Yuzvendra Chahal: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ విడాకుల రూమర్స్ కి పుల్ స్టాప్ పడడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జంట ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, చాహల్ తన భాగస్వామి ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ రూమర్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Also Read: Shikhar Dhawan: మళ్లీ పెళ్లి చేసుకోవాలనుంది.. శిఖర్ ధావన్ వీడియో పోస్ట్ వైరల్!
దీంతో విడాకుల వార్తలపై ఇటీవల ధనశ్రీ స్పందించిన విషయం తెలిసిందే. ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నన్ను తీవ్ర మానసిక ఆవేదనకు గురిచేసిందని ధనశ్రీ వాపోయారు. తాను, తన కుటుంబం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని.. ఏళ్ల తరబడి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చారు. అలాంటి తనపై ద్వేషం కలిగేలా, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు తన మౌనానికి అర్థం బలహీనత కాదని పేర్కొన్నారు. ఎప్పటికైనా నిజం గెలుస్తుందని.. దానిని సమర్ధించుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. ఇక చాహల్ కూడా ఈ రూమర్స్ పై తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా నోరు విప్పాడు. సోషల్ మీడియాలో తమపై వస్తున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు అని పోస్ట్ చేశాడు. ” మీ మద్దతు లేకుంటే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. క్లిష్ట సమయాలలో మీరు నాకు పట్ల చూపించిన అభిమానం ఎప్పటికీ మరువలేనిది. మీ ప్రేమకు ధన్యవాదాలు.
దేశం కోసం, జట్టు కోసం, భారత అభిమానుల కోసం ఇంకా ఆడతాను. ఈ ప్రయాణం ఓవర్ కి ఎంతో దూరంలో ఉంది. అభిమానుల కోసం ఇంకా ఎన్నో అద్భుతమైన ఓవర్స్ మిగిలే ఉన్నాయి. ఓ కుమారుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా, ఓ క్రీడాకారుడిగా ఎంతో గర్వపడుతున్నాను. ఇటీవల నా వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కావచ్చు.. కాకపోవచ్చు. ముఖ్యంగా నా {Yuzvendra Chahal} వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై అభిమానుల ఆసక్తిని నేను అర్థం చేసుకుంటాను.
Also Read: Vinod Kambli Wife: మా పిల్లల చదువులకోసం సచిన్ డబ్బులు పంపాడు.. వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా
ఇలాంటి ఊహగానాల్లో మునిగిపోకుండా ఉండాలని మీ అందరికీ విన్నవిస్తున్నాను. ఇలాంటి రూమర్స్ నాకు, నా కుటుంబానికి ఎంతో బాధను కలిగిస్తాయి. ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరుకోవాలని నా కుటుంబం నాకు నేర్పించింది. అలాంటి విలువలకే ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. నాపై సానుభూతి కాకుండా ప్రేమ, మద్దతును చూపాలని ఎప్పుడు కోరుకుంటాను. మా కుటుంబ విషయాల్లో కలగజేసుకోవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాను” అని చాహల్ వివరించాడు. దీంతో ఈ జంట విడాకుల రూమర్స్ మరోసారి వైరల్ గా మారాయి.