Gundeninda GudiGantalu Today episode December 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఎమోషనల్ అవుతాడు. అంతేకాదు ఎందుకు నాన్న మళ్లీ ఎందుకు నాన్న నువ్వు ఇంత డబ్బులు పోసి మళ్ళీ కొన్నావు అనేసి అనగానే ప్రభావతి కౌంటర్లు ఇస్తుంది. నాకోసం నువ్వు అమ్మావురా అందుకే నేనే దీని కొన్నాను అనేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక మీనాకిచ్చి ఇదిగో అమ్మ నీ చేత్తో తాళాలు ఇస్తే మంచిది అని బాలుకి ఇవ్వమని చెప్తాడు. మీనా వల్లే కారు పోయింది ఇప్పుడు మీనా వల్లే కారు వచ్చిందని బాలు కూడా అనుకుంటాడు. మీనా ను తీసుకొని బయటికి వెళ్లిన బాలు తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తన ఫ్రెండుని మీనాక్షి సారీ చెప్పాలని నువ్వు ఈ మాట చెప్పు అనేసి చెప్తాడు. వాడు నీతో ఏదో చెప్పాలంటమ్మా అనేసి అతను అంటాడు. ఇక రవి శృతి ఇద్దరూ తినడానికి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే రవి వంట మనిషి లాగా అవి ఇవి అనేసి చెప్తాడు.. నువ్వు చెప్తే తిన్నట్టే కానీ అనేసి శృతి తన కావాల్సింది తానే ఆర్డర్ చేసుకుంటుంది.. శృతి ఆర్డర్ చేస్తుంది రవిని సరిగా కూర్చోమని చెప్తుంది. హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానని బయటికి వెళ్తాడు. అప్పుడే బాలు కనిపిస్తే అన్నయ్య వదిన బాగున్నారా అనేసి అంటారు. రవి ని చూడగానే బాలు కోపంతో కొట్టడానికి వస్తాడు ఇక శృతి కూడా ఎందుకు కొడుతున్నారనేసి ఎదురుస్తుంది. అటు రవి కూడా నా భార్య ని ఏమనొద్దనేసి ఒకరి మీద ఒకరు ప్రేమను చూసుకుంటూ బాలుతో అంటాడు. అక్కడ ఉంటే ఫుడ్డు తినడానికి కుదరదు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి రమ్మని మీనాక్షి చెప్తాడు. ప్రభావతి కామాక్షి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రవి గురించి ఇంట్లో ఎలాగైనా చెప్పాలి అనేసి అంటాడు. ఇక సత్యం రాగానే రవి గురించి కామాక్షి ప్రభావతి చెప్తారు. అప్పుడే బాలు మీనా కూడా ఇంటికి వస్తారు. రెస్టారెంట్ లో రవి కనిపించారు. వాళ్ళిద్దరు తీరు ఇలా ఉందని బాలు చెప్తాడు. ఇక మీనా రవిని ఇంట్లోకి రానిద్దాం మామయ్య ఏదో తెలియక తప్పు చేశాడు కానీ ఇప్పుడు తనకి ఆ హక్కు ఉంది మీరంటే తనకి ఇష్టం ఉంది అనేసి అంటుంది. కానీ సత్యం మాత్రం నీకు వాడిని క్షమించే అంత మంచి గుణం ఉన్నా కానీ నాకు వారిని క్షమించే అంత మంచి మనసు లేదమ్మా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక బాలు విన్నారుగా మా నాన్న నిన్న ఏమి ఫైనల్ అనేసి అంటాడు. రవి ఉదయం రెస్టారెంట్లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. బాలుని శృతి తిడుతుంది. ఆ మీనా బాలును ఎలా భరిస్తుందో తెలియట్లేదు. రోజు గొడవలు పడుతుంటే ఇక నా వల్ల కాదు అని రవితో గొడవ పడుతుంది.. ఆ ఇంటికి వెళ్ళనవసరం లేదు. మీ అన్నయ్య రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు. మీ మీన వదిన ఎలా భరిస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటూ రవికి సమాధానం ఇస్తుంది.. నాకంటూ ఓ ఫ్యామిలీ ఉంది. అన్నదమ్ములు చెల్లెలు అందరూ ఉన్నారు. వారిని విడిచి ఉండడం నావల్ల కావడం లేదు. నువ్వే అర్థం చేసుకో.. ఆ బంధాలు ఆ బంధుత్వాలు వేరు’ అని రవి శృతికి నచ్చజెప్పి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రతి మాత్రం న్యూక్లియర్ ఫ్యామిలీలో అలాంటి బంధాలకు బంధుత్వాలకు తావు లేదని, నేను నువ్వు నేను మాత్రమే ఫ్యామిలీ అనుకుంటున్నారని, మరోసారి ఇంటికి వెళ్దామని చిన్న పిల్లాడిలా మాట్లాడకు అని అనగానే రవి సైలెంట్ అయిపోతాడు.. ఇక శృతి కూడా మౌనంగా ఉంటుంది.
ఇకపోతే రాత్రి ఇంటికి వచ్చిన బాలు ఒళ్ళు నొప్పులు ఉన్నాయని అలసిపోయి ఇంటికి వస్తాడు. ఒళ్ళు నొప్పులు ఉన్నాయంట బాధపడతాడు. దీంతో మీనా.. బామ్ రాస్తానంటూ చెబుతుంది. కానీ అవి సెట్ కావాలి, మసాజ్ చేయమంటాడు. దీంతో మీనా రెచ్చిపోతుంది. బాలును బొక్క బోర్లా పడుకోబెట్టి.. వీపుపై ఎక్కి తొక్కుతుంది. దీంతో బాలుకి చుక్కలు కనిపిస్తాయి. బాలు అమ్మా అంటాడు.. బాలుకి చుక్కలు కనిపిస్తాయి. ఒక్కసారిగా అమ్మ అంటూ అరుస్తాడు. ఆ అరుపు విన్న ప్రభావతి కంగారుపడుతుంది. ఎన్నడు లేనిది.. బాలు తనను పిలవడం ఏంటి అని షాక్ అవుతుంది. వెంటనే బాలు రూమ్ కి వెళ్లి చూస్తుంది. బాలుపై మీనా.. ఎక్కి తొక్కుతుండని చూసి.. వాడిని చంపేస్తావ్ అనుకుంటున్నావేంటి. అని మీనాపై కోప్పడుతుంది.. కానీ మీనా మాత్రం అలా ఆలోచించదు.. నొప్పి పోవాలని ఆలోచిస్తుంది. నువ్వుంటే నీతో తొక్కిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళమని ప్రభావతికి చెప్తాడు. దీంతో ప్రభావతి కోప్పడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాలుకి అనుమానం వస్తుంది. ‘ఎప్పుడు లేంది తన తల్లి పిలవగానే వచ్చింది. ఏందంటే.. మీనా ను అడుగుతాడు. ఎంతైనా మీ అమ్మ కదా నువ్వు పిలిస్తే.. కచ్చితంగా మాట్లాడుతుంది అని చెబుతోంది.. దానికి బాలు సంతోష పడతాడు..
రవి మనోజ్ కు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఇంటికి రావాలని ఉందని చెబుతాడు. ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఇంటికి రమ్మనడానికి సిద్ధంగానే ఉన్నారని, కానీ బాలు గాడే అడ్డుపడుతున్నాడంటూ మనోజ్ అంటాడు.. బాలు కోపంలో అర్థం ఉందని రవి వెనకేసుకొని వస్తాడు. అంతలోనే శృతి రూమ్ నుండి బయటకు రావడంతో తర్వాత కాల్ చేస్తానంటూ.. ఫోన్ కట్ చేస్తాడు రవి. దీంతో శృతికి కోపం వస్తుంది. తాను రాగానే ఫోన్ ఎందుకు కట్ చేసావ్ అంటూ రవిని నిలదీస్తుంది. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు? మీ అన్న తమ్ముళ్లు అంటూ అడుగుతుంది. ఇంట్లో వాళ్ళు తనని రమ్మంటున్నారని, కానీ, బాలు మాత్రమే అడ్డు చెప్తున్నారంట అని సమాధానం ఇస్తాడు రవి నువ్వు వెళ్ళు నేను రాను అని రవికి శృతి షాక్ ఇస్తుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అన్నలతో ఎలా మెదిలానో చెబుతాడు. దీంతో శృతికి మరింత కోపం వస్తుంది. అలాగైతే మీ అన్నలతో ఉండు.. నా దారి నేను చూసుకుంటా అంటుంది శృతి..ఇప్పుడు ఇలా ఎందుకు కోప్పడుతున్నావ్? టిఫిన్ చేసి వెళ్ళు అంటూ శృతిని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ, తనకు ఆకలి చచ్చిపోయిందని, ఆ టిఫిన్ ఏదో మీ అన్నయ్యలతో కలిసి తిను అంటూ ఎటకారంగా మాట్లాడి వెళ్లిపోతుంది. దీంతో రవి తన వెంబడి వెళ్తాడు. దీంతో కోపం వచ్చిన శృతి రోడ్డుపై పోవాలని పిలిచి రవిని అవమానిస్తుంది.. ఇక శృతి కోపంతో మీనాకు ఫోన్ చేస్తుంది. కలవాలని చెప్పి రమ్మంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..