BigTV English

HMFW Jobs: రూ.35,000 జీతంతో ఉద్యోగం.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. వీళ్లందరూ అర్హులే..

HMFW Jobs: రూ.35,000 జీతంతో ఉద్యోగం.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. వీళ్లందరూ అర్హులే..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే మెగా డీఎస్సీపై క్లారిటీ వచ్చేసింది. వేలాది టీచర్ పోస్టులను వచ్చే అకడమిక్ ఇయర్ నాటికి భర్తీ చేస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక గత ప్రభుత్వం విడుదలచేసిన 6100 టీచర్ పోస్టుల భర్తీని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోంది.


తాజాగా వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ఏపీ సర్కార్ రెడీ అయ్యింది. ల్యాబ్ టెక్నీషియన్ 2, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO), సానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్ (SAW) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ హెల్త్ మెడికల్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(HMFW) డిపార్ట్ మెంట్ మొత్తం 61 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 61


ఇందులో..

1. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ 2 – 3 పోస్టులు

2. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ‌- 20 పోస్టులు

3. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్  ‌- 38 పోస్టులు

విద్యార్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.

ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ 2 ఉద్యోగానికి ఇంటర్మీడియట్+డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పాసై ఉండాలి.(ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి ఈ సర్టిఫికెట్స్ పొందివుండాలి. ఇక ఇంటర్ (వొకేషనల్) పూర్తి చేసి ప్రభుత్వ గుర్తింపుపొందిన సంస్థలో ఏడాది అప్రెంటిస్ చేసినవారు కూడా అర్హులే.

ఇక ఫీమెయిల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు టెన్త్ లేదా అందుకు ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ వుండాలి. సానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించివుంటే చాలు.

వయస్సు: అభ్యర్థులు 18 నుండి 42 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు వుంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కు అదనంగా 3 ఏళ్లు,  దివ్యాంగులకు 10 ఏళ్ల వయసు సడలింపు వుంటుంది.

జీతం:  ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.15,000 నుండి రూ.32,600 వరకు సాలరీ వుంటుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి అలవెన్సులు వుండవు.

దరఖాస్తులకు ప్రారంభ తేది: 2025 జనవరి 6

దరఖాస్తుకు ముగింపు తేది: 2025 జనవరి 20

వర్కింగ్ డేస్ లో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

దరఖాస్తు చేసే విధానం: డిమాండ్ డ్రాప్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. డిస్ట్రిక్ మెడికల్ ఆండ్ హెల్త్ ఈఫీసర్ కాకినాడ పేరిట ఏదయినా బ్యాంకులో డీడీ కట్టాలి.

 దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది. (ఎస్సి, ఎస్టి, దివ్యాంగులకు రూ.200 అప్లికేషన్ చెల్లించాల్సి ఉంటుంది.)

ఈ డీడీని అప్లికేషన్ ఫారంపై జతచేసి దరఖాస్తు చేయాల్సి వుంటుంది.

Also Read: Scientist Jobs in CRRI: ఈ అర్హత ఉన్న వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.1,35,000.. DON‘T MISS..

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: మొత్తం 100 మార్కులకు గాను 75 శాతం అకడమిక్ మార్కులను కేటాయిస్తారు. ఇక మిగతా మార్కులను వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని కేటాయిస్తారు. మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఫైనలైజ్ చేస్తారు. డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు.

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×