Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం కొత్త కెప్టెన్ ను ఫైనల్ చేసింది పంజాబ్ కింగ్స్ యాజమాన్యం. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌కు తమ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను ( Shreyas Iyer ) నియమించింది పంజాబ్ కింగ్స్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 18 ప్రత్యేక ఎపిసోడ్ సందర్భంగా 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌కు తమ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను నియమించింది పంజాబ్.
Also Read: India Women Team Record: వన్డేల్లో మహిళల జట్టు సరికొత్త రికార్డు…హైయెస్ట్ టోటల్ నమోదు.. ఎంతంటే?
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ( Kolkata Knight Riders ) విజయపథంలో నడిపించిన శ్రేయాస్ ( Shreyas Iyer ) , ఆ తర్వాత KKR ఫ్రాంచైజీ అతన్ని వేదిలేసింది. ఇక 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer ) పాల్గొని రికార్డు ధర పలికాడు. INR 26.75 కోట్ల ధరకు శ్రేయాస్ అయ్యర్‌ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. దింతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారీ ధర పలికిన రెండవ ప్లేయర్ గా .శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer ) రికార్డు లోకి ఎక్కాడు. రిషబ్ ప్యాంటు 27 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.
ఇక 30 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్… దేశవాళీ క్రికెట్ , IPLలో అపారమైన విజయాన్ని సాధించాడు. దేశవాళీ క్రికెట్ , IPL ఈ రెండు ఫార్మాట్లలో నాలుగు టైటిల్స్ గెలుచుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్ గా నిలపడమే కాకుండా, 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టును విజేతగా నిలిపాడు. ఆ జట్టుకు కూడా అయ్యర్ ( Shreyas Iyer ) నాయకత్వం వహించాడు. అంతే కాదు రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో కూడా భాగమయ్యాడు శ్రేయాస్ అయ్యర్.
Also Read: Rohit Sharma: నా వల్ల కాదు.. టీమిండియాకు కొత్త కెప్టెన్ ను పెట్టుకోండి !
ఇక తాజా పరిణామంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు అయ్యర్. తనకు కెప్టెన్సీ ఇవ్వడం పై స్పందించాడు అయ్యర్. “జట్టు నాపై నమ్మకం ఉంచినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. కోచ్ [రికీ] పాంటింగ్‌తో కలిసి మళ్లీ పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని అయ్యర్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. “సమర్థవంతమైన, నిరూపితమైన పేయర్స్ గొప్ప కలయికతో జట్టు బలంగా కనిపిస్తోంది. మా తొలి టైటిల్‌ను అందించడానికి మేనేజ్‌మెంట్ చూపిన నమ్మకాన్ని తిరిగి చెల్లించాలని నేను ఆశిస్తున్నాను.” అంటూ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer ) పేర్కొన్నారు.
ఇక ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మూడు జట్లకు ఆడాడు శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer ). మొదట DC తర్వాత కోల్కతా తరఫున ఆడాడు శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer ). IPL 2025 లో మూడవ ఫ్రాంచైజీ PBKS కి ఆడనున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2015లో అరంగేట్రం చేసాడు శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer ).
Here is the list of Punjab Kings’ captains so far in IPL history 🔴🏏
Shreyas Iyer becomes the 17th skipper to lead PBKS. Will he end the long-awaited drought? 🤔#ShreyasIyer #PunjabKings #IPL2025 #Sportskeeda pic.twitter.com/zUVnPRnuWP
— Sportskeeda (@Sportskeeda) January 12, 2025