Gundeninda GudiGantalu Today episode February 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి ఇచ్చిన డబ్బుల గురించి బాలుకి మీనా చెబుతుంది. ఇక ఏమో అండి నాకు తెలీదు మనం కూడా ఇకమీదట నుంచి మీ అమ్మగారికి పాకెట్ మనీ ఇద్దామని అంటుంది. సరే నేను వెళ్లి స్నానం చేసి వస్తాను అని బాలు అంటాడు.. స్నానం చేసి వచ్చిన తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి అక్కడే భోజనం చేస్తారు.. బాలుని మీనాను ఇంట్లో నుండి పంపించాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. అలా ప్రభావతి అర్ధరాత్రి సడన్ గా లేచి.. బాత్రూం వస్తుంది అని కుప్పిగంతులు వేస్తుంది. అయితే కింద బాత్రూం ఉంది కదా అక్కడికి వెళ్ళు అంటే అక్కడ బల్లులు గబ్బిలాలు సంసారం చేస్తూ ఉంటాయండి నేను వెళ్ళను అని అంటుంది నేను అంచుతాను కదా పదా అనేసి సత్యం ప్రభావతిని బాత్రూంకి తీసుకెళ్తాడు. ఇక తర్వాత మీనా ను బాలుని ఇంట్లోంచి పంపించేస్తే మనం ఇలాంటి బాధలు పడాల్సిన అవసరం లేదు కదా అనేసి ప్రభావతి అంటుంది. దానికి సత్యం ఆలోచిస్తాను అని అంటాడు. ఉదయం లేవగానే బాలు మీనను ప్రభావతి ఇంట్లోంచి బయటకు పంపాలని అనుకుంటుంది. కానీ చివరకు ప్రభావతికి సత్యం షాక్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి కామాక్షి ఇంటికి వెళుతుంది, రోహిణి ఇచ్చిన డబ్బులు గురించి గొప్పగా చెప్తుంది. నా కోడలు నాకు డబ్బులు ఇవ్వాలని అనుకుంది ప్రతి నెల ఎంతో కొంత ఇస్తుంది ఇప్పుడు డబ్బులు ఇస్తుంది రేపు ఏకంగా బంగారు ఇంకా ఏదో ఒకటి తెలుస్తుంది అనేసి తెగ ఆశపడుతుంది.. అయితే దానికి కామాక్షి మాత్రం రోహిణి నీకు పరిచయండానికి కారణం నేనే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావంటే నా వల్లే అని గుర్తు పెట్టుకో వదిన అనేసి అంటుంది. రోహిణి నీకు ప్రతినెలా డబ్బులు ఇస్తుంది కదా నాకు పార్టీ ఇవ్వవా అని అనగానే నీకు ఎందుకు ఇవ్వను పార్టీ కచ్చితంగా ఇస్తానని ప్రభావతి అంటుంది. మన రోజు వెళ్ళే రెస్టారెంట్ కెళ్ళి బిర్యానీ తినేసి వద్దాం అనేసి ప్రభావతి అంటుంది. ఇక మీనా ను బాలుని ఎలా గొలగ టార్చర్ చేసి ఇంట్లోంచి బయటికి పంపించే ప్లాన్ వేస్తానని ప్రభావతి అంటుంది. చూసుకో వదిన నువ్వు ఇలా అంటున్నావ్ అన్నయ్య పర్మిషన్ లేకుండా నువ్వు ఏది చేయలేవు అనేసి కామాక్షి అంటుంది.
ఆ తర్వాత ప్రభావతి ఇంటికి వచ్చి టిఫిన్ అయిందా అనేసి అరుస్తుంది. ఇడ్లీ అయితే సాంబార్ చేసావా రోహిణి పుదీనా చట్నీ అడిగింది చేసావా అనేసి ఆర్డర్లు వేస్తుంది. నాకు రెండు చేతులే ఉన్నాయి అత్తయ్య ఎలా చేయాలి? అన్ని వెంట వెంటనే హోటల్లో ఆర్డర్ ఇచ్చినట్టు మీరు ఇస్తూ ఉంటే నేను చేయడానికి టైం పడుతుంది అనేసి మీనా అంటుంది. నువ్వు ఇంకేం చేస్తావ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఖాళీనేగా తినేసి పడుకుంటావు గా అనేసి ఎద్దేవా చేస్తుంది ప్రభావతి. ఇక రోహిణి కిందికి వచ్చి ఆంటీ టిఫిన్ అయిందా అని అడుగుతుంది. అయిందమ్మ ఇడ్లీ అనగానే నాకు ఇడ్లీ వద్దు దోస వేస్తావా అనేసి అడుగుతుంది. ఇక అప్పుడే శృతి కూడా కిందకి వస్తుంది. ఏమైంది ఆ సీరియల్ కి నేను డబ్బింగ్ చెప్పాలా టార్చర్ చేస్తుంది అత్త అలాంటి అత్త నాకు గనక ఉంటే చంపాడు దొబ్బుతాను అనేసి కావాలనే అంటుంది. ప్రభావతి ఏమైందమ్మా అంటే నాకు ఒక చెత్త సీరియల్ ఇచ్చారు లేండి ఆ సీరియల్ కి డబ్బింగ్ చెప్పాలంట దాంట్లో అత్త క్యారెక్టర్ వెరీ బాడ్ కోడల్ని టార్చర్ చేస్తుంది అనేసి అంటుంది.
కోడల్ని టార్చ్ చేయడం ఏందమ్మా నాలాగా మంచిగా చూసుకోవచ్చు కదా అనేసి అంటే అవును కదా ఆంటీ అనేసి అంటుంది. ఇక టిఫిన్ ఏంటి అని అడిగితే ఇడ్లీ అంటే నాకు ఇడ్లీ వద్దు నాకు ఆమ్లెట్ వేస్తావా అనేసి అడుగుతుంది. మీనాకు పని మీద పని చెప్తున్నాడం బాలు వింటాడు. మీనా నాకు ఇడ్లీ వద్దు దోస వేస్తావా అంటే ఇడ్లీ చేసానండి వీళ్ళకి వేయించాలంట అనేసి అనగానే ఆమ్లెట్ వేయాలంటే అని అంటుంది. ఆమ్లెట్ ఏ కదా నేను బాగా వేస్తాను నువ్వు దోస వెయ్యు అనేసి బాలు అంటాడు. బయటికి రెండు గుడ్లు తీసుకొచ్చి రెండే కదా ఆమ్లెట్ వేయాల్సిందే అనేసి గుడ్లు పగలగొడతాడు. ఎందుకురా ఇలా చేస్తున్నావ్ అంటే మీనాకు పనులు చెప్తే నేను అసలు ఊరుకోను ఇదేమైనా హోటల్ ఆ ఇలా పనులు చెప్తే తను ఎలా చేస్తుంది అనేసి జాలి పడతాడు. ఇక రోహిణి నాకే టిఫిన్ వద్దని వెళ్ళిపోతుంది అలాగే శృతి కూడా నాకు ఏ టిఫిన్ కూడా వద్దు అనేసి వెళ్ళిపోతుంది. బాలు కూడా నాకు టైం అవుతుంది నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు ప్రభావతి మాత్రం మీనా ను ఏ చేపలో పీతలు తీసుకురా ఎలా చేయాలో నేను చెప్తాను అనేసి అంటుంది. ఇక మీద బయటకు వెళ్తుంటే వాళ్ళ అమ్మ పార్వతి కనిపిస్తుంది ఏమైంది మీనా మెడలో తాళి కూడా లేకుండా తిరుగుతున్నామంటే ఇంటికి తీసుకెళ్ళి అసలు నిజాలు బయట పెట్టించాలని పార్వతి అనుకుంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో పార్వతి మీనాకు పుస్తెలతాడు చేసి తీసుకొస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..