Gundeninda GudiGantalu Today episode june 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతిని రోహిణి చీరతో బుట్టలో పడేసుకుంటుంది. అయితే బాలు మీనా వచ్చి సర్ప్రైజ్ అని అందరినీ బయటకు తీసుకొని వస్తారు. కారును చూసి ప్రభావతి షాక్ అవుతుంది. ఎందుకు ఏమైంది ఈ కారు ఎలా వచ్చింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అయితే నా భార్య నా కోసం కొనిచ్చిందని బాలు గొప్పగా చెప్తాడు. దీని రేటు ఎంతో అని ప్రభావతి ఆశ్చర్యంగా అడుగుతుంది.. దాదాపు పది లక్షలు ఉంటుందని బాలు అనగానే మనోజ్ ఇది సెకండ్ హ్యాండ్ కార్ల ఉంది ఏ రెండు మూడు లక్షల ఉంటది లే అనేసి అంటాడు.. అవును ఆ మూడు లక్షలు మా ఆవిడ పూలమ్మగా వచ్చిన డబ్బులతో నాకు గిఫ్ట్ ఇచ్చింది అని అంటాడు. బాలు అటు తిరిగి ఇటు తిరిగి రోహిణికి ఇస్తాడు.. దాంతో ప్రభావతి రోహిణి మీద పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మౌనిక ఆలోచిస్తూ ఉంటుంది. అయితే సువర్ణ మౌనిక బ్యాగులు తీసుకొని వచ్చి ఇక నుంచి వెళ్ళిపో అమ్మ. వాడు మారతాడని నమ్మకం నాకు లేదు అని అంటుంది. నేను వెళ్ళిపోవాలని అనుకోవడం ఒక్క నిమిషం పని అత్తయ్య ఇప్పుడు నేను వెళ్ళిపోతే అక్కడ మా అన్నయ్య వచ్చి మీ అబ్బాయిని చంపేస్తాడు అది మీకు మంచిదేనా..? మీరు నాకు సపోర్ట్ గా ఉన్నంత వరకు నాకు ఏం కాదు అని అంటుంది. మీ మామయ్య తో నేను మొదట్లో అనేక ఇబ్బందులు పడ్డాను.. సంజయ్ కడుపున పడ్డం తర్వాత అలవాటైపోయింది అని సువర్ణ అంటుంది. నాకు వెయిట్ చేసేంత ఓపిక ఉంది అత్తయ్య.. కచ్చితంగా ఆయన మారతాడు అని మౌనిక అంటుంది.
మీనా దగ్గరికి రోహిణి వచ్చి కారు గురించి వివరాలు అడిగి తెలుసుకుంటుంది. నిజంగానే ఆ కారును నువ్వు అంత డబ్బులు పెట్టి కొన్నావా అని అడుగుతుంది.. అవును రోహిణి ఎందుకలా అడిగావు అని నేను అడుగుతుంది. ఏం పేరు మాలల ఆర్డర్ కడితే అంత అమౌంట్ వచ్చిందా.. నీకు నా పెద్దపెద్ద ఆర్డర్ చేసే వాళ్లు ఉన్నారు. మరి నీలాగా కార్లు కొనలేదు కదా అని రోహిణి డౌట్ గా అడుగుతుంది. దానికి రోహిణి కి మీనా దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది. నిజం చెప్పాలంటే మేమంతా డబ్బులు కట్టలేదు కొంత డబ్బులు కట్టి కారును తీసుకొచ్చాం మిగతావి ఈఎంఐ లో కట్టాలి అని చెప్తుంది..
రోహిణి మీనను ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం శృతి వింటుంది.. అసలు నువ్వు జలసి తోనే అడుగుతున్నావా అని అంటుంది. జలస్ లేదు ఊరికే అడిగి తెలుసుకుందామని అని రోహిణి అంటుంది.. భార్య భర్తకు కారు కొనించడంలో తప్పులేదు కదా.. ఇవన్నీ అడగడం తప్పు అనేసి రోహిణి పై శృతి శ్రీలత అవుతుంది. ఆ తర్వాత రోజు శృతి వాళ్ళ అమ్మ ఇంటికి వస్తుంది.. రోహిణి పార్లర్ పెట్టావు కదా అని అడుగుతుంది. పార్లర్ విషయం మరోసారి బయటపడితే ప్రభావతి అస్సలు ఊరుకోదని రోహిణి మాట మార్చేస్తుంది..
ఏంటి వదిన గారు ఇలా వచ్చారు అని ప్రభావతి అడుగుతుంది.. శృతి లేదు ఆంటీ డబ్బింగ్ కి వెళ్ళింది అని రోహిణి అంటుంది.. అయితే శృతి వెళ్లిన విషయం నాకు తెలుసు అమ్మ నేను వచ్చింది మీ అత్తయ్య గారి కోసమేని శోభ అంటుంది. ఎన్నాళ్ళకు నాకోసం మీరు వచ్చారు వదిన గారు ఏంటి విషయం చెప్పండి అని ప్రభావతి అడుగుతుంది. పెళ్లయ్యి ఇన్నాళ్లు అయింది కదా ఏది మా ఇష్ట ప్రకారం జరగలేదు కనీసం నల్లపూసలు గుచ్చే కార్యక్రమం అన్నా మా ఇష్టప్రకారం చేయుటమని అనుకుంటున్నామని శోభా అంటుంది. మీరు చాలా సంతోషకర వార్తను తీసుకొచ్చారు వదినగారు అలాగే చేద్దాం అని అంటారు. అయితే రోహిణి పెళ్ళై కూడా చాలా రోజులైంది కదా రోహిణి కి కూడా నల్లపూసల కార్యక్రమం చేపిద్దామని అంటారు. ఎలాగో మేము పెద్ద హాలి బుక్ చేస్తున్నాం కదా ఇద్దరికీ ఒకేసారి చేస్తే బాగుంటుంది కదా అని అని అంటుంది. సరే నేను వెళ్లి వస్తాను అన్ని ఫిక్స్ అయిన తర్వాత నేను కాల్ చేసి చెప్తాను అని శోభా అంటుంది.
Also Read:ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
విన్నావు కదా నల్లపూసలు గుచ్చే కార్యక్రమానికి మీ నాన్న తప్పనిసరిగా రావాలి ఆ కార్యక్రమం ఇప్పుడే జరగాలని ప్రభావతి అంటుంది. ఇక రోహిణి పార్లర్కి వెళ్లి విజ్జి తో ఈ విషయాన్ని చెప్తుంది. మామయ్యగా మటన్ కొట్టు మాణిక్యాన్ని సెట్ చేసినట్టు నాన్నగా చికెన్ కొట్టు చిన్నాన్న సెట్ చేద్దామని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..