Harshit Rana – Kamboj : టీమిండియా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని పరిస్తితి నెలకొంది. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ప్రతిభ చూపి టీమిండియాలో చోటు సంపాదించుకుంటున్నారు. అందులో కొందరూ టాలెంట్ చూపించినప్పటికీ వారికి టీమిండియాలో చోటు లభించడం లేదు. దీనికి రకరకాల కారణాలు ఉంటున్నాయి. కొందరూ సెలక్టర్ల కి తెలిసిన వారు.. మరికొందరూ కోచ్ లకి తెలిసిన వారు.. ఇలా రకరకాలుగా రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. టీమిండియా క్రికెట్ లో పాలిటిక్స్ జరిగేది నేటి నుంచి కాదు.. చాలా కాలం నుంచి ఇలాంటి తతంగమే నడుస్తోంది. కేవలం టాలెంట్ ఉన్న వారిని సెలక్ట్ చేయడం చాలా అరుదుగా చోటు చేసుకోవడం విశేషం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకోవడం గమనార్హం.
Also Read : Indian Players : KKR ను వదిలేస్తే.. దరిద్రం పోయి అదృష్టం వస్తుంది.. ఇదిగో వీళ్ళలాగే
ఐపీఎల్ 2025 సీజన్ లో అద్భుతంగా ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లలో అన్షుల్ కాంబోజ్ ఒకడు. అన్షుల్ కాంబోజ్ ఫిబ్రవరి 2022లో త్రిపురతో జరిగిన రంజీ ట్రోఫీలో హర్యానా తరపున ఆరంగేట్రం చేసి తన ప్రతిభను కనబరిచాడు. 2022-23 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్ ల్లో 7 వికెట్లు.. 2023-2024 విజయ్ హజారే ట్రోఫీలో హర్యానా తరపున 10 మ్యాచ్ ల్లో 17 వికెట్లు తీసి హర్యానా టైటిల్ సాధించడంలో తన పాత్ర పోషించాడు. 2024 ప్రీమియర్ లీగ్ వేలంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఫస్ట్ క్లాస్ సర్క్యూట్ లో 2024-25 దులీప్ ట్రోఫీకి ఎంపికై 17.12 సగటుతో 3 మ్యాచ్ లలో 16 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికయ్యాడు. 2025 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కాంబోజ్ అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ రెండింటిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ టీమిండియా కోచ్ గౌతమ్ గంబీర్ ఇంగ్లాండ్ టూర్ కి హర్షిత్ రాణాని సెలెక్ట్ చేశాడు.
Also Read : BCCI Pay IPL Franchise: ఆ ఐపిఎల్ టీమ్‌కు రూ.538 కోట్లు చెల్లించండి.. బిసిసిఐని ఆదేశించిన హై కోర్టు
అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కాంబోజ్ ని ఎందుకు సెలెక్ట్ చేయడం లేదని పలువురు క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇందుకు ఒక కారణం ఉంది. కేకేఆర్ జట్టు తరపున గంబీర్ ఆడిన సమయంలో హర్షిత్ రాణాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు గంబీర్. అందుకే మొదటి నుంచి గంబీర్.. హర్షిత్ రాణాను పొగుడుతున్నాడు. వాస్తవానికి టీమిండియాలోకి హర్షిత్ రానా రావడానికి ముఖ్య కారణం గౌతమ్ గంభీరే. కానీ కాంబోజ్ ఐపీఎల్ లో హర్షిత్ రాణా కంటే అద్భుతంగా ఆడినప్పటికీ హర్షిత్ రానా ను ఇంగ్లాండ్ కి తీసుకువెళ్లడం విశేషం. ఇలాంటి రాజకీయాలు నడిస్తే.. టీమిండియాలో టాలెంట్ ఆటగాళ్లకు నిరాశ తప్పదని చెప్పకనే చెప్పవచ్చు. ఇక టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తో జరబోయే 5 టెస్ట్ సిరీస్ ల మ్యాచ్ లో మరీ హర్షిత్ రాణా ఎలాంటి ప్రతిభ కనబరుస్తాడో వేచి చూడాలి మరీ.