Avatar 3 Teaser :అవతార్(Avatar).. హాలీవుడ్ చిత్రమైనా.. ఈ చిత్ర ఫ్రాంచైజీల గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. చూసే ఆడియన్స్ ను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే అవతార్, అవతార్ 2 చిత్రాలు వందలకోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయగా.. ఇప్పుడు అవతార్ 3 కూడా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ (James camaron) స్పష్టం చేశారు. అంతేకాదు ఈసారి ఊహలకు మించి ఉంటుందని, ఒక అద్భుతం సృష్టించబోతున్నామంటూ జేమ్స్ కెమరూన్ తెలిపారు. మరి అసలు ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
అవతార్..
సాధారణంగా హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియన్ ఆడియన్స్ కూడా అమితంగా ఇష్టపడే ఇంగ్లీష్ చిత్రాలలో అవతార్ చిత్రం కూడా ఒకటి. 2009లో విడుదలైన ఈ సినిమా హాలీవుడ్ బాక్సాఫీస్ ను షేర్ చేసింది.మన తెలుగు రాష్ట్రాలలో కూడా కళ్ళు చెదిరే రేంజ్ లో కలెక్షన్స్ వసూల్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాదులో ప్రసాద్ మల్టీప్లెక్స్ లాంటి థియేటర్లలో సంవత్సరాల తరబడి ఈ సినిమా ఆడింది అంటే అటు పిల్లల్ని కూడా ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పండోరా అనే కల్పిత పూరిత గ్రహంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు కళ్ళకు కట్టినట్టు చూపించి, ఒక కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేశారు హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్. ప్రపంచవ్యాప్తంగా అప్పట్లోనే 3 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది.
అవతార్: ది వే ఆఫ్ వాటర్..
ఇక 2022లో అవతార్ చిత్రానికి సీక్వెల్ గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. అయినా సరే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. సుమారుగా ఫుల్ రన్ ముగిసే సరికి 2.3 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుండి 50 కోట్ల రూపాయల వరకు షేర్ వసూలు చేసింది ఈ సినిమా.
అవతార్: ది ఫైర్ అండ్ యాష్
అయితే ఇప్పుడు అవతార్ 3 విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ‘అవతార్ ది ఫైర్ అండ్ యాష్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. 2025 డిసెంబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. మార్చి నెలలో ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న టీజర్ వీడియోని విడుదల చేయబోతున్నట్లు డైరెక్టర్ తెలిపారు.
అద్భుతం సృష్టించబోతున్నాం..
ఇదే విషయంపై డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ మాట్లాడుతూ.. “అవతార్ పార్ట్ 3 ఒక వెండితెర అద్భుతం.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత కచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు. ముందు రెండు భాగాల్లో చూపించని పాత్రలు ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఆ రెండు భాగాల్లో ఉన్న సన్నివేశాలను పునరావృతం కాకుండా కొత్త వెర్షన్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఒకసారి కొత్త అద్భుత ప్రపంచంలోకి ప్రేక్షకులు ప్రయాణం చేసినట్టుగా ఈ సినిమా ఉంటుంది. కొన్నిసార్లు రిస్క్ తీసుకొని ఆడియన్స్ కి థ్రిల్లింగ్ అనుభూతిని అందించాలి. లేకపోతే మనం పడిన కష్టం, సమయం, పెట్టిన డబ్బులు అన్నీ కూడా వృధా అవుతాయినా మనసుకి ఎంతో సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది” అంటూ హాలీవుడ్ దిగ్గజం చెప్పుకొచ్చారు. మొత్తానికైతే హైప్ పెంచేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.