BigTV English

Gundeninda GudiGantalu Today episode: మౌనికకు షాకిచ్చిన సంజు.. తృటిలో తప్పించుకున్న మనోజ్..

Gundeninda GudiGantalu Today episode: మౌనికకు షాకిచ్చిన సంజు.. తృటిలో తప్పించుకున్న మనోజ్..

Gundeninda GudiGantalu Today episode February 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం వెళ్లి ఎందుకు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు మన అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని వెళ్ళింది కదా అలా మాట్లాడటం ఎందుకు అంటే మన అమ్మాయికి ఈ పూల అమ్ముకునే దానికి తేడా ఉంది అంటుంది. మనమ్మ ఈ కోటీశ్వరులు ఇంటికి కోడలుగా వెళ్ళింది అన్ని వాళ్లే చేసుకున్నారు అది మర్చిపోకండి అనేసి ప్రభావతి గొప్పగా చెప్తుంది. అటు మౌనికని ఇంట్లో పనిమనిషిని చేస్తాడు సంజు. అక్కడికి వచ్చిన వాళ్ళతో పనిమనిషిలాగే అనడంతో బాధపడుతుంది. అప్పుడే మౌనికకు తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది.. ఏంటే అంత బిజీగా ఉన్నావా? ఆఫీస్కి ఎప్పుడు వస్తావే బాస్ అడుగుతున్నాడు నీ వర్క్ కూడా నా మీద వేశాడు నువ్వు వస్తే నాకు కొంచెం బెటర్ నా గురించి ఆలోచించవే అని అంటుంది. దానికి మౌనిక వస్తాను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను అనేసి అంటుంది. ఇక సంజు మౌనిక దగ్గరికి వచ్చి ఏంటే ఫీల్ అవుతున్నావా అది నీ రేంజ్ ఇప్పుడు నీ బాలు అనే గనుక ఈ మాట వినంటే నేను ఎంత హ్యాపీగా ఫీలయ్యాను చూసావా నీ రేంజ్ కు తగ్గట్లు నువ్వు ఉండాలి అనేసి మౌనికకు కౌంటర్ ఇస్తాడు. బాలు అన్నీ పనులు నువ్వు ఒక్కదానివే చెయ్యకు అని క్లాస్ పీకుతాడు.. భార్యకు ప్రేమగా భోజనం పెడతాడు బాలు. ఉదయం పనిమనిషిని ఎందుకు మాన్పించావు అని అరుస్తాడు. శృతి రవీలు కారు కొనాలని మనోజ్ షో రూమ్ కు వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ పనిచేస్తున్న షో రూమ్ అనగానే ప్రభావతికి ఫ్యూజులు అవుట్ అవుతాయి. మనోజ్ కు ఈ విషయం చెప్పాలని ప్రభావతి శత విధాల ప్రయత్నిస్తుంది. కానీ మనోజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. వీడు కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడే అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. మా అమ్మ మీద అలిగాను ఫోన్ లిఫ్ట్ చెయ్యను అని అంటాడు. ఇక మౌనిక జాబ్ కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య వచ్చి ఏమైందమ్మా మీ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారా అని అడుగుతుంది. లేదు అత్తయ్య జాబ్ కి రమ్మని అంటున్నారు. పెళ్లికి ముందైతే ఆయన చేసుకోవచ్చని అన్నాడు అత్తయ్య ఇప్పుడైతే మరియు ఒప్పుకుంటాడో లేదో అనగానే ఇక సువర్ణ కూడా వాడు ఇప్పుడు ఒప్పుకుంటాడు అంటావా అనేసి అంటుంది అప్పుడే. సంజు అక్కడికి వచ్చి ఏంటి మీరిద్దరి ముచ్చట్లు పెట్టుకున్నారు అనగానే సువర్ణ జాబ్ కి వెళ్లాలనుకుంటుంది రా అనగానే అవసరం లేదు. ఇంట్లో పనిమనిషి మాన్పిచ్చి అన్ని పనులు చేయించు నేను వచ్చిన వాళ్ళు ఎలాగో పనిమనిషి అనుకున్నారని అంటాడు. నేను జాబ్ చేస్తానంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరు చేయొచ్చు అని అన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు అంటే. ఇప్పుడు నిన్ను ట్రాక్ చేయడానికి నేను ఏదో ఆ వాగేసాను. ఇప్పుడు అవసరం లేదు మొగుడు ఖాళీగా ఉంటే నువ్వు జాబ్ చేయడానికి వెళుతున్నావంటే ఆఫీసులో నీకు నచ్చిన వాడు ఎవడో ఉన్నాడా అని అనుమానపడతాడు.. నీకు నచ్చిన వాడెవడో ఉన్నాడు కదా అందుకే ఆఫీస్ కి వెళ్ళాలి అనుకుంటున్నావా అలాంటివేమి అవసరం లేదు నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని అంటాడు దానితో మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది..

రవి శృతి ఇద్దరూ కారు కొనడానికి షో రూమ్ కి వెళ్తారు. షోరూం కి వెళ్లి అక్కడ మనోజ్ అనే వ్యక్తిని పిలవమని అడుగుతారు అయితే అక్కడ మనోజ్ అనే వ్యక్తి ఎవరూ లేరని మేనేజర్ చెప్పడంతో షాక్ అవుతారు. రవి శృతిలు రెండు నిమిషాలు బయటకు వెళ్లే సస్తామని అంటారు ఇక మనోజ్ పార్క్ లో తన ఫ్రెండుతో చిప్స్ తింటూ ముచ్చట్లు పెట్టుకుంటాడు. మనోజ్ ఫ్రెండు మనోజ్ పై సెంటర్లు వేస్తాడు. ఇద్దరూ కలిసి పార్కులో ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా ఉంటారు. రవి, శృతిలు మనోజ్ కు ఫోన్ చేసాక ఒక క్లారిటీ తో వస్తాను అని అంటాడు. ఇక మనోజ్ కు ఫోన్ చేస్తాడు. మనోజ్ ఏదోలా మ్యానేజ్ చేశాడు. ఇక కారు కొనాలని ఫిక్స్ అయిపోతారు.. మనోజ్ చెప్పిన విషయానికి ఒకే అని వెళ్ళిపోతారు. మొత్తానికి మనోజ్ సేవ్ అవుతాడు.


ఇక బాలు మౌనిక పనిచేస్తున్న ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ తన చెల్లి లేదని తెలుసుకొని బాధపడతాడు. మౌనిక వచ్చి జాయిన్ అవుతానని చెప్పింది కానీ ఇప్పటివరకు రాలేదని ఆ అమ్మాయి చెప్పగానే బాలు అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఇక మౌనిక ఇంట్లో వంట చేసి వడ్డిస్తుంది కానీ సంజయ్ మాత్రం సెటైర్లు వేస్తాడు. ఇక బాలు మౌనికకు ఫోన్ చేస్తాడు. మౌనికకు ఫోన్ రావడం చూసి సంజు చెయ్ ఎవరో ఫోన్ చేశారు అని అంటాడు. మౌనికకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో బాలు టెన్షన్ పడతాడు. సంజు కస్టమర్ కేర్ అయితే అన్ని సార్లు చేయడు కదా వెళ్లి ఆ ఫోన్ ఎవరో ఎత్తు అనేసి అంటాడు. ఇక సంజు లోపలికి వెళ్లి పని చూసుకో పో అని పంపివ్వగానే మౌనిక లోపలికి వచ్చి ఫోన్ మాట్లాడుతుంది.. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్తుంది అయితే సంజు బాలు మిస్డ్ కాల్ కూడా ఉన్నాయి కదా మరి నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అనగానే మీరు చెప్పినట్టు వినమన్నారు కదా అందుకే నేను బాలు అనే పేరు కూడా మీ ముందు తీయడానికి ఇష్టపడట్లేదండి అని అంటుంది. ఇక మౌనిక బాలుని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇది అన్నయ్య నా పరిస్థితి ఇంట్లో అనేసి మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×