BigTV English

Gundeninda GudiGantalu Today episode: మౌనిక కోసం బాలు ఆరాటం.. మనోజ్ సేఫ్ అయ్యినట్లే..?

Gundeninda GudiGantalu Today episode: మౌనిక కోసం బాలు ఆరాటం.. మనోజ్ సేఫ్ అయ్యినట్లే..?

Gundeninda GudiGantalu Today episode February 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ పనిచేస్తున్న షో రూమ్ అనగానే ప్రభావతికి ఫ్యూజులు అవుట్ అవుతాయి. మనోజ్ కు ఈ విషయం చెప్పాలని ప్రభావతి శత విధాల ప్రయత్నిస్తుంది. కానీ మనోజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. వీడు కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడే అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. మా అమ్మ మీద అలిగాను ఫోన్ లిఫ్ట్ చెయ్యను అని అంటాడు. ఇక మౌనిక జాబ్ కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య వచ్చి ఏమైందమ్మా మీ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారా అని అడుగుతుంది. లేదు అత్తయ్య జాబ్ కి రమ్మని అంటున్నారు. పెళ్లికి ముందైతే ఆయన చేసుకోవచ్చని అన్నాడు అత్తయ్య ఇప్పుడైతే మరియు ఒప్పుకుంటాడో లేదో అనగానే ఇక సువర్ణ కూడా వాడు ఇప్పుడు ఒప్పుకుంటాడు అంటావా అనేసి అంటుంది అప్పుడే. సంజు అక్కడికి వచ్చి ఏంటి మీరిద్దరి ముచ్చట్లు పెట్టుకున్నారు అనగానే సువర్ణ జాబ్ కి వెళ్లాలనుకుంటుంది రా అనగానే  అవసరం లేదు. ఇంట్లో పనిమనిషి మాన్పిచ్చి అన్ని పనులు చేయించు నేను వచ్చిన వాళ్ళు ఎలాగో పనిమనిషి అనుకున్నారని అంటాడు. నేను జాబ్ చేస్తానంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరు చేయొచ్చు అని అన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు అంటే. ఇప్పుడు నిన్ను ట్రాప్ చేయడానికి నేను ఏదో అలా వాగేసాను. ఇప్పుడు అవసరం లేదు మొగుడు ఖాళీగా ఉంటే నువ్వు జాబ్ చేయడానికి వెళుతున్నావంటే ఆఫీసులో నీకు నచ్చిన వాడు ఎవడో ఉన్నాడా అని అనుమానపడతాడు.. నీకు నచ్చిన వాడెవడో ఉన్నాడు కదా అందుకే ఆఫీస్ కి వెళ్ళాలి అనుకుంటున్నావా అలాంటివేమి అవసరం లేదు నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని అంటాడు దానితో మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది.. రవి, శృతిని ఎలాగోలా మ్యానేజ్ చేస్తాడు మనోజ్.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు మౌనిక పనిచేస్తున్న ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ తన చెల్లి లేదని తెలుసుకొని బాధపడతాడు. మౌనిక వచ్చి జాయిన్ అవుతానని చెప్పింది. కానీ ఇప్పటివరకు రాలేదని ఆ అమ్మాయి చెప్పగానే బాలు అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఇక మౌనిక ఇంట్లో వంట చేసి వడ్డిస్తుంది. కానీ సంజయ్ మాత్రం సెటైర్లు వేస్తాడు. ఇక బాలు మౌనికకు ఫోన్ చేస్తాడు. మౌనికకు ఫోన్ రావడం చూసి సంజు చెయ్ ఎవరో ఫోన్ చేశారు అని అంటాడు. మౌనికకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో బాలు టెన్షన్ పడతాడు. సంజు లోపలికి వెళ్లి పని చూసుకో పో అని పంపివ్వగానే మౌనిక లోపలికి వచ్చి ఫోన్ మాట్లాడుతుంది.. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్తుంది అయితే సంజు బాలు మిస్డ్ కాల్ కూడా ఉన్నాయి కదా మరి నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అనగానే మీరు చెప్పినట్టు వినమన్నారు కదా అందుకే నేను బాలు అనే పేరు కూడా మీ ముందు తీయడానికి ఇష్టపడట్లేదండి అని అంటుంది మౌనిక.. ఇక సంజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలు పేరు తీస్తే మాత్రం నీకు ఏం జరుగుతుందో ఊహించలేవు అనేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఇక మౌనిక తన అన్నని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నువ్వు వద్దని ఎంత చెప్పినా కూడా నేనే కావాలని నిన్ను కొట్టి మరే పెళ్లి చేసుకున్నాను ఈ రాక్షసుడు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు ఇది అన్నయ్య పరిస్థితి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది..

మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఏదో జరిగింది ఆ వెధవ మౌనికని ఏదో చేశాడని బాలు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంటికి వచ్చిన బాలు మీనా తో అదే విషయాన్ని చెప్తాడు. మీనా మౌనిక ఏమి చిన్న పిల్ల కాదండి ఏదైనా కష్టం వస్తే మనకు చెప్పకుండా అసలు ఉండదు మీరు అస్సలు భయపడకండి ఈ విషయం గురించి మీరు మర్చిపోండి అనేసి సలహా ఇస్తుంది. కానీ బాలు మాత్రం అలా ఎలా మర్చిపోతాను మీనా? మౌనికని నా చేతుల్లో పెంచను నా భుజాల మీద ఎత్తుకొని తనని ఇంత పెద్దదాన్ని చేశాను.. ఇప్పుడు అంత కష్టపడి చదివి తెచ్చుకున్న జాబ్ ని వదిలేసిందంటే నాకు ఏదో అనుమానంగా ఉంది నేను ఎలాగైనా మౌనికని చూడాలి.. ఒకసారి మౌనిక దగ్గరికి వెళ్లి దూరం నుంచి అయినా చూసేసి వస్తాను అని మీనాతో అంటాడు.. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే మీ చెల్లిని చూడడం ఏమో కానీ ఆ రాక్షసుడు మిమ్మల్ని చూసి ఎంత గొడవ చేస్తారో అది ఆలోచించడం లేదు అని మీనా అరుస్తుంది.


నేను చెప్పు మీనా నా మనసు అయితే మౌనికని చూడకుండా ఉండలేక పోతుంది దూరం నుంచి అయినా నా చెల్లిని చూసి సంతోష్ పడతాను నేను వెళ్లి వస్తాను నాన్న అడిగితే ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పు అనేసి బాలు ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. ఇక మీనా బాలు వెనుకాలే వద్దు అనేసి అరుస్తూ వస్తుంది.. ఇంట్లోని వాళ్ళందరూ బాలు ఏదో గొడవకి వెళ్తున్నారని కంగారుపడుతూ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది మీనా అని సత్యము అడుగుతాడు. చూడండి మామయ్య మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మౌనికను చూడాలని చెప్పేసి బయలుదేరుతున్నారు ఈయన మీరైనా చెప్పండి అక్కడికి వెళ్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అనేసి అంటుంది మీనా. ఆ మాట వినగానే ప్రభావతి బాలు పై కోపంతో రగిలిపోతుంది. కోటీశ్వరుల ఇంటికి కోడలికి పంపిన నా కూతురి కాపురంలో నిప్పులు పోయాలని చూస్తావా నువ్వు వెళ్ళద్దని పెళ్లి తర్వాత చెప్పారు కదా మళ్లీ నువ్వు ఇప్పుడు వెళ్లి తన కాపురాన్ని కూల్చాలని చూస్తున్నావా అనేసి ప్రభావతి అంటుంది. ఈ రెండు అయినా చెప్పండి నా చెల్లిని చూడకుండా నేను ఉండలేను అని బాలు బయలుదేరుతాడు.

కానీ సత్యం మాత్రం బాలుని వెళ్లడానికి వీలు లేదని చెప్తాడు. మీకు ఒక్కరికైనా మౌనికను చూడాలని ఉందా పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు ఆ తర్వాత ఎలా ఉంది ఇంతకీ ఆ మనిషి ఎలా చూసుకుంటున్నాడు ఇలాంటివన్నీ అడిగే పనే లేదు కదా అనేసి అందరినీ పేరుపేరునా తిట్టిపోస్తాడు. బాలు బాధపడుతున్న సమయంలోనే మౌనిక కార్లో బయట ఎంట్రీ ఇస్తుంది. ఇంట్లోకి రాగానే మౌనికను చూసి అందరూ సంతోషపడతారు. మౌనికపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు ఆ ఇంట్లో నువ్వు బాగానే ఉన్నావు కదా నేను చూస్తుంటే ఏదో లోటుగా అనిపిస్తుంది నిన్ను ఆ దుర్మార్గుడు బాగానే చూసుకుంటున్నాడా అని బాలు అడుగుతాడు. ఆ తర్వాత వెంటనే శృతి ఆ మూర్ఖుడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అనేసి అడుగుతుంది. ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడతారా రాకరాక మన ఇంటికి వచ్చింది అనేసి మీనా మౌనిక కోసం టిఫిన్ చేసి తీసుకొస్తుంది. తన పుట్టింటి వాళ్లు ప్రేమను చూసి మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో మౌనిక పుట్టింటికి వెళ్ళినందుకు సంజు గొడవ చేస్తాడు. ఆ తర్వాత బాలు ఎలా రియాక్ట్ అవుతాడు చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×