Thandel Collections : ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సినిమా తండేల్.. ఫిబ్రవరి 7న థియేటర్ లోకి వచ్చిన ఏ సినిమా కేవలం వారం రోజుల్లోనే 90 కోట్లకు పైగా వసూలు చేసింది. నాగచైతన్య కెరియర్ లో గతంలో ఎన్నడు లేని విధంగా కలెక్షన్ల మోత మోగిపోతుంది. నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి రెండోసారి జంటగా నటించిన చిత్రమిది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పించగా.. బన్నీవాసు నిర్మించారు. థియేటర్లలో రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తుంది..లవ్, యాక్షన్, దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం యువతతో పాటు నార్మల్ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది.. మరి ఎనిమిది రోజులకు ఎన్ని కోట్లు రాబట్టిందో ఓ లుక్ వేద్దాం పదండీ..
Also Read : మరోసారి నోటి దూలతో అడ్డంగా బుక్కయిన రష్మిక.. కొంచెం కూడా లేదా..?
డైరెక్టర్ చందూ మొండేటి, నాగ చైతన్య కాంబో రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి.. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువగానే జరిగింది. తండేల్ సినిమా వరల్డ్ వైడ్ రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డే నుంచి ఐదు రోజుల వరకు 70 కోట్లకు పైగానే వసూల్ చేసింది. ఇక ఆరు రోజులకు గాను 80. 60 కోట్లకు పైగా వసూల్ చేసిందని మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఎనిమిదిరోజులకు 90 కోట్లకు పైగా వసూల్ చేసిందని తెలుస్తుంది.
తండేల్ మూవీ ఎనిమిది రోజుల కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. ఈ సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కాసుల వర్షం కురుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఇలా తండేల్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసి, హీరో నాగ చైతన్య కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలించింది.. అదే జోరు రెండో రోజు కూడా కొనసాగింది. రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ. 22 కోట్లు. ఇక నాలుగవ రోజు రూ. 10 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఐదో రోజు కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ 5 డే రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే 80 కోట్లకు పైగా వసూల్ చేసిందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కేవలం 8 రోజుల్లో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎనిమిది రోజులకు 90.12 కోట్లు వసూల్ చేసింది.. ఇదే జోరు కొనసాగితే మాత్రం 200 కోట్లు త్వరలోనే రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో నాగ చైతన్య సంతోషానికి అవధులు లేవు. ప్రస్తుతం ఆయన ఈ భారీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు..