BigTV English

Gundeninda Gudigantalu Today Episode : మీనా చేసిన పనికి బాలు ఫుల్ ఖుషి .. మనోజ్ ను తిట్టిన సత్యం..

Gundeninda Gudigantalu Today Episode : మీనా చేసిన పనికి బాలు ఫుల్ ఖుషి .. మనోజ్ ను తిట్టిన సత్యం..

Gundeninda GudiGantalu Today episode December 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి మీనాకు ఫోన్ చేసి తనని కలవాలని, అర్జెంటుగా రెస్టారెంట్ కి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. ఈ సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న శృతిని చూసి సంజు మనుషులు ఫోన్ చేసి చెబుతారు. శృతి ఒక్కతే ఒంటరిగా వెళుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక సంజయ్ శృతిని ఫాలో అవమని తన మనుషులకి చెప్తాడు. ఇక మీనా ఆలోచిస్తూ ఉంటుంది బాలుకి చెప్తే అసలు వెళ్ళనివ్వడు..ఇక బాలు లేచి రెడీ అవుతాడు. ఇక మన రాత్రి గొడవ పడితే పొద్దున్నే ఖచ్చితంగా పూరి చేస్తావా అనేసి మీ నాన్న అడుగుతాడు. ఇక మీనా తినిపించాలని బాలు కొత్త డ్రామా మొదలుపెడతాడు. టిఫిన్ చేసిన వెంటనే బాలు వెళ్లిపోతాడు.. బాలు వెళ్ళగానే మీనా శృతిని రెస్టారెంట్లు కలవడానికి వెళుతుంది. రెస్టారెంట్లో శృతి మీనా మాట్లాడుకుంటారు. రవి పై కంప్లైంట్ ఇస్తుంది. మీనా మాత్రం శృతిదే తప్పు అని వాదిస్తుంది. ఈరోజు నువ్వు నచ్చి నీ దగ్గరికి వచ్చాడు. అదే ఈ బంధం నచ్చలేదు.. అనుకుంటే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా ఉమ్మడి కుటుంబం గురించి ఆలోచించు.. అర్థం కాదు అన్ని సర్దుకో.. అని వెళ్తుంది. బయటకు రాగానే సంజు యాసీడ్ దాడి చెయ్యాలని అనుకుంటాడు. మీనా అది గమనించి రాళ్ళతో దాడి చేసి శృతిని కాపాడి ఇంటికి తీసుకొనివెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా శృతి దగ్గరకెళ్ళి ఓదారుస్తుంది. ధైర్యం చెబుతుంది. అనవసరంగా టెన్షన్ పడొద్దు అని ఇంటికి తీసుకు వెళుతుంది. ఇంట్లో కూర్చుని పెట్టి కుటుంబం అంటే ఏంటి? ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుంది? ఉమ్మడి కుటుంబంలో ఉంటే.. రక్షణ, ధైర్యం.. మనకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది. ఇండివిజువల్ గా ఉంటే అలాంటి నమ్మకాలు, ధైర్యం ఉండదని, ఇప్పటికైనా అందరితో కలిసి విధంగా ఆలోచించు.. రవిని అర్థం చేసుకో అని చెబుతోంది. అప్పుడే రవి ఇంటికి వస్తాడు. శృతి నీకేం కాలేదు కదా అని టెన్షన్ పడతాడు. వదిన ఫోన్ చెయ్యగానే నేను ఎంత టెన్షన్ పడ్డానో అని శృతిని ఓదారుస్తాడు. మీనా ఏం కాలేదు అంటుంది. ఇక నేను వెళ్తాను అని చెప్తుంది. శృతి థ్యాంక్స్ చెప్తుంది. నేను నీకు పరాయి దాన్ని కాదు అక్కను అవుతానని చెప్తుంది. ఇక బాలు మీనాకు ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావ్ ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు ఏదో ఒకటి తీసుకొస్తున్నావా అనేసి అడుగుతాడు. దానికి మీనా నేను కాస్త బిజీగా ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తాను అనేసి అంటుంది. అంటే కొంపమీదకి ఏదో తీసుకొస్తున్నామని బాలు టెన్షన్ పడుతూ ఉంటాడు. మీనా సురేందర్ దగ్గరికి వెళ్తుంది. శృతి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడాలని వచ్చాను అని సంజయ్ దాడి చేసిన విషయాన్ని వాళ్లకు చెప్తుంది. శృతి వాళ్ళమ్మ టెన్షన్ పడుతుంది. ఇక సురేంద్ర నాకు శృతి అని వాళ్ళు ఎవరో తెలియదని ముందుగానే అంటాడు.

మీ కూతురు జీవితాన్ని ఆగం చేయాలని భావించారు. ఓ ఉన్మాదికిచ్చి పెళ్లి చేయాలని భావించారు. ఆ విషయం తెలుసుకున్న మీ కూతురు రవిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ వరకు బాగానే ఉందని చెబుతోంది. మీరు చూసిన ఆ రాక్షసుడు తనను వేదిస్తున్నాడని చెప్తుంది. తనపై యాసిడ్ దాడి చేశాడంటూ అసలు విషయాన్ని బయటపడుతుంది. ఇప్పటికైనా మీ కూతురికి అండగా ఉండి, తన ప్రాణాలను కాపాడుకోండి అని సలహా ఇచ్చి వెళ్లిపోతోంది. అప్పటివరకు కూల్ గా ఉన్న సురేంద్ర ఒక్కసారిగా ఆవేశానికి లోనవుతాడు. ఇలాగైనా ఈరోజు నీలకంఠంతో మాట్లాడి.. ఈ విషయం తేల్చుకుంటానంటూ వెళ్తాడు. మరోవైపు.. బాలు.. మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.ఇంటికి రాగానే మీనా పై అరుస్తుంటాడు.. మళ్లీ ఏం గొడవలు చెయ్యడానికి వెళ్ళావు అని టెన్షన్ పడుతూ అడుగుతాడు. నేను శృతిని కలవడానికి వెళ్ళాను అండి అనేసి అంటుంది. శృతి ఎవరు అని బాలు అడగ్గానే రవి వాళ్ళ భార్యను కలవడానికి వెళ్ళాను అంటుంది. రెస్టారెంట్లు అన్ని మాటలు అన్న తనని కలవడానికి నువ్వు ఎందుకు వెళ్లావు అని అనగానే నేను చెప్పేది కాస్త వింటారా అని అడుగుతుంది. అప్పుడే మీడియా వాళ్ళు అక్కడికి వస్తారు.


ఇంట్లో వారందరికీ.. మీనా చేసిన సహసం చేసిన వీడియో చూపించి.. షాక్ ఇస్తుంది. మెయిన్ గా ప్రభావతి తన కోడల్నీ చూసి భయపడుతోంది. ఇకపై జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అవుతోంది. మీడియా ముందు మీనా మాట్లాడుతూ.. తనకు తన భర్త బాలు నుండి ధైర్యం వచ్చిందని, తాను అలా పోరాడడానికి, తన భర్తని కారణమంటూ చెబుతుంది. ఆయన ఎల్లప్పుడూ పందెంకోడిలా ప్రతి సమస్యను ఎదురిస్తాలంటూ బాలుని పొగడ్తలతో ముంచెత్తుతుంది. ఇక బాలుని కూడా మీడియా వాళ్ళు అడుగుతారు. మీ భార్య గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అనగానే బాలు మీనా చాలా మంచి అమ్మాయి. కానీ ఇంత ధైర్యం చేసిందంటేనే నమ్మలేకపోతున్నాము. కానీ ఒక అమ్మాయిని కాపాడింది అంటే మాకు సంతోషంగా ఉందని బాలు చెప్తాడు. ఇక ప్రభావతి మనోజ్ రోహిణి భయంతో ఇంట్లోకి వచ్చేస్తారు. బాలు మీడియా వాళ్ల దగ్గర నుంచి ఆ రాయిని తీసుకుంటాడు. నిజం చెప్పు నువ్వు ఇంత బరువున్న రాయిని ఎలా విసిరేసావు అనేసి అడుగుతాడు. ఇక ఇంట్లోకొచ్చిన రోహిణి బాలుమినాలు ఇద్దరూ కలిసి రౌడీ అనుకో అనే కంపెనీని స్టార్ట్ చేస్తారేమో అనేసి అనగానే మనస్సు బాగా చెప్పావని నవ్వుతాడు. బాలు లోపలికి రాగానే మమ్మీ ఈ స్టోన్ చూసావా ఎలా ఉందో మీనా నువ్వు వాళ్ళ అన్న మాటలు అన్ని విన్నావుగా నీకు ఏదైనా మీ నాన్న అంటావా బయటికి వెళ్ళింది అని అరుస్తావా అనేసి అడుగుతాడు. సాహసం చూసిన ప్రభావతి భయపడుతుంది. మనోజ్ కు చూపిస్తూ ఇన్ డైరెక్టర్గా వార్నింగ్ ఇస్తాడు బాలు. ఈ సమయంలో అమ్మాయి అంటే అనుకువగానే కాదు.. అవసరమైతే ఆదిశక్తుల పోరాడాలంటూ మీనాను పొగడ్తాడు సత్యం. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనా ను ముద్దులతో ముంచేస్తాడు బాలు. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×