Gundeninda GudiGantalu Today episode January 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి ప్లాన్ వర్కౌట్ అయ్యింది. రవి, శృతిలకు చూసిన ప్రభావతి కాళ్లు చేతులు ఆడవు. తన కొడుకు ఆస్తి ఉన్న కోడలు ఇంటికి రావడంతో ఆనందంలో మునిగిపోతుంది. తన అదృష్టదేవత ఇంట్లో అడుగుపెట్టబోతుందని భావిస్తుంది. కానీ, మనోజ్ అసూయపడుతాడు. రవి ఇంట్లోకి వస్తే.. తనకు రెస్పెక్ట్ ఉండదని భావిస్తాడు. రవి, శ్రుతిలు ఇంటికి రావడం సత్యం కూడా నచ్చదు. దీంతో సైలెంట్ గా ఉండిపోతాడు. పెళ్లయిన తర్వాత తొలిసారి రవి,శ్రుతిలు ఇంట్లో కాలు పెడుతున్నారు. కాబట్టి.. హారతి ఇవ్వమని రోహిణిని పిలుస్తోంది. కానీ, అందులోనే మీనా హారతి తీసుకొని వస్తుంది. కానీ, ఆ హారతి పళ్లేన్నా రోహిణి ఇవ్వమని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. ఇక రోహిణి హారతి తీసుకురావడానికి వెళ్తే మీనా హారతి తీసుకొని వస్తుంది. హారతి రోహిణి ఇవ్వాలని అనుకుంటుంది. కానీ మీనా హారతి తీసుకోవడం చూసి ప్రభావతి రోహిణికివ్వు రోహిణి ఇస్తుంది అని అంటుంది. దానికి శృతి మీనా ఇస్తే ఏమైనా తప్పు జరుగుతుందా ఆంటీ అని అడుగుతుంది.. అదేం లేదమ్మా అని అనగానే మీనాని ఇవ్వాలి అని శృతి అంటుంది ఇక రవి రోహిణి వదిన మీనా వదిన ఇద్దరు కలిసి ఇవ్వండి అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవి, శృతిలు కొత్త జంటలకు హారతి ఇచ్చిన తర్వాత ప్రభావతి కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని ప్రభావతి శృతికి చెబుతుంది. కుడికాలు ఏంటి.. ఎడమకాలి ఏంటి.. రెండు కాళ్లు నావే కదా.. అంటూ ప్రభావతికి తింగరి సమాధానం ఇస్తుంది శృతి. మరోవైపు బాలు తన రూమ్ నుండి అరుస్తాడు. దీంతో మీనా వెంటనే వెళ్లి బాలు రూమ్ లాక్ ఓపెన్ చేస్తుంది.. బాలు వస్తే ఎంత పెద్ద గొడవ చేస్తాడు అని ఇటు సత్యం అటు ప్రభావతి టెన్షన్ పడుతుంటారు. నన్ను రూమ్లో పెట్టి లాక్ ఎవరు చేశారు? అయినా ఇంట్లో హడావిడి ఏంటి? ఎవరు వచ్చారు? అని మీనాను ప్రశ్నిస్తాడు బాలు. రవి, శృతి ఇంటికి వచ్చారని చెప్పగానే బాలు ఆవేశం కట్టలు పెంచుకుంటుంది. ఎవర్రా ఇంటికి రమ్మని చెప్పింది. ఇంట్లో ఎలా కాలు పెట్టావు ? అంటూ రవిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. దీంతో శృతి అడ్డుపడుతుంది. బాలుకి శృతి వార్నింగ్ కూడా ఇచ్చేస్తుంది.. ఇక సత్యం ప్రభావతి ఇద్దరూ ఆపుతారు. దాంతో ఇద్దరు సైలెంట్ అయిపోతారు.. శృతిని దీపం వెలిగించమని ప్రభావతి అంటుంది. ఇంట్లో ఎంత వెలుగు ఉండగా.. లైట్లు ఉండగా.. దీపం ఎందుకు పెట్టాలి అంటుంది శ్రుతి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత మీనా దీపం ఎందుకు పెట్టాలో అసలు విషయం చెబుతుంది. ఇలా మొత్తానికి ప్రభావతి కల నెరవేరుతుంది
శృతి ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రభావతి తన గొప్పలు చెప్పుకుంటుంది మీ ఇంట్లో మీరు ఇంట్లోకి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని అనగానే శృతి మీరేం కష్టపడ్డారు ఆంటీ అంతా మీనా వల్లే కదా జరిగింది అని ప్రభావతి గాలి తుస్సున తీసేస్తుంది.. మీనా లేకపోతే నేను మీ ఇంట్లో అడుగు పెట్టే దాన్ని కాదు. అంటూ ప్రభావతికి షాక్ ఇస్తుంది. మీనా ను తన ముందే పొగడడంతో ప్రభావతి కుళ్ళుకుంటుంది. ఇదేంటి వస్తూనే నా గుప్పెట్లో పెట్టుకోవాలని నేను అనుకుంటే మీ నాకు కనెక్ట్ అవుతుంది అని ప్రభావతి మనసులో అనుకుంటుంది. ఇక మీనా శృతి లు బాగా క్లోజ్ అయిపోతారు. బాలు ఏం చేయలేక వెళ్ళిపోతాడు. రాజేశ్వరి ఈ విషయాన్ని చెప్పి బాధపడతాడు.. ప్రభావతి బాలుని ఆపే ప్రయత్నం చేస్తుంది.. సత్యం చెప్పడంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు బాలు.. అవమానించిన పెద్దమనిషి ఎక్కడ మా నాన్న ఆరోగ్యాన్ని దెబ్బతీసిన పెద్దమనిషి ఎక్కడ మొహం చల్లగా బయట ఉండిపోయాడా లేదా ఎక్కడైనా రూముల్లో దాచి పెట్టారా అని అడుగుతాడు. మా డాడ్ బయటే ఉన్నాడు ఇంట్లోకి రానని చెప్పాడు అని అంటుంది శృతి. అలాగే సత్యం నేను వెళ్లి పిలిచాను కానీ ఇంట్లోకి రాలేదు అది ఆయన మర్యాదగా వదిలేస్తున్నాను అని అంటాడు. ఇక శోభా వింటూ ఉంటే భోజనం చేసి వెళ్లండి వదిన గారు అని ఉంటుంది ప్రభావతి. ఈవిడ భోజనం చేసి వెళ్తుంటే ఆయన ముష్టి వాడులాగా బయటే ఉంటాడా అని బాలు సెటైర్లు వేస్తాడు..
ఇక రవి శృతి పైకి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తగారి ఇంటి గురించి శృతి తన ఫ్రెండ్ కి చెప్తుంది. ఇక రోహిణి అక్కడికొచ్చి కింద అందరూ పూజ కోసం పిలుస్తున్నారు కిందకు రండి అని తీసుకొస్తుంది. కింద పూజ చేయడానికి మీనా అంత సిద్ధం చేసి పెట్టి ఉంటుంది.. కానీ శృతికి అగ్గి పెట్టి కూడా వెలిగించడం రాకపోవడంతో ప్రభావతి మీ నాన్న తిడుతుంది. మీనాని తిట్టొద్దు నాకు అగ్గిపెట్టి వెలిగించడం రాదు అని శృతి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..