Gundeninda GudiGantalu Today episode February 22th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఎలాగైనా భార్య మీనాను వేధించిన తల్లి ప్రభావతి, అవమానించిన తోటి కోడలు శృతికి బుద్ధి చెప్పాలని బాలు ప్రయత్నిస్తాడు. ఇందుకోసమే పూలకొట్టు అనే వ్యూహంతో అందరిపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు బాలు.. మొత్తం ప్లాన్ ప్రకారమే మీనా కోసం ఇంటి ముందు పూల కొట్టు ఏర్పాటు చేస్తాడు బాలు. పూల కొట్టుకు తల్లి ప్రభావతి పేరునే పెట్టి ఆశ్చర్యపరుస్తాడు. పైగా చిన్న కోడలు శృతితో రెబ్బన్ కట్ చేయించి.. అందుకు డబ్బులు కూడా ఇచ్చి అవమానిస్తాడు. అసలు పూలకొట్టు పెట్టడానికి కారణమే శృతికి బుద్ధి చెప్పడానికి అని తన మనసులోని మాటను కూడా బయటపెడ్తాడు. దాంతో ఇంట్లో ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది.. శృతి బాలు పై కోపంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతికి పూల కొట్టు పెట్టడం అస్సలు ఇష్టం లేదు. ఇక అందరు పూల గురించి అడగడంతో ఇంకాస్త కోపంగా మారుతుంది. ఈ మీనా, బాలు కలిసి నా పరువు తీస్తున్నారని భాద పడుతుంది. ఇక అందరు సంతోషంగా ఉంటారు. కానీ శృతి అక్కడ ఉండకుండా లోపలి వస్తుంది. ఇక రవి వెతుక్కుంటూ లోపలకి వస్తాడు. ఏమైంది అక్కడ అందరు సంతోషం గా ఉంటే ఇక్కడ ఒక్కదానివే ఏం చేస్తున్నావ్ అని రవి అడుగుతాడు. బాలు అన్నయ్య మనకు అందరికి టిఫిన్ తీసుకొచ్చాడు. రా తిందాం అని అంటాడు. దానికి శృతి సీరియస్ అవుతుంది. మీ బాలు అన్నయ్య కావాలనే ఇదంతా చేస్తున్నాడు. నన్ను తక్కువ చెయ్యాలానే ఇంకో 500 పెట్టి ఇచ్చాడని అంటుంది. ఏది ఏమైనా నీ వల్లే ఇదంతా జరిగింది. మా వదినకు ఇంట్లో పని తగ్గుతుంది. ఆమె డబ్బులు సంపాదిస్తే మా అమ్మ బాధ తగ్గుతుందని బాలు ఆలోచిస్తాడు. కానీ శృతి మాత్రం బాలు పై ఎలా రివేంజ్ తీర్చుకోవాలా అని ఆలోచిస్తుంది. నన్ను అందరి ముందు ఇంతలా అవమానిస్తాడా? అస్సలు వదిలిపెట్టను రివేంజ్ తీర్చుకుంటాను అని అంటుంది.
ఇక ఇంటి ముందే పూలకొట్టు ఏర్పాటు చేయడంతో మీనాకు ఉపాధి కల్పించడమే కాకుండా.. తన భార్యను అవమానిస్తున్న కుటుంబ సభ్యులకు చుకలంటిస్తాడు. తన మనస్సులోని బాధను మీనా ఎలాగూ చెప్పుకోకపోవడంతో బాలునే పూలకొట్టు వ్యూహంతో తల్లి ప్రభావతి, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు మరదళ్లను ఏకిపారేస్తాడు.. ఇక మీనా కూడా సంపాదిస్తుంది అని సంతోష పడతాడు. బాలు ఇచ్చిన షాకింగ్ సర్ ప్రైజ్ కు కుటుంబ సభ్యులంతా నివ్వెర పోతారు. తండ్రి సత్యం మాత్రం తన కొడుకు బాలును, మీనాను అభినందించి శుభాకాంక్షలు తెలియజేస్తాడు. ఇక తల్లి ప్రభావతి మాత్రం ఒంటినిండా మంటతో రగిలిపోతుంది..
మీనా మాత్రం ఫుల్ ఖుషి అవుతుంది. బాలు పై ప్రేమను కురిపిస్తుంది. నేను పనులు చేసుకుంటూ ఇంటికే అంకితం అయిపోతాను అని అనుకున్నాను. కానీ మీరు నాకు విలువ ఇచ్చారు. నన్ను చులకన గా చూసే వారికి బుద్ధి చెప్పేలా చేశారు. మీకు నేను ఒక సర్ ప్రైజ్ ఇవ్వాలని మీనా అని ఒక రోజ్ ను ఇస్తుంది. దానికి బాలు ఫిదా అవుతాడు. ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ టచ్ మొదలవుతుంది.. ఇన్ని ఘర్షణల మధ్య బాలుకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెడుతారోననేది నెక్ట్స్ ఎపిసోడ్ పై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. పూలకొట్టు ప్రారంభం తర్వాత బాలు అందరికీ తానే స్వయంగా టిఫిన్స్ తెప్పిస్తాడు. పూలకొట్టు ఓపెన్ చేసినందుకు చిన్న పార్టీని సెలబ్రేట్ చేస్తాడు. అందుకు కుటుంబ సభ్యులందరినీ పిలుస్తాడు.. తమను అవమానించాడని రగిలిపోతున్న తల్లి ప్రభావతి, చిన్నమరదలు శృతి బాలుపై మళ్లీ ఎలా రివేంజ్ తీర్చుకుంటారో చూడాలి.. మీనాకు పూల కొట్టు తో కష్టాలు తీరాయా? లేదా కొత్త కష్టాలు వస్తాయా అనేది చూడాలి… మీనా తో బాలు పూల కొట్టు పెట్టిస్తాడు. నేనా పూల కొట్టు మూడు పూవులు ఆరు కాయలు లాగా సాగుతుందని తెలుస్తుంది. మీనా ఎదుగుదలను చూసి సత్యం పొంగిపోతుంటాడు. అటు ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది.. ఇక ఇంట్లో పనులు కూడా మీనా తగ్గించడంతో ప్రభావతికి చుక్కెదురవుతుంది. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి..