Aus vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా…. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాల్టి మ్యాచ్ లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య.. బిగ్ ఫైట్ ఉండనుంది. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో… ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England ) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకే మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు… అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
లాహోర్ లోని గడాఫీ స్టేడియం లో ( Gaddafi Stadium in Lahore ) టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొదట బ్యాటింగ్ తీసుకున్న జట్టు… కచ్చితంగా విజయం సాధిస్తుందట. లాహోర్ స్టేడియం లెక్కలు ఇవే చెబుతున్నాయి. ఇక భారత కాలమానం ప్రకారం… ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ టాస్ ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
లైవ్ స్ట్రీమింగ్ అలాగే టైమింగ్స్
ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో మ్యాచ్… స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ ( JIO Hotstar), స్పోర్ట్స్ 18 లో చూడవచ్చు. అయితే… జియో హాట్ స్టార్ లో మ్యాచ్ లు తిలకించాలంటే కచ్చితంగా రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు వస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా…. జరిగే మ్యాచ్ లు అన్ని ఇలాగే… ఇదే సమయానికి ప్రసారం కానున్నాయి.
వన్డే రికార్డులు
ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే రికార్డులు పరిశీలిస్తే.. కంగారులదే పైచేయిగా ఉంది. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటి వరకు 160 వన్డే మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 90 ఆస్ట్రేలియా గెలిచింది. మరో 65 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ టీం గెలిచింది. రిజల్ట్ రాకుండా ఉన్నవి 3 మ్యాచ్ లు. ఇక ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 2 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. అంటే ఈ లెక్క ప్రకారం… ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా పైచేయి సాధించనుందని అంటున్నారు విశ్లేషకులు.
Also Read: Pakistan – Champions Trophy: టీమిండియా దెబ్బ అదుర్స్.. ఇక ఇంటికే పాక్.. లెక్కలు ఇవే !
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్ (WK), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (C), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(w), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్