Gundeninda GudiGantalu Today episode January 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలుకు ఫోన్ చేసిన మీనా కోపంగా మాట్లాడటంతో బాలు ఏమైందని కంగారు పడుతూ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే మీ నాన్నని పిలిచి అరుస్తాడు. ఇంకా ప్రభావతి వచ్చావా తాళం వేసుకొని వెళ్ళావా? అంత నీ ఇష్టమేనా అని అడుగుతుంది. ఇది నా ఇల్లు మా నాన్న నాకు ఇచ్చిన ఇల్లు అనేసి ప్రభావతి అంటుంది. దానికి బాలు మీ నాన్న అగ్గిపెట్టను ఇస్తే మా నాన్న రైల్వే పెట్టె అంత చేశాడు ఇన్ని గదులు పెట్టాడు ఇప్పుడు అది మా నాన్నదే అంటే మాదే నీకు మాట్లాడే రైట్ లేదు అని అందరినీ ఒక దుమ్ము దులిపేస్తాడు. ఇక మీనా ఏడవడం చూసి అందర్నీ నిలదీస్తాడు. ప్రభావతి అన్న మాట తెలుసుకుని షాక్ అవుతాడు.. మీనా ఏడవడంతో బాలు కోపంగా అందరి పైన అరుస్తాడు. ప్రభావతి అన్న మాటలు విని బాలు షాక్ అవుతాడు. నీకు ఒక కూతురు ఉంది కదా మీనా కూడా నీకు కూతురు లాంటిదే కదా నువ్వు ఎందుకు ఇలా అంటున్నావ్. ఎంతమాటన్నావో నీకు అర్థం అవుతుందా అని ప్రభావతిపై బాలు కోపంగా అరుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలుని మీనా ఇంటికి రప్పిస్తుంది. బాలు రాగానే ప్రభావతి చిందులేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు తాళం వేసుకొని వెళ్ళిపోతే రవి శృతి, రవిలు ఎక్కడ ఉంటారో ఆలోచించరా వాడు నీ తమ్ముడు అనే సంగతి కూడా నువ్వు మర్చిపోతున్నావని ప్రభావతి అరుస్తుంది.. అయినా రూమ్ కి తాళం వేసుకొని వెళ్ళమని ఎవరు చెప్పారు అసలు రూమ్ కి తాళం వేయడానికి నువ్వెవరు అని ప్రశ్నిస్తుంది ప్రభావతి. దానికి బాలు అడగడానికి నువ్వెవరు అంటాడు.. తనకి మళ్లీ ఈ ఇల్లు నా ఆస్తి మా నాన్న నాకు రాసిచ్చారు అని అంటుంది. నాన్న నీకు ఇచ్చింది అగ్గిపెట్టె అంత ఇండ్లు మాత్రమే. మా నాన్న దాని రైల్వే పెటేంత చేసాడు ముగ్గురు కొడుకులు ఉండడానికి సులువుగా ఆయన చేయించుకున్నాడని బాలు తండ్రి గురించి చెప్తాడు. అసలేం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావ్ ? అని బాలు అడిగితే ఏం చెప్పదు. రోహిణి ఏమైనా అన్నదా? లేదా? మనోజ్ ఏమైనా అన్నాడా అంటూ దీంతో ప్రభావతి కంగారుపడుతుంది. మీనా తన పేరు ఎక్కడ చెబితే బాలు ఎలా రియాక్ట్ అవుతాడోనని ప్రభావతి భయపడుతుంది.. దానికి మీనా నా కర్మకొద్దీ నేను ఏడవాల్సి వస్తుందిలే అనేసి ఏదో కవర్ చేస్తుంది. కానీ బాలు మాత్రం ఇంట్లోనే వాళ్ళందరినీ మధ్యలోకి లాగుతూ మీనాన్ని అడుగుతాడు. మీనా మాత్రం అసలు నిజం బయట పెట్టడానికి ఇష్టపడదు కానీ రోహిణి మాత్రం అత్తయ్య అన్నది అని అంటుంది. ఇక మీనా ఏం లేకుండా నీ మొగుడు పక్కన పడుకోలేదా అన్నట్టు మాట్లాడిందండి అని అంటుంది. అది విన్న బాలు బయట ఉన్న సత్యం ఇద్దరూ షాక్ అవుతారు.
కూతురు లాంటి అమ్మాయి మీద ఇలాంటి మాటలు అనడం నీకు మంచిదేనా ఎందుకంత మితిమీరి ప్రవర్తిస్తున్నావని బాలు ప్రభావతిని అడుగుతాడు. ప్రభావతి మాత్రం మౌనంగా ఉంటుంది. కోపం అంటే అవన్నీ సీరియస్ గా తీసుకోవాలా ఇప్పుడు ఇదంతా కాదు నువ్వు రవికి రూమ్ కి ఇస్తావా ఇవ్వవా అని ప్రభావతి నిలదీస్తుంది. ఇంతకుముందు ఒక ఆలోచన ఉండేదేమో ఇప్పుడు చచ్చినా నేను ఇవ్వను అని తెగేసి చెప్తాడు బాలు. వెంటనే సత్యం ఇంట్లోకి వస్తాడు.బాలు జరిగిన విషయాన్ని తన తండ్రికి చెబుతాడు. మీ భార్య నా భార్యను ఇలా అవమానించిందని, ఒక ఆడపిల్లతో మాట్లాడే విధానం ఇదేనా అంటూ ప్రశ్నిస్తాడు బాలు. దీంతో అవమానంగా భావించిన సత్యం.. ప్రభావతిని లోపలికి తీసుకెళ్లి అడుగుతాడు నువ్వు నీ కూతురు లాంటి అమ్మాయిని పట్టుకొని అలా అంటావా మీనా తిరిగి నీకు ఈ వయసులో బెడ్ రూమ్ అవసరమా అనేసి నిన్నంటే నువ్వు మొహం ఎక్కడ పెట్టుకుంటావని సత్యం ప్రభావతికి క్లాస్ పీకుతాడు. ఇద్దరు కోడలు డబ్బింటి వాళ్ళని వేరేలా చూస్తావ్ మీనా ను వేరేలా చూస్తావని బాగా తిట్టి క్లాస్ పీకుతాడు. ఇక బయటికి రా అందరికి ఈ విషయం చెప్పాలని సత్యం అంటాడు.
ఇక బయటికి వచ్చిన అందరూ రవి కి రూమ్ ఇవ్వడానికి గురించి మాట్లాడతారు. బాలు నా రూమ్ నే అడుగుతారు. 40 లక్షలు మింగినోడు రూమ్ ఇవ్వచ్చు కదా వాడు రూమ్ ఇచ్చి 40 లక్షల తెచ్చిన తర్వాత రూమ్ ని తీసుకోవచ్చని బాలు అంటాడు.. ఇక ఒక రెండు ఒకరు రూమ్ గురించి గొడవపడతారు దాంతో సత్యం నేనొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు ఇకమీదట నుంచి మా రూమ్ ని వాళ్ళకి ఇస్తాము ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుర్లు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అని సత్యం అంటాడు. ఇక దానికి బాలు మీనా అస్సలు ఒప్పుకోరు మీరు ఎప్పుడు గది దాటి బయటికి రాలేదు మీరు ఎలా ఇస్తారు మా రూమ్ తీసుకోండి మేము ఎక్కడైనా ఉంటామనేసి బాలు అంటాడు. సత్యం మాత్రం ఆ మాట వినకుండా వాళ్లకి రూమ్ ఇవ్వడానికి ఒప్పుకొని చాప, దిండు తీసుకొచ్చి హాల్ లో వేస్తాడు. అందరూ బయట కింద పడుకోవద్దని సత్యంతో అంటారు.. ఇక అక్కడితో ఎపిసోడ్ అవుతుంది పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో శృతి బాలు మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..