E-Paper
Advertisement

OTT Movie : మంత్రాలతో పిచ్చెక్కించే ఫాంటసీ థ్రిల్లర్… ప్రేమించినవాడు దక్కలేదని…

OTT Movie : మంత్రాలతో పిచ్చెక్కించే ఫాంటసీ థ్రిల్లర్… ప్రేమించినవాడు దక్కలేదని…

OTT Movie : ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి చిన్న పిల్లలతో సహా అందరూ కలిసి చూడటానికి ఇష్టపడతారు. ఈ సినిమాలు చూస్తున్నంత సేపు, మరో ప్రపంచంలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. గత ఏడాది వచ్చిన అటువంటి మూవీ ఒకటి, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

జి ఫైవ్ (Zee 5) లో

ఈ హాలీవుడ్ ఫాంటసీ మూవీ పేరు ‘వికెడ్’ (Wicked). 2024లో విడుదలైన ఈ మ్యూజికల్ ఫాంటసీ మూవీకి జోన్ ఎమ్. చు దర్శకత్వం వహించారు. ఇందులో ఎల్ఫాబా త్రోప్‌గా సింథియా ఎరివో. లిండా అప్‌ల్యాండ్‌గా అరియానా గ్రాండే నటించారు, జోనాథన్ బెయిలీ, ఏతాన్ స్లేటర్, బోవెన్ యాంగ్, మరిస్సా బోడే, పీటర్ డింక్లేజ్, మిచెల్ యోహ్, జెఫ్ గోల్డ్‌బ్లమ్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ హాలీవుడ్ ఫాంటసీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

ఓజ్ అనే నగరాన్ని పాలించే ఒక జనరల్ కి, హీరోయిన్ నీలం రంగులో పుడుతుంది. ఆమె అలా పుట్టడంతో తల్లిదండ్రులు చాలా బాధగా ఫీల్ అవుతారు. ఆమెకు మంత్ర శక్తి కూడా ఉందని తెలుసుకుని, ఆమెను అఇష్టంగానే పెంచుతూ ఉంటారు. ఆ తర్వాత మరొక అమ్మాయిని కూడా కంటారు. అయితే ఆ అమ్మాయికి అంగవైకల్యం ఉంటుంది. వీళ్ళిద్దరూ కాస్త పెద్దవాళ్ళు అయ్యాక చదువుకోడానికి యూనివర్సిటీకి వెళ్తారు. మొదట హీరోయిన్ కి చదువుకోవడానికి తల్లిదండ్రులు పర్మిషన్ ఇవ్వరు. అయితే యూనివర్సిటీ లో చెల్లెల్ని చేర్పించడానికి వెళ్తుంది. ఆమెకు ఉన్న శక్తులను చూసి ప్రిన్సిపాల్ కాలేజ్ లో జాయిన్ అవమని అడుగుతుంది. మీ తండ్రిని అడిగి పర్మిషన్ తీసుకుంటానని చెప్తుంది. అలా హీరోయిన్ కూడా యూనివర్సిటీలో జాయిన్ అవుతుంది. ఆ కాలేజ్ లో హీరోయిన్ ను చూసి అందరూ ఎగతాళి చేస్తుంటారు. లిండా అనే అమ్మాయి తనకి రూమ్మేట్ గా ఉంటుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది.

ఒక యువరాజు ఆ యూనివర్సిటీని సందర్శిస్తాడు. అతన్ని హీరోయిన్ కూడా ఇష్టపడుతుంది. అయితే లిండా అతన్ని బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేస్తుంది. యువరాజు కూడా ఆమె అందానికి పడిపోతాడు. ఆ తర్వాత ఈ విషయం తెలిసి హీరోయిన్ చాలా బాధపడుతుంది. హీరోయిన్ కు మంత్రాల పవర్ ఎక్కువగా ఉందని తెలుసుకున్న యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఒక ప్రయోగానికి సిద్ధపడుతుంది. హీరోయిన్ తో జంతువులపై ఒక ప్రయోగం చేస్తుంది. తన శక్తిని దుర్వినియోగం చేస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరోయిన్. ఆమెను పట్టుకోవడానికి ఒక ఆర్మీ నే పంపిస్తుంది ప్రిన్సిపాల్. చివరికి హీరోయిన్ ఏమవుతుంది? తన శక్తులను ఎలా వాడుతుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘వికెడ్’ (Wicked) అనే ఈ హాలీవుడ్ ఫాంటసీ మూవీని చూడాల్సిందే.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×