటది. నువ్వే ఫ్లైట్ టికెట్ బుక్ చేసానన్నావు కదా అక్కడ వెళ్లి ఎంక్వయిరీ చేద్దామని ఇద్దరు అక్కడికి వెళ్తారు. ఆమె అడ్రస్ ని కనుక్కుంటారు.
మీనా తనకు వాళ్ళ నాన్న బండి కొనిచ్చాడని అందరికీ చెప్పాలని వెళ్తుంది. తన బస్తీకి వెళ్లి వాళ్ళ ఆయన స్కూటీ కొన్న విషయాన్ని అందరికీ చెప్తుంది. జాబ్ పోతే పోయింది స్కూటీ వల్ల మంచి గిరాకీలు వస్తున్నాయి అని మీనా చెప్పడంతో అక్కడివాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. స్కూటీ వల్ల ఇలాంటి మంచి జరుగుతుందంటే మంచిదే కదా అని అంటారు.. ఇక వాళ్ళ అమ్మ పదం అయినా ఇంట్లోకి వెళ్దామని అంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే శివా అక్కడికి వచ్చి అక్క మీద నాకేం కోపం లేదు బాలు మీదే నాకు కోపం.
చాలా రోజులకి అక్క వచ్చింది కదా చికెన్ తీసుకొని వస్తాను వండి పెట్టమ్మా తినేసి వెళ్తుంది అని అంటాడు. మీనా మాత్రం మా ఆయన మీద నీకు ఎప్పుడైతే గౌరవం ఉంటుందో అప్పుడే నేను ఇంటికి వస్తాను అని వెళుతుంది. మనోజ్ రోహిణి ఇద్దరూ ఏజెన్సీ దగ్గరికి వెళ్తారు. అక్కడ కల్పన గురించి అన్ని డీటెయిల్స్ అడుగుతారు. కానీ అక్కడ వాళ్లకు డీటెయిల్స్ దొరకవు అని చెప్పడంతో నిరాశతో ఇంటికి తిరిగి వస్తారు. ఆ తర్వాత రోహిణి మానసిద్దరూ బయటకొచ్చి మరేం పర్లేదు మనము మెయిన్ బ్రాంచ్ కి వెళ్లి కనుక్కుందామని అనుకుంటారు.
రోహిణి మన ఇంటికి రాగానే ప్రభావతి రోహిణి దగ్గరికి వస్తుంది. మీ నాన్న జైలు నుంచి బయటికి రావాలని ఒక పూజ చేయాలని అనుకుంటున్నాను. నువ్వే చాలా నిష్టగా 21 రోజు పూజ చేయాలి అని అంటుంది. అయితే రోహిణి మాత్రం వామ్మో ఇరవై ఒక్క రోజు ఇలా చేయాలా అని కంగారు పడుతూ ఉంటుంది. మీ నాన్న కోసం ఆమాత్రం చేయలేవా అని ప్రభావతి అంటుంది. రోహిణి నేను చేయలేనని చెప్పు మనోజ్ మనిద్దరం దూరంగా ఉండటం అంటే నా వల్ల కాదు అని అంటుంది.. కానీ ప్రభావతి మాత్రం ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా రావాల్సిందే అని కండిషన్ పెడుతుంది.
సత్యంని, మీనాని అందరినీ రెడీ అవ్వమని చెప్తుంది. శృతి మనము ఇలా చేయడం కరెక్టేనా అని అడుగుతుంది.. ప్రభావతిని శృతి ఇంత కష్టమైన పూజ చేయడం అవసరమా అని అడుగుతుంది. ప్రభావతి మాత్రం ఎంత కష్టమైనా పర్లేదు వాళ్ళ నాన్న కోసమే కదా చేయాల్సిందే అని అంటుంది.. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన మీనా ఈ పూజ చేయడం చాలా కష్టం.. ఒకవేళ ఏదైనా జరిగితే పూజలు మధ్యలో ఆపేస్తే ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. నిష్టగా చేయాలి రోహిణి విదేశాల్లో పుట్టిన అమ్మాయి కదా ఇలాంటివి చేస్తుందో లేదో అని మీనా అంటుంది.
Also Read :సోమవారం బోలెడు సినిమాలు..మూవీ లవర్స్ కు పెద్ద పండగే..
ఎవరి కోసం చేస్తుంది వాళ్ళ నాన్న బయటికి రావాలనే కదా ఖచ్చితంగా చేస్తుంది లేని ప్రభావతి అంటుంది.. ఇక అందరూ కలిసి గుడికి వెళ్ళాలి అని కూడా రమ్మని చెప్పు అని సత్యం అంటాడు. కల్పనాని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకున్న బాలు తాను వెళ్లేంతవరకీ తనకి పికప్ అండ్ డ్రాపింగ్ చేసేందుకు ఒప్పుకుంటాడు. మీనా ఫోన్ చేసి అర్జెంటుగా గుడికి రావాలని అడుగుతుంది. బాలు ఆమె పర్మిషన్ తీసుకొని గుడి దగ్గరికి వెళ్తాడు. అందరూ కలిసి గుడికి వెళ్తారు. బాలు కూడా అక్కడికి వచ్చి రోహిణి పూజ చేయడం నీ ఇష్టం గా ఉండాలని. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…