Back Pain : చలికాలంలో చల్లటి గాలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చలి కారణంగా, శరీరంలోని కండరాలు, కీళ్లలో దృఢత్వం పెరుగుతుంది. దీని కారణంగా వెన్నునొప్ప సాధారణం అవుతుంది. ముఖ్యంగా ఆఫీసులో ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారికి లేదా వృద్ధులకు ఈ సమస్య మరింత పెరుగుతుంది. నడుము నొప్పి సమస్యతో ఇబ్బంది పడే వారు ఏ పనిని సక్రమంగా చేయలేరు. అంతే కాకుండా సమస్య చిన్నదే కదా అని కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే నడుము నొప్పితో ఇబ్బంది పడే వారు మందులు వాడకుండా కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా తక్షణ ఉపశమనం లభిస్తుంది. మరి నడుము నొప్పి తగ్గడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి నూనెతో మసాజ్:
ఆవాలు, కొబ్బరి లేదా నువ్వుల నూనెల్లో ఏదైనా ఆయిల్ తీసుకుని గోరువెచ్చగా వేడి చేయండి. తర్వాత దీనిని నడుముపై చేతులతో మసాజ్ చేయాలి.
రోజు 10-15 నిమిషాలు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఈజీగా నడుము నొప్పి తగ్గుతుంది.
వేడి నీటి ఫోమెంటేషన్:
వేడి నీటి సంచిలో వేడి నీటితో నింపండి.మీకు నడుము నొప్పి ఉన్న ప్రదేశంలో 10-15 నిమిషాలు హాట్ వాటర్ బ్యాగ్ ఉంచండి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయండి. ఇలా చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. మీరు సమస్య నుంచి బయట పడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఉప్పు నీటి స్నానం:
ఒక బకెట్ వేడి నీటిలో 1-2 టీస్పూన్ల రాతి ఉప్పు కలపండి. ఆ తర్వాత ఈ నీటితో స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈజీగా నొప్పి తగ్గడానికి ఇది చాలా బాగా పని చేస్తుంది.
పసుపు పాలు:
ఒక గ్లాసు వేడి పాలలో అర టీస్పూన్ పసుపు కలపండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగండి. పసుపు పాలు నడుము నొప్పిని తగ్గించడంలో చాలా బాగా పని చేస్తాయి. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
అల్లం టీ:
చిన్న అల్లం ముక్కలను నీటిలో వేసి మరిగించాలి. అందులో తేనె మిక్స్ చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
సాధారణ వ్యాయామం:
లైట్ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. భుజంగాసనం, మకరాసనం వంటి యోగాసనాలు వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ వ్యాయామాలు నడుము నొప్పిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.
గోరువెచ్చని నీరు తాగడం:
గోరువెచ్చని శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. అంతే కాకుండా కీళ్లను ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. తరుచుగా వేడి నీరు త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి వినియోగం:
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో 2-3 పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమలండి. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: చికెన్, గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ ఉండే శాకాహారాలు ఇవే !
సరైన భంగిమలో కూర్చోండి:
నిల్లప్పుడూ నిటారుగా కూర్చుని, కుషన్లను ఉపయోగించండి. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవద్దు. పని ప్రదేశంలో అప్పుడప్పుడు విరామం తీసుకోండి.
తగినంత నిద్ర పొందండి:
నిద్రపోవడానికి సరైన సమయం కేటాయించండి. తప్పకుండా ప్రతి రోజు 7-8 గంటల నిద్రపోండి