Gundeninda GudiGantalu Today episode January 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. రవి, శృతిలను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని ప్రభావతి కిందకు తీసుకొస్తుంది. బాలు ఎక్కడ అంటే బాలు బయట ఉన్నాడు మామయ్య అని మీనా అంటుంది. బాలుని మీనా బలవంతంగా లోపలికి తీసుకొని వస్తుంది. వాళ్లని ఆశీర్వదించాలి అని సత్యం అంటాడు. అది విన్న బాలు మీరందరూ ఉన్నారు కదా మంచివాళ్లు మీరు ఆశీర్వదిస్తే చాల్లే నేను ఎందుకు అని అనగానే శృతి మీరందరూ ఆశీర్వదించారు కదా ఇంకెవరి ఆశీర్వాదాలు కోసం నేను అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు అని శృతి అంటుంది. దానికి ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక బాలు కోపం రెట్టింపు అవుతుంది. ఆంటీ అంకుల్ మీరు ఆశీర్వదించారు మాకు అదే చాలు. మేము ఆశీర్వాదాలు కోసం వేరే వాళ్ళని బెగ్ చేయాల్సిన అవసరం మాకు లేదని శృతి పొగరుగా అంటుంది.. ఇక బాలు మాత్రం చూశారా ఆ సురేంద్రకు చీర కట్టినట్టే ఎలా ఉందో పొగరుగా మాట్లాడుతుంది డబ్బులు మానేసి అంటారు.. ఇక అందరూ కలిసి శృతి, రవి లను ఆశీర్వదిస్తారు. ఇక సత్యం ముగ్గురు కోడల్ని దగ్గరికి వెళ్ళమని చెప్పి ఇంట్లో సొంత అక్క చెల్లెలు లాగా మీరు కలిసిపోవాలి ఏ విషయంలోనూ గొడవలు పడకూడదని సలహా ఇస్తాడు. ఆ తర్వాత రవి శృతిలు ఇద్దరు శోభనం గదిలోకి వెళ్తారు.. రొమాన్స్ లో మునిగి తేలుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతి రూమ్ కి వెళ్ళిపోతుంది. ఇక రవి లోపలికి వెళ్ళగానే క్లాస్ తీసుకుంటాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో మామ గారిని మామగారిలాగే చూడాలి ఎదిరించి మాట్లాడకూడదు నువ్వు అలా హగ్ చేసుకోవడం అందరికీ ఇబ్బందిగా అనిపించింది అని అంటాడు దానికి శృతి ఇది శోభనం గదినా లేకపోతే క్లాస్ రూమ్ నా నువ్వు క్లాస్ తీసుకుంటున్నావ్? నేను ఇలాగే ఉంటాను అందులో తప్పేమిటి నాకు సంతోషం వస్తే మా నాన్నని ఎలా హగ్ చేసుకుంటాను అలాగే హగ్ చేసుకున్నాను అనేసి అంటుంది. ఇక శృతి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. ఇద్దరు రొమాన్స్లు మునిగిపోతారు. నిద్ర రావడం లేదని మీనా దగ్గరికి వస్తాడు. నాకు నిద్ర రావట్లేదు మనం పైకి వెళ్దాం రా అంటే ఎందుకండీ పైకి అని మీనా కావాలని అడుగుతుంది. బయట చల్లగాలి ఉంది నువ్వు రా నీతో పనుందని లాక్కెళ్ళిపోతాడు. పైకి వెళ్ళగానే మీ నాతో మాట్లాడుతుంటే మీనా చల్లగాలికి ఇంకేమనిపిస్తుంది అని అడుగుతుంది అంత లేదమ్మా అనేసి బాలు అంటాడు.. ఆకాశాన్ని చూపిస్తూ ప్రకృతి ఆస్వాదించమని మీనాకు కబుర్లు చెప్తాడు. కానీ, మీనా అలసిపోయి పడుకుంటుంది. ఇక బాలు చేసేది ఏమీ లేకుండా మీనా ను చూస్తూ సైలెంట్ గా పడుకుంటాడు. మరోవైపు.. మౌనిక తన అన్నయ్య బాలు ఇచ్చిన గాజులను చూసుకుంటూ సంతోషం పడుతుంది. ఇంతలోనే సడన్ గా రూమ్ లోకి సంజు వస్తాడు. తాను వస్తే భయపడాలని తెలియదా ముందు వెళ్లి మందు స్టప్ తీసుకొని రమ్మని ఆర్డర్ వేస్తాడు.
మౌనిక వెళుతుంటే సంజయ్ ఆపుతాడు. మనం గుడికి వెళ్ళినప్పుడు లేని గాజులు గుడి నుంచి వచ్చిన తర్వాత నీ చేతికి ఎలా వచ్చాయి ఇవి బంగారు గాజులే కదా మీ అమ్మ పంపించిందా లేకపోతే మీ నాన్న తీసుకొచ్చి ఇచ్చాడా లేదా మీ ఆ బాలు నీ చేతికి వేశాడా గుళ్లో ఆ బాలుని కలిసావు కదా అనేసి ప్రశ్నల మీద ప్రశ్నలు మౌనిక అని అడుగుతాడు. దానికి మౌనిక భయపడుతూ షాక్ అవుతుంది. మౌనిక వాళ్ళ అత్త సువర్ణ వచ్చి ఆ గాజులు వేసింది నేనే అని అంటాడు.. ఎందుకురా అలా అమ్మాయిని భయపెడతావని మౌనికను లోపలికి తీసుకెళ్తుంది. ఇక ఉదయం ప్రభావతి లేవగానే మీనా పై అరుస్తుంది. కాఫీ చిక్కగా పెట్టాలని చెప్పి రవి శృతిలకు తీసుకెళ్తుంది. అక్కడ రవి శృతి చీర మడత పెట్టడం చూసి షాక్ అవుతుంది. నువ్వు చీర మడత పెట్టడం ఏంట్రా చండాలంగా మీనకి ఇవ్వచ్చుగా మీనా మడత పెడుతుంది అని అంటుంది. అన్ని పనులు వదిన ఎలా చేస్తుంది అమ్మ ఇదేం పెద్ద పని కాదు కదా అనేసి అంటాడు. ఇది కనిపించలేదంటే పొద్దున్నే 6 గంటలకు అలా తనకు ఫోన్ వస్తే డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళింది అమ్మ అనేసి అంటాడు. ప్రభావతి కోపంగా రగిలిపోతుంది. అత్తయ్య అనే మర్యాద కూడా లేకుండా నాకు చెప్పకుండానే వెళ్ళిపోయిందని ఇది ఈరోజు తేల్చుకోవాల్సిందే అని కిందకొచ్చి పెద్ద రచ్చ చేస్తుంది ప్రభావతి..
అప్పుడే ఇంట్లోకి వచ్చిన సత్యం అడుగుతాడు. అంతేకాదు కొన్ని విషయాలను చూసి చూడనట్లు పట్టించుకోనట్లు ఉంటేనే గౌరవం దక్కుతుందని, అనవసరంగా చిన్న విషయాలను పెద్దగా చెయ్యొద్దని సూచిస్తాడు. ఇంతలోనే రోహిణి, మనోజ్ కిందికి వస్తారు. శృతి తనకు చెప్పకుండా బయటికి వెళ్లిందని తెలిస్తే వాళ్ల ముందు పరువు పోతుందని, ప్రభావతి మ్యారేజ్ చేస్తుంది. రాత్రి తనకు ఇంగ్లీషులో చెప్పిందని కానీ అర్థం కాలేదు అంటూ కవరింగ్ చేస్తుంది. ఈ విషయాన్ని రవి అర్థం చేసుకోకుండా.. సడన్గా డబ్బింగ్ స్టూడియో నుండి ఫోన్ వస్తే తన కూడా చెప్పకుండా వెళ్ళింది కదా నీకెలా రాత్రి చెప్పింది అని రవి నోరు జారుతాడు. కోడలు ముందు పరువు పోతుందని లేదు లేదు రాత్రి నాకు చెప్పింది కవరింగ్ చేస్తుంది.. ఇక మీద మాట్లాడుతుంది శృతి నాకు చెప్పింది అత్తయ్య నిద్రపోతుంది లేచిన తర్వాత చెప్పమని చెప్పిందని అంటుంది. నన్ను వేరే దాన్ని చేస్తున్నానో మీరందరూ కలిసి ప్రభావతి వెళ్తుంది. రోహిణి అత్తయ్య మేనేజ్ చేయాలని చూసింది కానీ దొరికిపోయింది కదా అనేసి అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో గదికి తాళం వేసుకొని వెళ్తాడు ప్రభావతి మాత్రం మీనాపై చిందులేస్తుంది. రేపు ఏం జరుగుతుందో చూడాలి..