BigTV English

Sonam Kapoor: నాకు ఇష్టం లేనివారితో పనిచేయను.. తేల్చిచెప్పిన సోనమ్ కపూర్

Sonam Kapoor: నాకు ఇష్టం లేనివారితో పనిచేయను.. తేల్చిచెప్పిన సోనమ్ కపూర్

Sonam Kapoor: మామూలుగా బాలీవుడ్‌లో నెపో కిడ్స్ అంటేనే ముందుగానే అందరిలో ఒక నెగిటివిటీ వచ్చేస్తుంది. వారిని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి ప్రేక్షకులకు చాలా సమయం పడుతుంది. వారి యాక్టింగ్‌తో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేస్తే తప్పా నెపో కిడ్స్‌పై వచ్చిన ఈ నెగిటివిటీ పోదు. అలా కపూర్ ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా అడుగుపెట్టిన సోనమ్ కపూర్‌ను ఇప్పటికీ చాలామంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పెళ్లి తర్వాత చాలావరకు సినిమాలను తగ్గించేసింది సోనమ్. అయినా కూడా అప్పుడప్పుడు పలు ఫోటోషూట్స్‌తో ఫాలోవర్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్ కపూర్.. తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడింది.


ఫ్యామిలీ లైఫ్

ఆనంద్ అహూజా (Sonam Kapoor) అనే బిజినెస్ మ్యాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సోనమ్ కపూర్. వీరిద్దరికీ వాయు అనే బాబు కూడా పుట్టాడు. దీంతో పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌పైనే ఫోకస్ పెట్టింది ఈ నెపో కిడ్. ఇప్పటికీ తన జీవితంలో తన కుమారుడిని చూసుకోవడమే ముఖ్యమని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా హీరోయిన్‌గా నటిస్తున్న రోజుల్లో చాలా జాగ్రత్తలు తీసుకునేదాన్ని అంటూ తెలిపింది. ప్రస్తుతం తనను పూర్తిగా నమ్మి, ఎంజాయ్ చేసే దర్శకులతో మాత్రమే పనిచేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాజాగా ఒక ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న సోనమ్.. రోహిత్ అనే తన క్లోజ్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్‌ను మిస్ అవుతున్నట్టు కన్నీళ్లు పెట్టుకుంది. దాని గురించి కూడా తను మాట్లాడింది.


రోహిత్ జ్ఞాపకాలు

‘‘నేను ర్యాంప్ వాక్ చేయడానికి చాలావరకు కారణం రోహిత్. నా తల్లి ద్వారా తను నాకు పరిచయమయ్యాడు. ఎందుకంటే తను నా తల్లికి బాగా తెలుసు. దాదాపు నా జీవితం మొత్తం తనను చూస్తూనే ఉన్నాను. ఇలా ర్యాంప్ వాక్ చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నా తను లేని లోటు కనిపిస్తోంది. నాకు అనార్కలి అంటే చాలా ఇష్టం. నేను వైట్ అనార్కలి ఎన్నో సందర్భాల్లో వేసుకున్నాను. నేను రోహిత్ డిజైన్స్‌ను నా జీవితంలో ముఖ్యమైన ఈవెంట్స్ అన్నింటికి వేసుకున్నాను. ఇండియాలో ఫ్యాషన్‌ను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తుల్లో తను కూడా ఒకడు’’ అంటూ ప్రశసించింది సోనమ్. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read: ఇనయ సుల్తానా బో** చూడాలంటే గుండె ధైర్యం కావాలి..?

మనుషులు మారిపోతారు

‘‘తల్లి అవ్వడం అనేది నన్ను పూర్తిగా మార్చేసింది. అది మహిళలకు శారీరికంగా, మానసికంగా.. అన్ని రకాలుగా మార్చేస్తుంది. అసలు ముందు ఉన్న మనిషి కాదేనే అనిపించేస్తుంది. మంచిగా మారుతారు. మీకు పిల్లలు ఉంటే పిల్లలే మీకు మొదటి ప్రాధాన్యత అవుతారు. ఎలంటి వారితో అయినా కలిసి పనిచేయడానికి నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ మనిషిగా మనం ఎదిగేలా చేసేవారితోనే ఎక్కువగా పనిచేస్తాను. ఒకరు నాకు నచ్చకపోతే వారితో కలిసి పనిచేయడం చాలా కష్టం. నేను ఈమధ్య చాలా సెలక్టివ్ అయిపోయాను. నేను ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్న అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను’’ అని వివరించింది సోనమ్ కపూర్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×