Gundeninda GudiGantalu Today episode January 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. సురేంద్ర శోభా మాట్లాడుకుంటుంటారు. సత్యం ను ఎలాగైనా దెబ్బ కొట్టాలి సత్యం కు ఆ సంతోషాన్ని దూరం చేయాలని శోభ అంటుంది. తన కొడుకులు చూసి మురిసిపోతున్నాడు కదా తన కొడుకుల నుంచి ఆ సంతోషాన్ని దూరం చేయాలని అందుకు మనము ఆ ఇంటికి వెళ్లాల్సిందే అని చెప్తుంది. వాళ్ళింటికి శృతి రవిలను పంపించేస్తే ఇక వాళ్లల్లో వాళ్ళు కొట్టుకొని చస్తారు అక్కడితో ఫ్యామిలీ ముక్కలు అయిపోతుంది అని శోభ అంటుంది. నేను మీ భార్యను కాబట్టి మీ పగని పంచుకోవాలి అందుకే ఇలా చెప్తున్నాను మీరు ఆ ఇంటికి వాళ్ళని పంపించడానికి రావాల్సిందే అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక దానికి సురేంద్ర సరే అంటాడు. ఇద్దరు కలిసి సత్యం ఫ్యామిలీని ఎలాగైనా నాశనం చేయాలని అనుకుంటారు. ఇక బాలు, మీనా గుడికి వస్తారు. మౌనిక అన్న వదినలను చూసి సంతోషంగా వారి దగ్గరికి వెళ్తుంది. సంజయ్ గురించి అసలు నిజాలను దాచిపెట్టి వాళ్లతో సంతోషంగా మాట్లాడుతుంది. ఇక రవి శృతి లను ప్రభావతి ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. శోభా కూతుర్ని అల్లుడ్ని మీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతామని అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే ప్రభావతి పూజ చేస్తుంది. నా కుటుంబం మూడు పువ్వులు ఆరు కాయలాగా ఉండాలనుకుంటే మీరు తప్పుగా అర్థం చేసుకొని పూలమ్ముకునేదాన్ని నా కోడలుగా తీసుకొచ్చారు దేవుడా ఇప్పుడు నా చిన్న కోడలు ఎంతో కోటీశ్వరుడు ఆమె నా ఇంట్లో అడుగుపెట్టబోతుంది నా ఇల్లును కూడా మార్చే అనేసి దేవుని ప్రార్థిస్తుంది. ఇక మీనా వంట చేస్తుంటే ప్రభావతి హడావిడి చేస్తుంది. ఇంకా ఉడకలేదా వేడి వేడి వచ్చినప్పుడు ఎలా పెడతామనుకుంటున్నావు అని అంటుంది. అప్పుడే బాలు షర్ట్ ఎక్కడ అని పిలుస్తాడు. అయ్యో వీడింక వెళ్లలేదా వీడు వెళ్లకుండా ఉంటే ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది ఇంట్లోకి వెళ్ళను రానివ్వడు అని ప్రభావతి అనుకుంటుంది. ఆ షర్ట్ ఏది నువ్వు ఇవ్వు వాడిని తొందరగా పంపించు లేదంటే వాళ్ళని రానివ్వరు అని మీనా తో ప్రభావతి అంటుంది. బాలు వచ్చేలోగా క్యారేజ్ కట్టి సిద్ధం చేస్తుంది ప్రభావతి. అలాగే నాకు ఆకలేస్తుంది తింటానంటే బలవంతంగా కూర్చోబెట్టి బాలు పై ఎక్కడ లేని ప్రేమ వలకబోసి భోజనం వడ్డిస్తుంది.
తల్లి ప్రేమను చూసి కొత్తగా నా పైన ఇంత ప్రేమను చూపిస్తుంది ఏందా? నాకు ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటాడు బాలు. బాలు రెడీ అయి కిందికి వస్తాడు. తాను టిఫిన్ చేసి వెళ్తానంటే.. అవసరం లేదు.. బయట టిఫిన్ చెయ్ అని క్యారేజ్ సర్దుతుంది. కానీ, తనకు బయట ఫుడ్ పడదని, తాను టిఫిన్ చేసిన తర్వాతనే వెళ్తానని బాలు అంటాడు. ఎన్నడు లేని విధంగా ప్రభావతి దగ్గరుండి ఉండి బాలుకు టిఫిన్ వడ్డిస్తుంది. దీంతో బాలు ఆశ్చర్యపోతాడు.. ఇది కలనా..నిజమా.. అని పక్కనే ఉన్న మనోజ్ ను గిచ్చుతాడు. కానీ, ఎనలేని విధంగా తనపై తన తల్లి ప్రేమ కురిపించడంతో అనుమానం వస్తుంది. చివరిసారి మౌనిక పెళ్లి విషయంలో కూడా తన తల్లి ఇలానే ప్రవర్తించిందని, ఈసారి కూడా ఏదో చేయబోతుందని డౌట్ బాలుకి వస్తుంది.. బాలు ప్రభావతి ఏదో తప్పు చేస్తుందని అనుకొని ఇంట్లోకి లోపలికి వెళ్లినట్లు మళ్లీ లోపలికి వస్తాడు. ఒక్కొక్కరికి బాయ్ చెప్తూ బయటికి వెళ్తాడు. చివరికి కడుపులో ఏదో తేడాగుందని మళ్లీ లోపలికి వచ్చి బాత్రూం కి వెళ్తాడు.
మనోజ్ తనకు ఆకలి అవుతుందని టిఫిన్ పెట్టమని అడుగుతాడు. ఓ అరగంట ఆగితే పోయేది ఏమీ కాదు. వాళ్లు వస్తున్నారు అంటూ నోరు జారుతుంది ప్రభావతి. ఎవరు వారని సత్యం .. ప్రభావతిని నిలదీస్తాడు. తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో రవి, శృతి ఇంటికి వస్తున్నారని, వారికోసం తాను వెయిట్ చేస్తున్నానని చెబుతోంది ప్రభావతి.. శృతి తన తల్లిదండ్రులతో అత్తగారింటికి చేరుకుంటుంది. కానీ, సురేంద్ర.. సత్యం ఇంట్లో కాలు పెట్టడానికి నిరాకరిస్తాడు. తాను ఇక్కడి వరకు రావడమే ఎక్కువ అని, తన మనసు చంపుకొని ఇంట్లోకి రానని అంటాడు. దీంతో శృతి, రవి, శోభ ముగ్గురు కలిసి ప్రభావతి ఇంటికి చేరుకుంటారు. ఈ సమయంలో ప్రభావతి కంగారుపడుతూ వెంటనే హారతి తీసుకురమ్మని రోహిణికి చెబుతుంది. మీనా హారతి తీస్తే తప్పేముంది మీనా తీస్తుంది అనేసి అంటుంది. జన్మదిన పెద్ద వదిన ఇద్దరు తీస్తారు లే అమ్మ అని రవి అంటాడు. ఇంట్లోకి కుడికాలు పెట్టి లోపలికి రా శృతి అని ప్రభావతి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..