Chandra Sekhar Yeleti: తెలుగులో రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి (Chandra Sekhar Yeleti). అలాంటి దర్శకుడికి పితృవియోగం జరిగింది. తాజాగా చంద్రశేఖర్ తండ్రి ఏలేటి సుబ్బారావు (Yeleti Subbarao) కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏలైటి సుబ్బారావు తూర్పు గోదావరి జిల్లా తుని మండలం రేఖవానిపాలెంలో నివాసముంటున్నారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రాజమౌళి భార్య ఏలేటి సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రశేఖర్ ఏలేటికి డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా మంచి పేరుంది. అలాంటి దర్శకుడు తండ్రిని కోల్పోవడం బాధాకరమంటూ తన ఫ్యాన్స్ సైతం ఏలేటి సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. చంద్రశేఖర్ ఏలేటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఏలేటి సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేయడానికి బయల్దేరారు.
చాలా భిన్నమైన సినిమాలు
‘ఐతే’ అనే సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు చంద్రశేఖర్ ఏలేటి. అలా మొదటి సినిమాతోనే ఆయన నేషనల్ అవార్డ్, నంది అవార్డ్.. ఇలాంటి రెండు ప్రెస్టీజియస్ అవార్డులను అందుకొని ఒక్కసారిగా అందరూ తనవైపు తిరిగి చూసేలా చేశారు. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్ దక్కించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అలాంటిది చంద్రశేఖర్ ఏలేటి చేసి చూపించారు. దీంతో నిర్మాతలు తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఆయన సినిమాలు.. ఇతర దర్శకుల సినిమాలకంటే చాలా భిన్నంగా ఉంటాయి.
తొందరపడని దర్శకుడు
వెంటవెంటనే సినిమాలు చేసేయాలని, ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆలోచనలో చంద్రశేఖర్ ఏలేటి ఉండరు. అందుకే ఆయన తెరకెక్కించే సినిమాలకు కనీసం రెండు లేదా మూడు సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అలా ‘ఐతే’ తర్వాత రెండు సంవత్సరాలు టైమ్ తీసుకొని ‘అనుకోకుండా ఒక రోజు’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఏలేటి. ఆ మూవీ కూడా నంది అవార్డులను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో చంద్రశేఖర్ ఏలేటి డిమాండ్ మరింత పెరిగిపోయింది. దాంతో పాటు ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది.
Also Read: ఎన్టీఆర్.. నా భుజం వరకే ఉంటాడు.. నేను నటించను అని చెప్పాను.. ఇది నిజమేనా.. ?
చివరి డిశాస్టర్
చివరిగా నితిన్ హీరోగా ‘చెక్’ అనే సినిమాను తెరకెక్కించారు చంద్రశేఖర్ ఏలేటి. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. కానీ ఆ అంచనాలు అందుకోలేక డిశాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ 2021లో విడుదలయ్యింది. కొందరికి మాత్రమే ఈ సినిమా పరవాలేదనిపించింది. అప్పటినుండి ఇప్పటివరకు మరొక సినిమాను అనౌన్స్ చేయలేదు చంద్రశేఖర్ ఏలేటి. అలా మూడేళ్లు ఆయన చిత్రాలు తెరపై చూడకుండానే గడిచిపోయింది. ఇంతలోనే తన తండ్రి మరణించడంతో ఏలేటికి ఇది కోలుకోలేని దెబ్బ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ బాధ నుండి ఆయన బయటికి వచ్చి ప్రేక్షకులకు మంచి సినిమాను అందించాలని కోరుకుంటున్నారు.